భారత్ Vs వెస్టిండీస్: వెస్టిండీస్‌పై 125 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, షమీకి 4 వికెట్లు

ఫొటో సోర్స్, Getty Images
మాంచెస్టర్ మ్యాచ్‌లో భారత జట్టు వెస్టిండీస్‌పై 125 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మొదట్లో నెమ్మదిగా ఆడినా కోహ్లీ, ధోనీ హాఫ్ సెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 268 పరుగులు సాధించింది.
తర్వాత బౌలింగ్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి వెస్టిండీస్‌ను 35 ఓవర్లలోపే ఆలౌట్ చేసింది.
72 పరుగులు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.
ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి, అతడి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
లారా, సచిన్ పేరిట మాత్రమే ఉన్న 20 వేల పరుగుల క్లబ్‌లో కోహ్లీ కూడా అడుగుపెట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 20 వేల పరుగులు చేసిన రికార్డు కూడా సెట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ బౌలర్లను బౌలర్లను తెలివిగా ప్రయోగించాడు. వెంటవెంటనే వికెట్లు పడడంతో వెస్టిండీస్‌పై ఒత్తిడి పెరిగిపోయింది.
దీంతో 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 34.2 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లలో సునీల్ ఆంబ్రిస్(31), నికొలస్ పూరన్(28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.
డాషింగ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్(6) సహా ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
6.2 ఓవర్లలో 16 పరుగులిచ్చిన మహమ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు.
బుమ్రా 6 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు.
యజువేంద్ర చాహల్‌కు 2, హార్దిక్ పాండ్య, కులదీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అంతకు ముందు నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, రోహిత్ శర్మ(18) త్వరగా ఔటైనా కేఎల్ రాహుల్(48), కెప్టెన్ కోహ్లీ(72), ధోనీ(56 నాటౌట్), హార్దిక్ పాండ్యా(46) బ్యాటింగ్‌తో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది.
రెండు లైఫ్‌లు వచ్చిన ధోనీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టు భారీ స్కోరులో కీ రోల్ పోషించాడు.
వెస్టిండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ 3 వికెట్లు, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్ చెరి 2 వికెట్లు పడగొట్టారు.
వెస్టిండీస్‌పై విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటివరకూ 6 మ్యాచ్‌లు ఆడిన భారత్ 5 విజయాలతో 11 పాయింట్లు సాధించింది.
మ్యాచ్ సాగిన తీరు...
వెస్టిండీస్ ఆలౌట్
35వ ఓవర్లో వెస్టిండీస్ చివరి వికెట్ పడింది.
షమీ బౌలింగ్‌లో థామస్(6) రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ఇది షమీకి 4వ వికెట్
9.55 P.M.
30 ఓవర్లలో 124/9...
చాహల్‌కు మరో వికెట్
30వ ఓవర్లో వెస్టిండీస్ 9వ వికెట్ పడింది.
చాహల్ బౌలింగ్‌లో షెల్డన్ కాట్రెల్(10) ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.
షమీకి మూడో వికెట్
29వ ఓవర్ వేసిన మహమ్మద్ షమీ హెట్‌మెయర్(18) వికెట్ తీశాడు.
హెట్‌మెయర్ కొట్టి షాట్ కేఎల్ రాహుల్ చేతుల్లో పడింది.
9.38 P.M.
బుమ్రాకు ఒకే ఓవర్లో 2 వికెట్లు
27వ ఓవర్లో వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డాయి.
27వ ఓవర్ మొదటి బంతికి కార్లోస్ బ్రాత్‌వైట్(6) ధోనీకి క్యాచ్ ఇవ్వగా, తర్వాత బంతికే ఫబియన్ అలెన్(0) ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.
ఈ ఓవర్లో బుమ్రా ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు
25వ ఓవర్లో వెస్టిండీస్ 100 మార్కును దాటింది.
9.20 P.M.
24 ఓవర్లకు 98/5...
జాసన్ హోల్డర్ ఔట్
98 పరుగుల దగ్గర వెస్టిండీస్ ఐదో వికెట్ పడింది.
చాహల్ బౌలింగ్‌లో హోల్డర్(6) కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images
9.08 P.M.
21 ఓవర్లకు 84/4...
నికొలస్ పూరన్ ఔట్
21వ ఓవర్లో నాలుగో వికెట్ పడింది.
కులదీప్ యాదవ్ బౌలింగ్‌లో నికొలస్ పూరన్(28) షమీకి క్యాచ్ ఇచ్చాడు.
హెట్‌మెయర్ 1, కెప్టెన్ జాసన్ హోల్డర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ తీసిన పాండ్యా
18 ఓవర్లకు 71/3...
71 పరుగుల దగ్గర వెస్టిండీస్ మూడో వికెట్ పడింది.
ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్(31) పాండ్యా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.
అదే ఓవర్లో పూరన్, ఆంబ్రిస్ 50 పరుగుల భాగస్వామ్యం పూర్తైంది.
8.43 P.M.
16 ఓవర్లకు 56/2...
15 ఓవర్లకు వెస్టిండీస్ 50 పరుగులు పూర్తి చేసింది.
8.33 P.M.
14 ఓవర్లకు 45/2...
పూరన్ 11, ఆంబ్రిస్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
8.20 P.M.
10 ఓవర్లు పూర్తయ్యేసరికి వెస్టిండీస్ 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది.
జస్‌ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్లలో 6 పరుగులే ఇస్తే, షమీ 5 ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి 15 పరుగులు ఇచ్చాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
8.12 P.M.
9 ఓవర్లకు 25/2...
షమీ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి.
నికొలస్ పూరన్ 2, సునీల్ ఆంబ్రిస్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
8.03 P.M.
7 ఓవర్లకు 16/2...
షమీకి రెండో వికెట్
7 ఓవర్లో 16 పరుగుల దగ్గర వెస్టిండీస్ రెండో వికెట్ పడింది.
మహమ్మద్ షమీ బౌలింగ్‌లో షాయ్ హోప్(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
7.52 P.M.
5 ఓవర్లకు 10/1...
10 పరుగులకే తొలి వికెట్
తొలి వికెట్ తీసిన మహమ్మద్ షమీ
ఓపెనర్ క్రిస్ గేల్ ఔట్
ఐదో ఓవర్‍లో వెస్టిండీస్ తొలి వికెట్ పడింది.
షమీ బౌలింగ్‌లో క్రిస్ గేల్(6) కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images
7.37 P.M.
2 ఓవర్లకు 5/0...
బుమ్రా వేసిన రెండో ఓవర్లో ఒక్క పరుగే వచ్చింది
7.30 P.M.
తొలి ఓవర్లో 4/0
షమీ వేసిన తొలి ఓవర్లో 4 పరుగులు వచ్చాయి.
క్రిస్ గేల్ ఒక ఫోర్ కొట్టాడు.
7.26 P.M.
వెస్టిండీస్ 269 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది.
ఓపెనర్లు సునీల్ ఆంబ్రిస్, క్రిస్ గేల్ బ్యాటింగ్‌కు దిగారు.
తొలి ఓవర్ షమీ వేస్తున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు...
టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది.
కెప్టెన్ కోహ్లీ 72, ధోనీ 56 నాటౌట్, హార్దిక్ పాండ్యా 46 పరుగులు చేశారు.
చివరి ఓవర్లో వచ్చిన 16 పరుగులతో టీమిండియా చివరి 5 ఓవర్లలో 49 పరుగులు చేసింది.
వెస్టిండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ 3 వికెట్లు, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్ చెరి 2 వికెట్లు పడగొట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
6.56 P.M.
ధోనీ హాఫ్ సెంచరీ..
50వ ఓవర్లో ధోనీ రెచ్చిపోయాడు.
రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టడంతోపాటు తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు.
చివరి ఓవర్లో మొత్తం 16 పరుగులు వచ్చాయి.
50 ఓవర్లు పూర్తయ్యేసరికి ధోనీ 56 పరుగులతో, కులదీప్ యాదవ్(0) నాటౌట్‌గా నిలిచాడు.
6.52 P.M.
49వ ఓవర్లో 2 వికెట్లు డౌన్...
49 ఓవర్లకు 252/5...
షెల్డన్ కాట్రెల్ వేసిన 49వ ఓవర్లో భారత్ వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయింది.
49వ ఓవర్ రెండో బంతికి హార్దిక్ పాండ్యా(46) ఔటవగా, ఐదో బంతికి మహమ్మద్ షమీ డకౌట్ అయ్యాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
6.42 P.M.
48 ఓవర్లకు 249/5...
ఒషానే థామస్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.
హార్దిక్ పాండ్యా ఒక ఫోర్ కూడా కొట్టాడు.
ధోనీ 38, పాండ్య 46 పరుగులతో ఆడుతున్నారు.
6.33 P.M.
47 ఓవర్లకు 238/5...
కోట్రెల్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి.
హార్దిక్ పాండ్య ఒక ఫోర్ బాదాడు.
ఇదే ఓవర్లో ధోనీ, పాండ్యా 50 పరుగుల భాగస్వామ్యం పూర్తైంది.
6.33 P.M.
46 ఓవర్లకు 229/5...
బ్రాత్‌వైట్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
ధోనీ ఒక ఫోర్ కొట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images
6.28 P.M.
45 ఓవర్లకు 219/5...
టీమిండియా 45 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి.
6.25 P.M.
44 ఓవర్లకు 214/5...
ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
హార్దిక్ పాండ్యా ఫోర్ కొట్టాడు.
పాండ్య 24, ధోనీ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.
6.20 P.M.
43 ఓవర్లకు 204/5...
6.15 P.M.
42 ఓవర్లకు 200/5...
42 ఓవర్లకు భారత్ 200 పరుగుల మైలురాయిని చేరింది.
ఈ ఓవర్లో రెండు వైడ్లు సహా మొత్తం 13 పరుగులు వచ్చాయి.
ధోనీ 20, హార్దిక్ పాండ్య 15 పరుగులతో ఆడుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
6.05 P.M.
40 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
ఎంఎస్ ధోనీ 18, హార్దిక్ పాండ్య 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ ఓవర్లో కేవలం 2 పరుగులే వచ్చాయి.
6.00 P.M.
39 ఓవర్లకు 184/5...
కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔట్...
భారత్ ఐదో వికెట్ కోల్పోయింది.
180 పరుగుల దగ్గర కెప్టెన్ విరాట్ కోహ్లీ(72) ఔట్ అయ్యాడు.
హోల్డర్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జాన్సన్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images
5.53 P.M.
37 ఓవర్లకు 174/4...
హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులే వచ్చాయి.
కోహ్లీ 67, ధోనీ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు,
5.41 P.M.
34 ఓవర్లకు 162/4...
34వ ఓవర్లో ఔట్ కాబోయిన ధోనీ లక్కీగా బయటపడ్డాడు.
షాట్ కొట్టడానికి ధోనీ ఫ్రంట్ ఫుట్ రాగా, కీపర్ హోప్ స్టంపింగ్ మిస్ చేశాడు.
బంతి కీపర్ గ్లోవ్ నుంచి మిస్ కావడంతో ధోనీ తిరిగి క్షేమంగా క్రీజులోకి చేరుకున్నాడు.
తర్వాత ఒక పరుగు కూడా పూర్తి చేశారు.
5.35 P.M.
33వ ఓవర్లో కేవలం ఒక్క పరుగే వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
5.33 P.M.
32 ఓవర్లకు 152/4...
వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తున్నారు.
కోహ్లీ 55, ధోనీ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
5.30 P.M.
31 ఓవర్లకు 150/4...
కోహ్లీ, ధోనీ నెమ్మదిగా ఆడుతున్నారు.
ఈ ఓవర్లో కేవలం రెండు పరుగులే వచ్చాయి.
ఇదే ఓవర్లో భారత్ 150 పరుగుల మార్కు దాటింది.
5.22 P.M.
30 ఓవర్లకు 148/4...
30 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ 53, ఎంఎస్ ధోనీ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
5.18 P.M.
29 ఓవర్లకు 140/3..
కేదార్ జాదవ్ ఔట్..
కీమర్ రోచ్‌కు మూడో వికెట్ పడగొట్టాడు.
29వ ఓవర్లో కేదార్ జాదవ్(7) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
వెస్టిండీస్ రివ్యూ కోరిన తర్వాత రీప్లేలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు.
వెస్టిండీస్ రెండు రివ్యూల్లో సక్సెస్ అయ్యింది.
5.10 P.M.
కోహ్లీ హాఫ్ సెంచరీ...
28 ఓవర్లకు 135/3..
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
55 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేశాడు.
5.05 P.M.
27 ఓవర్లకు 128/3..
విజయ్ శంకర్ అవుట్ అవడంతో కేదార్ జాదవ్ క్రీజులోకి వచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images
4.59 P.M.
విజయ్ శంకర్ ఔట్...
27వ ఓవర్లో 126 పరుగుల దగ్గర భారత్ మూడో వికెట్ కోల్పోయింది.
కీమర్ రోచ్ బౌలింగ్‌లో విజయ్ శంకర్(14) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
4.55 P.M.
విరాట్ కోహ్లీ 20 వేల పరుగుల రికార్డు...
అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 20 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడుగా రికార్డు సృష్టించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్ మాత్రమే 20 వేల పరుగులు చేశారు.
4.44 P.M.
23 ఓవర్లకు 112/2...
23వ ఓవర్లో విజయ్ శంకర్ రెండు ఫోర్లు కొట్టాడు.
4.40 P.M.
22 ఓవర్లో భారత్ 100 పరుగుల మైలురాయిని చేరుకుంది.
ఇదే ఓవర్లో కోహ్లీ ఒక బౌండరీ బాదాడు.
విజయ్ శంకర్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు.

ఫొటో సోర్స్, Getty Images
4.33 P.M.
రెండో వికెట్ డౌన్...
98 పరుగుల దగ్గర కేఎల్ రాహుల్(48) ఔట్ అయ్యాడు.
జాసన్ హోల్డర్ వేసిన 21 ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
4.30 P.M.
20 ఓవర్లకు 97/1
20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 97 పరుగులు చేసింది.
రాహుల్ 48, కోహ్లీ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.
20 వేల పరుగుల రికార్డును అందుకోడానికి కోహ్లీ మరో 8 పరుగుల దూరంలో ఉన్నాడు.
4.25 P.M.
18 ఓవర్లకు 89/1...
హోల్డర్ మరో టైట్ ఓవర్ వేశాడు.
ఈ ఓవర్లో కేవలం రెండు పరుగులే వచ్చాయి.
4.21 P.M.
18 ఓవర్లకు 87/1...
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 50 పరుగుల భాగస్వామ్యం అందించారు.
రాహుల్ 40, విరాట్ కోహ్లీ 21 పరుగులతో ఆడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
4.08 P.M.
15 ఓవర్లకు 67/1...
హోల్డర్ మరో మెయిడిన్ ఓవర్ వేశాడు.
కోహ్లీ, రాహుల్ పరుగులేమీ చేయలేకపోయారు.
4.04 P.M.
14 ఓవర్లకు 67/1...
భారత్ స్కోరు నెమ్మదిగా ముందుకు కదులుతోంది.
ఈ ఓవర్లో ఐదు పరుగులే వచ్చాయి.
4.00 P.M.
13 ఓవర్లకు 62/1...
హోల్డర్ మెయిడిన్ ఓవర్

ఫొటో సోర్స్, Getty Images
3.55 P.M.
12 ఓవర్లకు 62/1...
కోహ్లీ, రాహుల్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు.
ఈ ఓవర్లో కోహ్లీ మరో బౌండరీ కొట్టాడు.
3.52 P.M.
11 ఓవర్లకు 56/1...
11వ ఓవర్లో స్కోరు 50 పరుగులు దాటింది.
ఈ ఓవర్లో కోహ్లీ, రాహుల్ చెరో ఫోర్ కొట్టారు.
రాహుల్ 24, కోహ్లీ 12 పరుగులతో ఆడుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
3.47 P.M.
10 ఓవర్లకు 47/1...
10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ 20, విరాట్ కోహ్లీ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
3.43 P.M.
కోహ్లీ, రాహుల్ బ్యాటింగ్‌తో పరుగుల వేగం పెరిగింది.
9 ఓవర్లకు భారత్ 44 పరుగులు చేసింది.
3.38 P.M.
8 ఓవర్లకు భారత్ 38 పరుగులు చేసింది.
ఈ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
3.26 P.M.
రోహిత్ శర్మ ఔట్...
29 పరుగుల దగ్గర భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
కీమర్ రోచ్ వేసిన 6వ ఓవర్ చివరి బంతి రోహిత్ శర్మ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ షాయ్ హోప్ చేతుల్లో పడింది.
మొదట అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో వెస్టిండీస్ రివ్యూ కోరింది.
రీప్లేలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ రోహిత్‌కు ఔట్ ఇచ్చాడు.
రోహిత్ శర్మ 23 బంతుల్లో 18 పరుగులు చేశాడు.
ఇదే ఓవర్లో రోహిత్ శర్మ ఒక సిక్స్ కొట్టాడు.
3.20 P.M.
నెమ్మదిగా సాగుతున్న భారత్ బ్యాటింగ్. 5 ఓవర్లకు 17 పరుగులు. రాహుల్, రోహిత్ చెరో నాలుగు పరుగులు చేశారు. అయిదో ఓవర్లో మూడో బంతికి రోహిత్ తొలి బౌండరీ.
3.10 P.M.
కె.ఎల్. రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. కాట్రెల్ ఓపెనింగ్ బౌలర్.
మొదటి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి మూడు పరులుగు సాధించిన రాహుల్.
రెండు ఓవర్ల తరువాత భారత్ స్కోర్ 5 పరుగులు.

ఫొటో సోర్స్, AFP
భారత్ రెండు మ్యాచ్‌లు గెలిస్తే..
భారత్ ఇప్పటి వరకు ఐదింటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఇవాళ వెస్టిండీస్‌తో తలపడనుంది. తర్వాత ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడుతుంది.
టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఈ నాలుగు మ్యాచుల్లో కనీసం రెండింట గెలవాల్సి ఉంటుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాధవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్‌ప్రిత్ బుమ్రా
వెస్టిండీస్ జట్టు: జేసన్ హోల్డర్ (కెప్టెన్) ఫాబియాన్ అలెన్, డారెన్ బ్రావో, షనాన్ గాబ్రియేల్, షిమ్రన్ హెట్‌మైయిర్, ఎవిన్ లూయిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, కార్లోస్ బ్రాత్‌వైట్, షెల్డన్ కాట్రెల్, క్రిస్‌గేల్, షై హోప్, ఆష్లే నర్స్, కెమర్ రోక్, ఓషానె థామస్

ఫొటో సోర్స్, Getty Images
వానభయం లేనట్టేనా?
మాంచెస్టర్‌లో మంగళవారం వర్షం పడింది. భారత్, వెస్టిండీస్ తలపడనున్న తరుణంలో మళ్లీ వర్షం పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, వాతావరణ సూచనల ప్రకారం, గురువారం మాంచెస్టర్‌లో వాతావరణం పొడిగా ఉండేలా కనిపిస్తోంది. రోజంతా వర్షం కురిసే అవకాశాలు లేవు.
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి.
జూన్ 13న భారత్, న్యూజీలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్... వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. దాంతో, రెండు జట్లకూ చెరో పాయింటు లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
క్రిస్ గేల్ రిటైర్మెంట్ వాయిదా.. ఇండియాతో సిరీస్ ఆడతానన్న వెస్టిండీస్ బ్యాట్స్‌మన్
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.. ప్రపంచ కప్ టోర్నీ తర్వాత అంతర్జాతీయ వన్ డే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నారు. అంతేకాదు.. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఆడటానికి కూడా సంసిద్ధత వ్యక్తంచేశారు.
ఈ వెస్టిండీస్ ఓపెనర్ వయసు ఇప్పుడు 39 సంవత్సరాలు. ఈ ప్రపంచ కప్ టోర్నీ తర్వాత అంతర్జాతీయ వన్-డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని ఫిబ్రవరిలో ప్రకటించారు.
ఆయన వన్-డేలలో 10,345 పరుగులు చేశారు. అందులో 25 శతకాలు కూడా ఉన్నాయి. బ్రియాన్ లారా తర్వాత వెస్టిండీస్ తరఫున పది వేలకు పైగా వన్-డే పరుగులు చేసిన రెండో క్రికెటర్ గేల్.
వన్ డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు గేల్ బుధవారం చెప్పారు. ఆగస్టులో ''ఇండియాతో జరిగే వన్-డే సిరీస్‌లో నేను తప్పకుండా ఆడతా. కానీ టీ20ల్లో మాత్రం ఆడను'' అని తెలిపారు.
ఇండియాతో ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడవచ్చునని పేర్కొన్నారు. అలా ఆడితే ఐదేళ్ల కాలంలో గేల్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినట్లు అవుతుంది.
క్రిస్ గేల్ 2014 సెప్టెంబర్ నుంచి టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. రెండేళ్ల పాటు అంతర్జాతీయ వన్-డే క్రికెట్‌కు కూడా దూరంగా ఉండి.. 2017లో తిరిగివచ్చారు.
ఇవి కూడా చదవండి:
- #INDvPAK క్రికెట్లోనే ‘అతిపెద్ద పోటీ’కి వంద కోట్ల మంది ప్రేక్షకులు
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: పాకిస్తాన్‌తో ఆడిన 6 మ్యాచుల్లో భారత్ ఎలా గెలిచింది...
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: 'పాకిస్తాన్ బౌలింగ్, భారత్ బ్యాటింగ్ మధ్యే పోటీ' -ఇంజమామ్ ఉల్ హక్
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో గెలిచేదెవరు...
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ‘ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోతే వారి సెమీస్ ఆశలు గల్లంతే’
- క్రికెట్ వరల్డ్ కప్ 2019 : వన్డేల్లో అత్యుత్తమ భారత జట్టు ఇదేనా...
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై ఏమన్నాడంటే...
- క్రికెట్ వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ఇంగ్లాండ్‌నే ఎందుకు ఎంచుకుంది...
- భారత్‌తో మ్యాచ్‌లో మేం ఆ తప్పులు చేయకూడదు - పాక్ కెప్టెన్ సర్ఫరాజ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









