ట్రంప్-కిమ్ భేటీ: వైట్‌హౌస్‌కు రావాలని కిమ్‌ను ఆహ్వానించిన ట్రంప్.. ఉత్తర కొరియాలో చరిత్రాత్మక సమావేశం

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సరిహద్దు (డీఎంజెడ్) వద్ద ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.
దక్షిణ కొరియా నుంచి ట్రంప్ ఈ ప్రదేశంలో అడుగుపెట్టారు. ట్రంప్‌తో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కూడా ట్రంప్‌తో పాటు ఉన్నారు.
ట్రంప్‌ది సాహసోపేతమైన చర్య అని కిమ్ అభివర్ణించారు. కిమ్‌తో ఉండటాన్ని తాను ఎంజాయ్ చేస్తానని ట్రంప్ చెప్పారు.
డీఎంజెడ్ ప్రాంతంలోని సంయుక్త భద్రతా ప్రదేశం(జేఎస్ఏ)లో ఉన్న ఒక సైనిక స్థావరంలో ఈ భేటీ జరిగింది. ‘‘మన మధ్య జరిగే భవిష్యత్ చర్చలపై ఈ భేటీ సానుకూల ప్రభావం చూపుతుంది’’ అని ట్రంప్‌తో కిమ్ చెప్పారు.
ఈ భేటీలో ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా, ఆమె భర్త జరెడ్ కుష్నెర్ కూడా పాల్గొన్నారు.
అయితే, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ మాత్రం ట్రంప్, కిమ్ చర్చల్లో పాల్గొనలేదు. ఈ చర్చలు జరుగుతున్నంత సేపు ఆయన డీఎంజెడ్ వద్ద ఉన్న మరొక భవనంలో ఉన్నారు.
‘ఉత్తర కొరియాపై ఆంక్షలు కొనసాగుతాయి’
ఉత్తర కొరియాపై అమెరికా విధించిన ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయని డోనల్డ్ ట్రంప్ తెలిపారు.
గతంలో వియత్నాం వేదికగా జరిగిన చర్చలు.. ఆంక్షలు తొలగింపు వ్యవహారం కారణంగానే అర్థంతరంగా ముగిసిపోయాయి.
అమెరికా ఆంక్షల్ని తొలగిస్తేనే.. అణు నిరాయుధీకరణకు తాము తదుపరి చర్యలు తీసుకుంటామని ఉత్తర కొరియా గతంలో ప్రకటించింది.
అయితే, ఈ ఆంక్షల్ని తొలగించాలనే తాను కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
వైట్ హౌస్‌కు రావాలని కిమ్‌కు ఆహ్వానం
సోషల్ మీడియా ద్వారా తాను చేసిన ట్వీట్‌కు స్పందించి, తనను ఆహ్వానించినందుకు కిమ్‌కు డోనల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఒకవేళ కిమ్ కనుక తనను ఆహ్వానించకుంటే మీడియా మొత్తం తనను, కిమ్‌ను విమర్శించేదని అన్నారు.
కిమ్‌తో దాదాపు గంటపాటు చర్చలు జరిపిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
తమ మధ్య జరిగిన ఈ భేటీ చాలా ప్రత్యేకమైందని ట్రంప్ చెప్పారు. మూన్ అన్నట్లుగా ఇదొక చారిత్రాత్మక సందర్భమని, ఈ భేటీకి కారణం కిమ్ అంటూ, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
తాను అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వక ముందు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
తమ మధ్య చాలా భారీ అంశాలపై చర్చలు జరిగాయని, అవి చాలా సంక్లిష్టమైనవని, అయితే అందరూ అనుకున్నంత సంక్లిష్టమైనవి కాదని ట్రంప్ అన్నారు.
కిమ్‌కు, తనకు మధ్య జరిగిన చర్చల ఆధారంగా.. సమగ్ర మంచి ఒప్పందాన్ని తయారు చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు తాము అంగీకరించామని చెప్పారు.
రెండు, మూడు వారాల్లోనే ఉత్తర కొరియా, అమెరికా బృందాలు ఈ ప్రక్రియను ప్రారంభిస్తాయన్నారు.
అమెరికా రావాలని తాను కిమ్‌ను ఆహ్వానించానని, అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో తాను చెప్పలేనని ట్రంప్ వెల్లడించారు.
‘భూమిపై భయానక ప్రదేశం’
దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలను వేరు చేసే సరిహద్దు వద్ద ఇరు వైపుల నుంచి భారీ సైనిక మొహరింపులతో ఏర్పాటైన ప్రాంతమే డీ మిలటరైజ్డ్ జోన్ (డీఎంజెడ్).
డీఎంజెడ్‌కు రెండువైపులా దాదాపు 250 కిలోమీటర్ల మేర తమతమ భూభాగాల్లో దక్షిణ కొరియా, ఉత్తర కొరియా సైనికులు పహారా కాస్తుంటారు. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉండే ఈ సైనికుల్ని గత ఏడాది కాలంగా తగ్గించారు.
‘భూమిపై ఉన్న అత్యంత భయానక ప్రదేశం’ అని ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ డీఎంజెడ్‌ను అభివర్ణించారు.
మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు
సరిహద్దు దాటి ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్. ‘ఆ లైన్ దాటి అడుగు పెట్టడాన్ని గర్వంగా భావిస్తున్నా’’ అని కిమ్‌తో ట్రంప్ అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్ కూడా ఉత్తర కొరియాను సందర్శించారు. కానీ, వారు అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత, అది కూడా విమానంలో నేరుగా రాజధాని ప్యాంగ్‌యాంగ్ చేరారు.
అసలేం జరిగింది? ఈ భేటీ ఎలా సాధ్యమైంది?
జీ 20 సదస్సు కోసం జపాన్ వెళ్లిన డోనల్డ్ ట్రంప్ అక్కడి నుంచి వెనుదిరుగుతూ ఒక ట్వీట్ చేశారు.
‘‘దక్షిణ కొరియా వెళుతున్నా (ప్రెసిడెంట్ మూన్‌తో కలిసి). అక్కడ ఉన్నప్పుడు, ఒకవేళ ఉత్తర కొరియా ఛైర్మన్ కిమ్ కనుక దీన్ని చూస్తే.. ఆయన్ను సరిహద్దు/డీఎంజెడ్ వద్ద కలుస్తా, అతని హ్యాండ్ షేక్ చేసేందుకు, హలో చెప్పేందుకు’’ అని ఈ ట్వీట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
గతంలో ఏం జరిగింది?
ఒకప్పుడు ఒకరిపై ఒకరు తిట్ల వర్షం కురిపించుకుని, పరస్పరం హెచ్చరించుకున్న డోనల్డ్ ట్రంప్, కిమ్ తొలిసారి 2018 జూన్ నెలలో సింగపూర్‌లో కలిశారు. తర్వాత రెండోసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాంలో కలిశారు.
తర్వాత చర్చల్లో పురోగతి లేదు.
ఇప్పుడు హఠాత్తుగా మరోసారి కలుసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, AFP
కిమ్ చిరునవ్వు
ఉత్తర కొరియా వస్తున్నట్లు ట్విటర్‌లో ప్రకటించి అనూహ్యంగా, అనూహ్యంగా తమ దేశానికి వచ్చిన ట్రంప్‌ను కిమ్ సాదరంగా ఆహ్వానించారు. అలాగే, తన పొరుగుదేశమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో కూడా కిమ్ నవ్వుతూ కనిపించారు.
డీ మిలటరైజ్డ్ జోన్‌గా పరిగణించే దక్షిణ కొరియా, ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల పాలకులూ ఇలా నవ్వుతూ కనిపించడం, రెండేళ్ల కిందట ఎవ్వరూ ఊహించని సందర్భం.
మొదటి త్రైపాక్షిక సమావేశం
దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, అమెరికాల మధ్య జరుగుతున్న మొదటి త్రైపాక్షిక సమావేశం ఇదని వ్యాఖ్యాత అంకిత్ పాండా అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తర కొరియా, అమెరికాల మధ్య సంబంధాలను మెరుగుపర్చేందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ప్రయత్నిస్తున్నారు.
తొలుత కిమ్‌ను, తర్వాత ట్రంప్‌ను కలిసి వారిద్దరి మధ్య మొదటి భేటీ జరుగుతుందన్న ప్రకటనలో కూడా మూన్ భాగస్వామి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, AFP

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- INDvENG : ఒత్తిడిలో ఇంగ్లండ్.. ఉత్సాహంగా భారత్
- INDvENG : ఇండియా గెలిస్తే ఇంగ్లండ్ సెమీస్ ఆశలు వదులుకోవాల్సిందేనా? ఇంగ్లండ్‌కు సొంతగడ్డ కలిసిరాలేదా?
- 'ఇండియా గెలవాలి... దేవుడా' అని పాకిస్తానీలు ఎందుకు కోరుకుంటున్నారు?
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- ట్రంప్‌తో చర్చలు విఫలమైన తరువాత మళ్లీ ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష
- 'మృత్యు ద్వీపం'లో ట్రంప్, కిమ్‌ల సమావేశం
- ‘హలో కిమ్.. నా న్యూక్లియర్ బటన్ నీకన్నా పెద్దది’
- ట్రంప్, కిమ్ భేటీ: నకిలీ కిమ్‌ను దేశం నుంచి బహిష్కరించిన వియత్నాం
- ట్రంప్ ఫౌండేషన్: ఎందుకు మూత పడుతోంది?
- సింగపూర్ ఇతర దేశాలకన్నా ఎందుకు ముందుంది?
- ట్రంప్‌కు కిమ్ లేఖ: మళ్లీ కలుద్దాం, చర్చలు కొనసాగిద్దాం
- ట్రంప్-కిమ్ భేటీ: ఉత్తర కొరియాలో ఉత్సాహం.. అమెరికాలో భిన్నాభిప్రాయం
- ట్రంప్-కిమ్ భేటీ: 2020కి కొరియా నిరాయుధీకరణను కోరుకుంటున్న అమెరికా
- ఒకప్పుడు అమెరికాతో పోరాడిన వియత్నాం.. ఇప్పుడు ట్రంప్-కిమ్ చర్చలకు ఆతిథ్యం ఎందుకిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












