#INDvPAK క్రికెట్‌లోనే ‘అతిపెద్ద మ్యాచ్’కి వంద కోట్ల మంది వీక్షకులు

ఫొటో సోర్స్, Reuters
క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ పోరుకు సమయం దగ్గరపడింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు వేల మంది అభిమానులు చేరుకుంటున్నారు.
ఓల్డ్ ట్రఫర్డ్ స్టేడియం వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా జనాలు అత్యంత ఆసక్తికరంగా వీక్షించే క్రీడా పోటీల్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఒకటి.
దాదాపు వంద కోట్ల మంది దీన్ని టీవీల్లో చూస్తారని అంచనాలున్నాయి.
మ్యాచ్ టికెట్ల కోసం ఏడు లక్షల మంది అప్లై చేశారంటనే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు.
రాజకీయపరమైన ఉద్రిక్తతల కారణంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు చాలా అరుదుగా జరుగుతున్నాయి.
పైగా వరల్డ్ కప్‌లో ఇంతవరకూ భారత్‌పై పాకిస్తాన్ ఎప్పుడూ గెలవలేదు. ఆ రికార్డును అలాగే కాపాడుకోవాలని భారత్, దాన్ని తిరగరాయాలని పాక్ పట్టుదలతో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను చూసేందుకు వస్తున్న వారి కోసం ఈ వారాంతం అదనంగా ప్రైవేటు జెట్లు తమ వద్ద ల్యాండ్ అవుతున్నాయని మాంచెస్టర్ ఎయిర్‌పోర్ట్ వెల్లడించింది.
క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచే అతిపెద్ద పోటీ కావొచ్చని ల్యాంకషైర్ క్రికెట్ క్లబ్ బిజినెస్ మేనేజర్ వారెన్ హెగ్ అన్నారు.
''భారత్, పాకిస్తాన్‌ల్లో జనాలకు క్రికెట్ అంటే ప్రాణం. ఈ మ్యాచ్‌పై వారు విపరీతమైన ఆసక్తితో ఉన్నారు. స్టేడియంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం ఉండబోతుంది'' అని ఆయన చెప్పారు.
మాంచెస్టర్‌లో అభిమానుల కోసం ఓ ఫ్యాన్ జోన్‌ను కూడా పెట్టారు. ఇక్కడ ఉండే భారీ తెరపై 3,500 మంది వరకూ మ్యాచ్‌ను చూడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు.
25 వేల మంది కూర్చునే సామర్థ్యమున్న ఓల్డ్ ట్రఫర్డ్ స్టేడియం టికెట్లు బుకింగ్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే అమ్ముడైపోయాయి.
ఆ టికెట్లు దక్కించుకున్న అదృష్టవంతుల్లో 'భారత్ ఆర్మీ' పేరుతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ వెబ్‌సైట్ నడుపుతున్న రాకేశ్ పటేల్ కూడా ఉన్నారు.
''ఈ మ్యాచ్ కోసం నాలుగేళ్లుగా వేచిచూస్తున్నాం. క్రికెట్‌లో ఇదే అతిపెద్ద పోరు'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అయితే, ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. ఆదివారం వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.
వర్షం పడకుండా, పూర్తి మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నట్లు రాకేశ్ చెప్పారు.
ఈ మ్యాచ్ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. సాయుధ పోలీసులనూ ఇందుకోసం నియమించింది.
''స్టేడియంలో, మాంచెస్టర్ నగరంలో చాలా మంది పోలీసు అధికారులను మోహరించాం. పోలీసింగ్ కట్టుదిట్టంగా ఉంటుంది. అభిమానుల ఆనందాన్ని మేమీమీ పాడు చేయం. కానీ, నేరపూరిత చర్యలకు పాల్పడేవారిని ఉపేక్షించం'' అని పోలీస్ ఉన్నతాధికారి గ్రేమ్ ఒపెన్షా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- స్విట్జర్లాండ్: సమాన వేతనం, గౌరవం కోసం రోడ్డెక్కిన మహిళలు
- #INDvPAK గావస్కర్ ఇంటర్వ్యూ: ‘ఈ మ్యాచ్ పాకిస్తాన్‌కే కీలకం.. ఓడిపోతే వారి సెమీస్ ఆశలు గల్లంతే’
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ అందించగలడా?
- సల్వాజుడుం: నిర్వాసితులైన 30 వేల మందికి అటవీ భూమిపై హక్కులు లభిస్తాయా?
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








