స్విట్జర్లాండ్: సమాన వేతనం, గౌరవం కోసం రోడ్డెక్కిన మహిళలు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ఇమోజెన్ ఫౌల్కేస్
- హోదా, బీబీసీ న్యూస్, బెర్న్
సమాన వేతనం, గౌరవం, పని గంటల తగ్గింపు కోరుతూ స్విట్జర్లాండ్‌లోని మహిళలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.
28 ఏళ్ల తర్వాత స్విస్ మహిళలు మరోసారి ఉద్యమించారు.1991లో దాదాపు ఐదు లక్షల మంది మహిళలు హక్కుల కోసం ఇదే విధంగా రోడ్డెక్కారు.
లింగ సమానత్వం కోసం స్విస్ మహిళలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు.
మొదటి ప్రపంచం యుద్ధం ముగిసిన తర్వాత 1918లో తమకూ ఓటు హక్కు కల్పించాలని లక్షలాదిగా మహిళలు స్విట్జర్లాండ్‌లో ఆందోళనలు నిర్వహించారు. కానీ, 1971 వరకు ఆ దేశంలో మహిళలకు ఓటు హక్కు లభించలేదు.
1991 ఉద్యమ సమయంలో స్విస్ ప్రభుత్వంలో మహిళలకు చోటు లేదు. ప్రసూతి సెలవుల ఊసే లేదు.
మహిళలకు ఓటు హక్కును నిరాకరించిన చివరి స్విస్ స్టేట్ అప్పెన్‌జెల్ కూడా స్విట్జర్లాండ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తన విధానాన్ని మార్చుకుంది.

ఫొటో సోర్స్, Gosteli Foundation
స్విట్జర్లాండ్‌లో సమానత్వం ఎంత వరకు వచ్చింది?
ఇప్పటికైతో కొన్ని విషయాల్లో మార్పులొచ్చాయి. ప్రసూతి సెలవుల కోసం ప్రత్యేకంగా చట్టం వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో 8 మంది మహిళలు మంత్రులుగా పనిచేశారు.
కానీ, ఇప్పటికీ దేశంలో పురుషులతో పోల్చితే మహిళలు 20 శాతం తక్కువగా వేతనాలు అందుకుంటున్నారు. కీలక స్థాయి పదవుల్లో చాలా తక్కువ సంఖ్యలో మహిళలు ఉంటున్నారు.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గత నెలలో ఒక సర్వే నిర్వహించి స్త్రీ, పురుష వేతనాల వ్యత్యాసంలో స్విట్జర్లాండ్ చివరి స్థానంలో ఉందని తెలిపింది.
1991 సమ్మెలో పాల్గొన్నప్పుడు జర్నలిస్ట్ బీట్‌రైస్ బార్న్ ఆరు నెలల గర్భిణి. ఇప్పుడు ఆమె కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రసవం అయ్యాక ఆమె తిరిగి విధుల్లో చేరాలనుకున్నప్పుడు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి పార్ట్‌టైం ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించారు. అప్పట్లో సమ్మె చేస్తే తీవ్రంగా అణచివేసేవారని ఆమె చెప్పారు.
1991 సమ్మెకు నాయకత్వం వహించిన వారిలో ఒకరైన పాయిలో ఫెర్రో కూడా ఇప్పుడు జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ''28 ఏళ్ల నుంచి గమనిస్తే కొంత పురోగతి కనిపిస్తుంది. కానీ, వేతనం, పెన్షన్ చెల్లింపుల్లో వ్యత్యాసం ఇంకా ఉంది.'' అని ఆమె తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సోషల్ మీడియా వేదికగా...
సమాన వేతనంపై మరింత పరిశీలన జరగాలని గతేడాది పార్లమెంట్ ప్రకటించినప్పుడే సమ్మెకు దిగాలని మహిళా ఉద్యోగులు నిర్ణయించారు. అప్పటి నుంచి దేశంలోని మహిళలంతా ఏకమవుతూ సమ్మెకు సిద్ధమయ్యారు. ఇందుకు సోషల్ మీడియానూ వేదికగా చేసుకున్నారు.
#Frauenstreik హాష్‌ట్యాగ్ పేరుతో జర్మన్ భాషలో #GrèvedesFemmes హాష్‌ట్యాగ్ తో ఫ్రంచ్ లోనూ మహిళల సమ్మె ట్రెండ్ అవుతోంది.
దేశంలోని ప్రధాన నగరాలైన బెర్న్, బసెల్, జ్యూరిచ్ తదితర ప్రాంతాల్లోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలందరూ ఒక చోట గుమిగూడి నినాదాలు ఇస్తున్నారు. జెనివాలో పురుషుల పేరుతో ఉన్న వీధులను చెరిపేసి మహిళల పేర్లు రాస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
1991 ఉద్యమం తర్వాత పుట్టిన న్యాయ విద్యార్థి నడినె ఇప్పుడు జరుగుతున్న సమ్మెలో పాల్గొంటున్నారు.
''నా దృష్టిలో ఇది చాలా మంచి విషయం'' అని ఆమె చెప్పారు.
''మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఇప్పటికే చెప్పాం. సమాన వేతనం లేదు. ఇంకా కొన్ని ఉద్యోగాలు పురుషులకే పరిమితమయ్యాయి.'' అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, JOELLE FABRE/TWITTER
బాస్‌లు ఏం చేస్తున్నారు?
ఇకపై పనిలోకి వచ్చేది లేదని ఇప్పటికే వేలాది మంది మహిళా ఉద్యోగులు తమ బాస్‌లకు చెప్పారు. మరికొంత మంది త్వరలోనే సమ్మెలో పాల్గొనబోతున్నారు. మగవారితో పోల్చితే 20 శాతం తక్కువ వేతనం చెల్లిస్తున్న నేపథ్యంలో పని గంటలు కూడా 20 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, కొంతమంది ఉద్యోగులు సమ్మె చట్టవిరుద్ధం అని అంటున్నారు. పెద్ద కంపెనీలు చాలా వరకు ఈ సమస్యపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సమ్మె చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోమని దేశంలోని రిటైల్ దిగ్గజం మిగ్రోస్ తెలిపింది.
ఒకవేళ సమ్మె చేయాలనుకుంటే ముందే తమకు చెప్పండని స్విస్ రైల్వే తన ఉద్యోగులను కోరింది. సమ్మెకు గుర్తుగా టీ షర్ట్‌లను కూడా అందిస్తామని ప్రకటించింది.
చాలా మంది పురుషులు కూడా మహిళల సమ్మెకు మద్దతిస్తున్నారు. వారు సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా పిల్లలను చూసుకుంటున్నారు. వారి కోసం వంట కూడా చేస్తున్నారు.
''మేం ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోకుంటే భవిష్యత్తులో ఎవరు ఉంటారు?'' అని 24 ఏళ్ల క్లెమెన్స్ ప్రశ్నిస్తున్నారు.
పూర్తిగా పురుషుల ఆధిపత్యంలోనే ఉన్న మీడియా రంగంలో 1986లో బార్న్ అడుగుపెట్టారు. ఆమె ప్రస్తుతం జరుగుతున్న సమ్మె పట్ల ఆశావాద దృక్పథంతో ఉన్నారు. ''1991 నుంచి చూస్తే సమానత్వం దిశగా కొన్నింటిలో విజయం సాధించాం. మాకు ఇప్పుడు ప్రసూతి సెలవులున్నాయి. 1991లో ప్రభుత్వం, పార్లమెంట్ అంతా పురుషాధిపత్యంలోనే ఉండేది. ఈరోజు రాజకీయాల్లోనూ మహిళలున్నారు'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మరో వందేళ్లూ మహిళలకు సమానత్వం కలే!
- స్త్రీ పురుష సమానత్వంపై మనం వియత్నాం నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి?
- మహిళల క్రీడా దుస్తులు: నాడు, నేడు
- కిట్ కొనడానికి కష్టపడ్డ మిథాలీ.. ఇప్పుడు పారితోషికంలో టాప్
- కిర్గిస్తాన్: బ్రా తో పాటలో కనిపించిన టీనేజ్ సింగర్.. చంపేస్తామంటూ బెదిరింపులు
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- #INDvPAK క్రికెట్లోనే ‘అతిపెద్ద పోటీ’కి వంద కోట్ల మంది ప్రేక్షకులు
- #INDvPAK ‘ఈ మ్యాచ్ పాకిస్తాన్‌కే కీలకం.. ఓడిపోతే వారి సెమీస్ ఆశలు గల్లంతే’
- భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లో వర్షం పడితే ప్రత్యామ్నాయం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఇంగ్లండ్‌లో ఎండాకాలంలో వానలు ఎందుకు కురుస్తున్నాయి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









