వరల్డ్ కప్ 2019: భారత జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడానికి ఉన్న అడ్డంకులేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రస్తుత ప్రపంచ కప్ క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌పై బంగ్లాదేశ్ విజయం, దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ గెలుపుతో సెమీ ఫైనల్ సమీకరణాలు చాలా ఆసక్తికరంగా మారాయి.
పాయింట్లను బట్టి టాప్ ఫోర్ టీమ్స్ సెమీ ఫైనల్‌కు క్వాలిఫై అవుతాయి. ఈ పోటీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. అన్ని జట్లూ తొమ్మిదేసి మ్యాచ్‌లు ఆడుతాయి.
మంగళవారం ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం ముందు వరకూ పాయింట్ల పట్టికలో న్యూజీలాండ్ టీమ్ 11 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.

న్యూజీలాండ్ లాగే భారత్ కూడా ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కానీ టీమిండియా ఇప్పటివరకూ న్యూజీలాండ్ కంటే ఒక మ్యాచ్ తక్కువ ఆడింది.
ప్రస్తుతం టాప్ ఫోర్ టీమ్స్‌లో న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ ఉన్నాయి. గత రెండు మ్యాచ్‌ల ఫలితాలతో ఇప్పుడు సెమీ ఫైనల్ సమీకరణాలు చాలా ఆసక్తిగా మారాయి.
దక్షిణాఫ్రికా, అప్గానిస్తాన్ జట్లు సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాయి. అఫ్గానిస్తాన్ జట్టు ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడి, అన్నీ ఓడిపోయింది. ఇక దక్షిణాఫ్రికా జట్టు ఏడింటిలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.

ఫొటో సోర్స్, PA
1.న్యూజీలాండ్ సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ ఆధారంగా న్యూజీలాండ్ సెమీ ఫైనల్ చేరడం దాదాపు పక్కాగా కనిపిస్తోంది. ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టుకు 11 పాయింట్లున్నాయి. అది ఇంకా పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంది. వీటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా న్యూజీలాండ్ సెమీ ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది.
న్యూజీలాండ్ టీమ్ ఒకవేళ తన మూడు మ్యాచుల్లో ఓడిపోయినా, అప్పుడు కూడా అది సెమీ ఫైనల్ చేరవచ్చు. కానీ అది బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక టీమ్స్ గెలుపు ఓటమిలపై ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, AFP/PA
2.భారత్ రెండు మ్యాచ్‌లు గెలిస్తే..
భారత్ ఐదింటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. కోహ్లీ సేన వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడాల్సిన మ్యాచ్‌లు మిగిలున్నాయి.
ఈ నాలుగు మ్యాచుల్లో భారత్ ఎలాగైనా రెండు గెలవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, AFP
కానీ టీమిండియా వీటిలో ఒకే మ్యాచ్ మాత్రమే గెలిచి, మిగతావి ఓడిపోతే అప్పుడు పరిస్థితి జటిలం కావచ్చు.
అప్పుడు భారత్ మిగతా టీమ్స్ ప్రదర్శనపై ఆధారపడాల్సి వస్తుంది.
అంటే, ఇంగ్లండ్ తన మూడు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి, శ్రీలంక రెండు మ్యాచ్‌లు గెలవగలిగితే, భారత్ ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీ ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది.

ఫొటో సోర్స్, AFP
3.పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా టాప్
ఆస్ట్రేలియా మంగళవారం ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇప్పటివరకూ ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి అన్నిటికంటే ఎక్కువగా 12 పాయింట్లతో ఉంది.
ఇక అది న్యూజీలాండ్, దక్షిణాఫ్రికాతో ఆడాలి. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌లు ఓడిపోయినా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ చేరుకోవడం పక్కా.

ఫొటో సోర్స్, Reuters
4 ఆతిథ్య ఇంగ్లండ్ పరిస్థితి
ఆతిథ్య ఇంగ్లండ్ ఆరు మ్యాచ్‌లు ఆడి 8 పాయింట్లతో ఉంది. మంగళవారం అది ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. అది ఇంకా భారత్, న్యూజీలాండ్‌తో రెండు మ్యాచ్‌లు ఆడాల్సుంది.
ఈ రెండు మ్యాచ్‌లు ఓడిపోతే, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది.
ఒకవేళ ఈ రెండు మ్యాచుల్లో ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ ఇంగ్లండ్ పక్కాగా సెమీ ఫైనల్ చేరుకుంటుందని చెప్పలేం.

ఫొటో సోర్స్, Getty Images
5.సెమీస్ రేసులో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ 7 మ్యాచుల్లో 3 విజయాలతో 7 పాయింట్లు సాధించింది. అది ఇంకా భారత్, పాకిస్తాన్‌తో ఆడాలి.
ఒకవేళ బంగ్లాదేశ్ ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే దాని పాయింట్లు 11 అవుతాయి. అప్పుడది సెమీస్ చేరుకోవచ్చు. కానీ శ్రీలంక తన అన్ని మ్యాచ్‌లూ ఓడిపోయి, ఇంగ్లండ్ ఒకే ఒక్క మ్యాచ్ గెలిస్తే అది సాధ్యం అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
6.శ్రీలంక ఏం చేస్తుంది
ఆరు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక దగ్గర ఆరు పాయింట్లు ఉన్నాయి. అది ఇంకా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్‌తో ఆడాలి. కానీ ఈ మ్యాచ్‌లు అంత సులభం కాదు.
శ్రీలంక జట్టు మొత్తం మూడు మ్యాచ్‌ల్లో మూడూ గెలిస్తే, దాని పాయింట్లు 12 అవుతాయి.
ఒకవేళ అది రెండు మాత్రమే గెలిచి, 10 పాయింట్ల దగ్గరే ఆగితే, అది ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మ్యాచ్‌ల ఫలితాల కోసం వేచిచూడాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
7.వెస్టిండీస్ ఆశలు
వెస్టిండీస్ ఖాతాలో కేవలం 3 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అది ఇంకా భారత్, శ్రీలంక, అప్గానిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సుంది.
అది ఈ మూడు మ్యాచ్‌లు గెలిచినా సెమీ ఫైనల్ చేరాలంటే మిగతా మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
వెస్టిండీస్‌కు సెమీస్ చేరే సమీకరణాలు చాలా క్లిష్టంగా కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
8.పాకిస్తాన్ కల నెరవేరుతుందా
ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆశలకు ఇంకా తెరపడలేదు. ఆ జట్టు దగ్గర 5 పాయింట్లు ఉన్నాయి. అది ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడుతుంది.
పాకిస్తాన్ న్యూజీలాండ్, బంగ్లాదేశ్, అప్గానిస్తాన్‌తో ఆడుతుంది. పాక్ ఈ మూడు మ్యాచ్‌లూ గెలిస్తే, దాని పాయింట్లు మొత్తం 11 అవుతాయి.
కానీ అది సెమీస్ చేరాలంటే, ఇంగ్లండ్ ఒక మ్యాచ్ మించి గెలవకూడదని ఆశలు పెట్టుకోవాలి. అంతే కాదు.. దానితోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక కూడా కనీసం ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోవాలి.
అప్పుడు మాత్రమే పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరుకోగలుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- Eng Vs Aus : లార్డ్స్‌లో ఆస్ట్రేలియా విజయం.. ఇంగ్లండ్‌కు వరుసగా రెండో ఓటమి..
- PAK Vs SA: దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో పాక్ విజయం.. సెమీస్ రేసు నుంచి సౌతాఫ్రికా ఔట్
- ఇరాన్ అధ్యక్షుడే లక్ష్యంగా ట్రంప్ కొత్త ఆంక్షలు.. ఇది యుద్ధ దాహమే అంటున్న అధికారులు
- గడ్డి వంతెన ఇది... దీన్ని ఎలా కడతారో చూడండి
- 'ఇరాన్ ఆయుధ వ్యవస్థలపై అమెరికా సైబర్ దాడి'
- ఇంతమంది చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు...
- మీ లంచ్‌ని తోటి ఉద్యోగి దొంగిలిస్తే.. అదో వైరల్!
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








