'ఇండియా గెలవాలి... దేవుడా' అని పాకిస్తానీలు ఎందుకు కోరుకుంటున్నారు?

ఫొటో సోర్స్, TWITTER/NANDHUSNV
క్రికెట్ వరల్డ్ కప్ ఇప్పుడు ఎలాంటి స్థితికి చేరుకుందంటే, చాలా స్పష్టంగా ఉంది, చాలా అస్పష్టత కూడా కనిపిస్తోంది. అంటే మొత్తం మీద ఈ టోర్నమెంట్‌లో సెమీస్ చేరేదెవరో అనే ఉత్కంఠ దశకు చేరుకుంది.
గురువారం వెస్టిండీస్‌ను ఓడించిన టీమిండియా ఆదివారం ఇంగ్లండ్ జట్టుతో తలపడబోతోంది.
ఇక దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్‌ను ఓడించి జోరు మీదున్న పాకిస్తాన్ కూడా సెమీ ఫైనల్ చేరాలని తహతహలాడుతోంది. కానీ పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే, కోహ్లీ సేన ఆదివారం ఇంగ్లండ్‌ను ఓడించాలి.
ఈ స్థితిలో ఆ మ్యాచ్ గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ చాలా సరదాగా తన ట్విటర్‌లో ఒక పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరినీ ప్రశ్నిస్తున్నా, ఆదివారం జరిగే మ్యాచ్‌లో మీ సపోర్ట్ ఎవరికి? ఇండియాకా లేక ఇంగ్లండ్‌కా?’’ అన్నాడు.
నాసిర్ ఆ ప్రశ్న అడగ్గానే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి సమాధానాలు వెల్లువెత్తాయి. వీటిలో బహుశా ఇప్పటివరకూ ఎవరూ ఊహించని కొన్ని కామెంట్లు కూడా ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఒక పాకిస్తాన్ ఫ్యాన్ 'జైహింద్' అని రాస్తే, ఇంకొకరు 'వందేమాతరం' అని ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER
అహ్మద్ అనే క్రికెట్ ఫ్యాన్ "మేం మా పొరుగువారిని చాలా ప్రేమిస్తాం. మేం కచ్చితంగా ఇండియాకే సపోర్ట్ చేస్తాం" అన్నాడు.

ఫొటో సోర్స్, Twitter
Jatti Says అనే ట్విటర్ అకౌంట్‌లో "భారత్, పాకిస్తాన్ రెండూ ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా ఒక్కటవుతాయి" అని రాశారు.
Inevitable అనే యూజర్ "నేను పాకిస్తానీని, కానీ నేను ఇండియాను సపోర్ట్ చేస్తా, ఎందుకంటే ఎవరెన్ని చేసినా, పాకిస్తాన్ టీమ్ గెలవదని నాకు తెలుసు. భారత జట్టు మాకంటే చాలా ముందుంది" అని ట్వీట్ చేశాడు.

ఫొటో సోర్స్, Twitter
Siasat.pk తన అధికారిక అకౌంట్‌లో ఉల్టాగా సమాధానం ఇచ్చాడు. "మేం ఇంగ్లండ్ ఓటమిని సపోర్ట్ చేస్తాం" అన్నాడు.

ఫొటో సోర్స్, Twitter
రాణా సాజిబ్ అనే ఫ్యాన్ "భారత్‌కు మద్దతిస్తాం, దానికి రెండు కారణాలు కూడా ఉన్నాయి. భారత్ మా పొరుగు దేశం, భారతీయులకు క్రికెట్ అంటే ప్రాణం" అన్నాడు.

ఫొటో సోర్స్, TWITTER
జాకీ జైదీ "ఒక పాకిస్తాన్ క్రికెట్ అభిమాని ఫొటో ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అందులో అతడు 'విరాట్ 18' అని రాసున్న టీషర్ట్ వేసుకుని బైక్‌పై వెళ్తున్నాడు. తర్వాత "ఇది కూడా ఒక ప్రశ్నేనా?" అని కామెంట్ పెట్టాడు.
భారత్-పాకిస్తాన్ ఫ్యాన్స్ మధ్య ఇలా సరదాగా ఉన్న స్నేహ సందేశాలు చూసి కొంతమంది సంతోషంగా కూడా కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, TWITTER
ఈ స్పందన చూసిన ఒక ట్విటర్ యూజర్ "మన నేతలు కూడా ఈ ట్వీట్స్ చదివితే బావుణ్ణు" అని పెట్టాడు.
ఇవి చూసి చాలా సంతోషపడిన కొందరు ఇండియా అభిమానులు వారికి థాంక్స్ చెప్పడానికి కూడా వెనకాడలేదు.
అయితే పాకిస్తాన్ అభిమానులందరూ భారత్ గెలవాలనే కోరుకున్నారని అనుకోకూడదు. కొందరి సమాధానాలు ఇంకా భిన్నంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, TWITTER
నాజియా అఫ్రిది అనే ట్విటర్ యూజర్ నేను "ఇంగ్లండ్ గెలవాలని కోరుకుంటున్నా. సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి జనాలకు హార్ట్ అటాక్ ఇవ్వడం అవసరమా" అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER
జఫర్ అనే అభిమాని "నన్ను నమ్మండి. మేం ఇంగ్లండ్‌ను సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. కానీ దానివల్ల మాకే నష్టం. అందుకే ఈసారి భారత్‌కు మద్దతిస్తున్నాం. తర్వాత దేవుడు చూసుకుంటాడు" అన్నాడు.
ఈ జవాబులన్నీ చూశాక నాసిర్ మరో ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"నేను ఈ ట్వీట్‌ను సరదాగా చేశాను. సగం మంది కోపంగా, ఆవేశంగా జవాబిస్తారని అనుకున్నా. కానీ బదులుగా చాలా జవాబులు సరదాగా, ప్రేమగా ఉన్నాయి" అన్నాడు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- దేశమంతా ఇంటర్నెట్ ఆపేశారు.. కోర్టుకెళ్తే ఒక్కరికే ఇచ్చారు
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- ఆరెంజ్ జెర్సీల్లో కనువిందు చేయనున్న 'మెన్ ఇన్ బ్లూ'
- సెల్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి?
- మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా, కాలేదా.. ఈ 7 సంకేతాలే చెబుతాయి!
- ఫోన్ స్కామ్: మొబైల్ ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు
- అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడితే ప్రేమలో పడతారా?
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- ఐఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- సిమ్ కార్డు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు.. డేటా వాడుకోవచ్చు!
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
- భారత్ జిందాబాద్ అన్న పాకిస్తానీ అరెస్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)