#INDvPAK భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో మేం ఆ తప్పులు చేయకూడదు - పాక్ కెప్టెన్ సర్ఫరాజ్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
వరల్డ్ కప్‌లో భారత్‌పై గెలవాలంటే తమ ఫీల్డింగ్ మెరుగవ్వాల్సిందేనని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు.
పేలవమైన ఫీల్డింగ్ వల్లే గత మ్యాచ్‌లో తమపై ఆస్ట్రేలియా ఎక్కువ పరుగులు సాధింగలిగిందని అతడు అభిప్రాయపడ్డాడు. లోపాలను సరిచేసుకునేందుకు కృషి చేస్తామని వివరించాడు.
వరల్డ్ కప్‌లో భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం మాంచెస్టర్‌లో ఈ పోరు జరగనుంది.
ఈ పోటీకి ముందు బుధవారం ఆస్ర్టేలియాతో మ్యాచ్ ఆడిన పాక్ 41 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఫీల్డింగ్ పేలవంగా చేశారు. ఆరోన్ ఫించ్ 33 పరుగుల వద్ద ఉండగా, స్లిప్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ఆసిఫ్ అలీ వదిలేశాడు. ఆ తర్వాత ఫించ్ 84 పరుగులు చేశాడు. వార్నర్‌తో కలిసి 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
వార్నర్ కూడా సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా మొత్తంగా 307 పరుగులు చేయగలిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడాడు.
రెండు మెరుగైన జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఫలితంపై ఫీల్డింగ్ ప్రభావం చూపుతుందని అతడు వ్యాఖ్యానించాడు.
''మా ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. భారత్‌తో మ్యాచ్ కన్నా ముందే మేం దాన్ని సరిదిద్దుకోవాలి. భారత్ బలమైన జట్టు. ఇలాంటి తప్పులు మళ్లీ చేస్తే, మాకు గెలిచే అవకాశం రాదు'' అని సర్ఫరాజ్ అన్నాడు.
ఆస్ట్రేలియాపై పాక్ గెలిచేలా కనిపించింది. 44 ఓవర్లకు 263-7 స్కోరుతో లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించినా, ఆ వెనువెంటనే 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.
''మా ఆరంభం బాగానే ఉంది. కానీ, మంచి భాగస్వామ్యాలు నిర్మించుకోలేకపోయాం. కొన్ని వికెట్లు అనవసరంగా పారేసుకున్నాం. 15 పరుగుల వ్యవధిలో కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది'' అని సర్ఫరాజ్ అన్నాడు.
భారత్‌పై పూర్తి సామర్థ్యంతో ఆడేందుకు సన్నద్ధమవుతున్నట్లు పాక్ బ్యాట్స్‌మన్ ఇమామ్ ఉల్ హఖ్ చెప్పాడు.
''భారత్‌తో మ్యాచ్ అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి మ్యాచ్‌లు ఆడటం చాలా పెద్ద విషయం. మా సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టాం. మాంచెస్టర్‌లో చాలా మంది పాకిస్తాన్ అభిమానులు ఉంటారు. చాలా ఉత్సాహంగా ఉంది'' అని ఇమామ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- కోహ్లీ - స్మిత్: ఇద్దరిలో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ అందించగలడా?
- సల్వాజుడుం: నిర్వాసితులైన 30 వేల మందికి అటవీ భూమిపై హక్కులు లభిస్తాయా?
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
- వరల్డ్ కప్: స్త్రీ - పురుష క్రీడాకారుల మధ్య వేతన వ్యత్యాసం ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








