వైరల్ ఫొటో: మొదటి రోజు స్కూల్‌కు వెళ్తున్నప్పుడు అలా... వచ్చేటప్పుడు ఇలా..

మొదటి రోజు స్కూల్‌కు వెళ్లినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు తన బిడ్డ ఎలా ఉందో ఓ తల్లి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
''Really Funny" అని ఆమె ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోలు వేలాది మంది నెటిజన్లు షేర్ చేశారు.
స్కాట్లాండ్‌లోని ఈస్ట్ రెన్ఫ్రెషైర్‌కు చెందిన జిల్ తన కూతురు లూసీని తొలిసారి స్కూల్‌కు పంపుతున్న వేళ ఆమెను క్లిక్ మనిపించింది. తన బిడ్డ ఎంతో అందంగా ఉందని మురిసిపోయింది.
కానీ, ఆమె ఆనందం ఎంతో సేపు నిలవలేదు. స్కూల్ నుంచి తిరిగి వచ్చిన లూసీ చింపిరి జట్టు, మాసిన బట్టలతో ఆమె ముందు ప్రత్యక్షమైంది.
ఆరా తీస్తే స్కూల్‌లో తోటి పిల్లలతో ఆడుకొని బట్టలన్నీ పాడు చేసుకుందని తెలిసింది.
చెదిరిన జట్టు, మాసిన బట్టలతో ఉన్న లూసీని ఆమె మళ్లీ ఫొటో తీసింది.
తర్వాత రెండు ఫొటోలను (ఉదయం స్కూల్‌కు వెళ్లే ముందు తీసిన ఫొటో, వెళ్లి వచ్చాక తీసిన ఫొటో) తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
ఈ ఫొటోలను దాదాపు 10 వేల మంది లైక్ చేశారు. స్థానిక వార్తా పత్రిక కోరడంతో వారిని ఆ ఫొటోలు ప్రచురించుకునేందుకు జిల్ అనుమతించారు.
''నా బిడ్డకు స్కూల్‌కు వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఆమె స్కూల్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. కొత్త విషయాలు నేర్చుకోడానికి ఇష్టపడుతుంది'' అని జిల్ చెప్పారు.
సోమవారం మధ్యాహ్నం లూసీ ఇంటికి రాగానే.. ‘ఏం చేశావ్? ఇలా తయారయ్యావ్?’ అని వాళ్లమ్మ ప్రశ్నిస్తే..
దానికి ఈ చిచ్చురపిడుగు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.. ''పెద్దగా ఏం లేదులే అమ్మా''.
''వాళ్ల స్కూల్లో టీచర్లు చాలా మంచివాళ్లు. చక్కగా పాఠాలు చెబుతారు. నా బిడ్డ తొలిరోజు అక్కడ సరదాగా గడిపి ఉంటుంది'' అని జిల్ పేర్కొన్నారు.
తన బిడ్డ చేష్టలను అప్పుడప్పుడు క్లిక్‌మనిపిస్తానని ఆమె చెప్పారు. చక్కగా ముస్తాబైనప్పుడు కాకుండా సాధారణ సమయంలో ఫొటోలు తీస్తుంటానని తెలిపారు.
''ఒక వేళ నేను ఫొటో తీస్తున్నానని చెబితే లూసీ వద్దంటుందని తెలుసు. ఎందుకంటే చక్కగా లేకుంటే తను ఫొటో తీయించుకోడానికి ఇష్టపడదు'' అని జిల్ చెప్పారు.
ముగ్గురు బిడ్డల తల్లైన జిల్ భర్త.. లూసీ మొదటి రోజు స్కూల్ ఎలా జరిగింది? అని అడగటంతో.. ఈ ఫొటోలను పంపింది.
''ఫొటోలు చూసి మా ఆయన చాలా సరదాగా ఉందని అన్నారు. దీంతో అవే ఫొటోలను మా స్నేహితులు, బంధువులతో ఫేస్‌బుక్‌లో పంచుకున్నా'' అని జిల్ పేర్కొన్నారు.
''నా పోస్టు ఈ స్థాయిలో వైరల్ అవుతుందని అనుకోలేదు. తన ఫొటోలు వైరల్ కావడంతో లూసీ ‘నేను ఫేమస్ అయ్యా’నని అందరికీ చెబుతోంది'' అని అన్నారు.

కుడి కాలికి ఎడమ బూటు
జిల్ పోస్టుకు చాలా మంది తల్లిదండ్రులు ప్రతిస్పందించారు. తమ పిల్లలు స్కూల్‌కు వెళ్లినప్పుడు, తిరిగి వచ్చాక ఎలా ఉన్నారో కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
లారా నాలుగేళ్ల కూతురు హార్పర్ మొదటి రోజు స్కూల్‌కు వెళుతున్నప్పుడు చాలా ఉద్వేగానికి గురైంది. దీంతో ఒక కాలి బూటును మరో కాలికి వేసుకుంది.
''నువ్వు బూట్లను తప్పుగా వేసుకుంటున్నావని అంటే ‘పర్లేదు మమ్మీ.. ఈ రోజు నాకు చాలా గొప్ప రోజు’ అని హార్పర్ చెప్పుకొచ్చింది'' అని తన బిడ్డ అన్న మాటలను లారీ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.మొదటిసారి స్కూల్‌కు వెళ్లినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు తన బిడ్డ ఎలా ఉందో ఓ తల్లి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
- పిల్లలకు తల్లిపాలు ఎలా పట్టించాలి
- తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది.. రెండేళ్లా? ఐదేళ్లా?
- పుట్టిన మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే ఏమవుతుందంటే..
- నమ్మకాలు-నిజాలు: బిడ్డకు తల్లిపాలు మంచివా? పోతపాలు మంచివా?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ తెలివితేటలు ఉంటాయా... పాలిచ్చే తల్లి మద్యం తాగవచ్చా?
- ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?
- స్వలింగ సంపర్కుడైన కుమారుడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
- మనకు సూర్యరశ్మి ఎంత అవసరం? డీ విటమిన్ కోసం ఎండలో ఎంత సేపు ఉండాలి?
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
- గుండెజబ్బు నివారణకు నాలుగు ఔషధాలున్న ఒకే మాత్ర
- అంబేడ్కర్ హౌస్: ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదుతో లండన్లోని అంబేడ్కర్ ‘మ్యూజియం’... భవిష్యత్ ప్రశ్నార్థకం
- ఈ దేశాలు రాజధాని నగరాలను ఎందుకు మార్చాయి?
- ఆసియాలోనూ సైనిక సూపర్ పవర్ అమెరికానేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








