పిల్లలకు తల్లిపాలు ఎలా పట్టించాలి?

కేరళలో గడిచిన ఏడాది కాలంలో పాలు పడుతుండగా ఆరుగురు పిల్లలు మరణించారని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు పాలు పట్టడానికి సరైన పద్ధతి ఏదనే విషయం మరోసారి చర్చనీయాంశమైంది.
పిల్లలకు పాలు పట్టేప్పుడు కొన్నిసార్లు అవి పిల్లల అన్నవాహికకు బదులు వాయు నాళంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లొచ్చు.
దానివల్ల చాలా ప్రమాదం.
అందుకే పాలు పట్టే పద్ధతిపైన అవగాహన కోసం ఈ వీడియో చూడండి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
మరి పిల్లలకు పాలు ఎలా తాగించాలి?
పిల్లాడి తల, శరీరం సమాంతరంగా(పైన ఫొటోలో చూపిన విధంగా) లేకుండా చూసుకోవాలి. శరీరం కంటే పిల్లాడి తల కాస్త పైకి ఉండాలి.
పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు ఆదుర్దాగా పాలు తాగుతారు. అలాంటప్పుడు వాళ్లు దగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తల్లి పూర్తి సౌకర్యంగా ఉన్నప్పుడే పిల్లలకు పాలు పట్టాలి.
చేతులతో పిల్లాడి భుజాలు, తల, వీపు భాగానికి ఆసరా కల్పించాలి.
పాలివ్వడానికి పిల్లాడివైపు ఒంగకూడదు. పాలు పట్టాక పిల్లాడి వీపు నెమ్మదిగా నిమరాలి.
పాలు తాగాక పిల్లలకు తేనుపు వస్తే అది మంచి పరిణామంగానే గుర్తించాలి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








