బక్కచిక్కిన ఏనుగుతో ఉత్సవాల్లో బలవంతపు ఊరేగింపు, ఏనుగు మృతి

టికిరి

ఫొటో సోర్స్, SAVE ELEPHANT FOUNDATION

ఈ ఏడాది ఆరంభంలో తీవ్ర అనారోగ్యానికి గురైన 70 ఏళ్ల ముసలి ఏనుగు టికిరి చనిపోయినట్లు జంతుహక్కుల స్వచ్ఛంద సంస్థ చారిటీ తెలిపింది.

శ్రీలంకలోని కాండీలో ఏటా పెరాహెరా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో 60 ఏనుగులతో బలవంతంగా ఊరేగింపు చేయిస్తుంటారు. బక్కచిక్కిన టికిరి కూడా ఇందులో ఉండేది.

అయితే, ఈ ముసలి ఏనుగును హింసిస్తున్నారంటూ సేవ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ (ఎస్‌ఈఎఫ్) ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఈ ఘటనపై శ్రీలంక పర్యటక శాఖ మంత్రి బీబీసీతో మాట్లాడుతూ, ఆ ఏనుగును ఉత్సవాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

బక్కచిక్కి తీవ్ర అనారోగ్యంతో ఉన్న టికిరి చివరకు తన మావటి దగ్గరకు చేరుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

కానీ, సేవ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ (ఎస్‌ఈఎఫ్) వ్యవస్థాపకురాలు లెక్ ఛాయిలెర్ట్ మంగళవారం టికిరి చనిపోయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

''టికిరి ఇబ్బందులు ఇక తొలగిపోయాయి. ఇప్పుడు దాని ఆత్మకు విముక్తి కలిగింది. ఇక తనకు ఎలాంటి హాని జరగదు'' అని లెక్ ఛాయిలెర్ట్ పేర్కొన్నారు.

''రిప్ డియర్ టికిరి, నీతో, నీ స్నేహితులతో క్రూరంగా ప్రవర్తించిన ఈ ప్రపంచం వైపు ఎప్పుడూ తిరిగి చూడకు'' అని ఆవేదనతో పోస్టు చేశారు.

టికిరి ఏనుగు

ఫొటో సోర్స్, SAVE ELEPHANT FOUNDATION

టికిరికి ఏమైంది?

గత ఆగస్టులో బక్కచిక్కిన టికిరికి రంగురంగుల దుస్తులు అలంకరించి పెరాహెరా ఉత్సవంలో బలవంతంగా ఊరేగింపు నిర్వహించారు. దీన్ని ఫొటో తీసిన ఎస్‌ఈఎఫ్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే, ఈ ఉత్సవాన్ని నిర్వహించే బౌద్ధ దేవాలయ ప్రతినిధి మెట్రో మీడియాతో మాట్లాడుతూ, టికిరి జీర్ణ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతోందని, అందువల్లే బరువు పెరగడం లేదని వివరణ ఇచ్చారు.

టూత్ రెలిక్ దేవాలయ ప్రతినిధి అప్పట్లో ఇదే ఘటనపై స్పందిస్తూ, జీర్ణసంబంధిత వ్యాధి వల్ల దాని బలం, సామర్థ్యం ఏ మాత్రం తగ్గదు అని చెప్పారు.

కానీ, బక్కచిక్కిన టికిరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నిర్వహకులు స్పందించి దానికి వైద్యం అందించారు. చికిత్స అందించినప్పటికీ టికిరి పరిస్థితి అలానే ఉందని ఎస్‌ఈఎఫ్ పేర్కొంది.

''టికిరిని ఇతర ఏనుగుల నుంచి దూరం చేసి ఒంటరిని చేశారు. దాని భవిష్యత్తు ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది'' అని ఎస్‌ఈఎఫ్ సెప్టెంబర్ మొదటివారంలో సోషల్ మీడియాలో ప్రకటించింది.

''శ్రీలంకలోని చాలా ఏనుగుల పరిస్థితి ఇలానే ఉంది. పర్యటక రంగ అభివృద్ధి కోసం వాటిని హింసిస్తున్నారు'' అని జంతు హక్కుల సంస్థ పెటా ఇటీవల బీబీసీతో పేర్కొంది.

మరోవైపు, జంతు సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని, ఏనుగులతో ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాలకు పర్యటకులు వెళ్లరాదని జంతు హక్కుల సంఘాలు పిలుపునిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)