SLVsSA: దక్షిణాఫ్రికా ఘన విజయం.. శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో గెలిచిన సఫారీలు

ఫొటో సోర్స్, Getty Images
డర్హాంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
సౌతాఫ్రికా 37.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 206 పరుగులు చేసింది.
ఓపెనర్ హషీమ్ ఆమ్లా 80, కెప్టెన్ డుప్లిసిస్ 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
శ్రీలంక బౌలర్లలో లసిత్ మలింగకు మాత్రమే వికెట్ దక్కింది.
ఓపెనర్ డికాక్ 15 పరుగులు చేసి మలింగ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
31 పరుగులకే తొలి వికెట్ పడినా, తర్వాత క్రీజులోకి వచ్చిన ఆమ్లా, డుప్లెసిస్ ధాటిగా ఆడారు. జట్టుకు విజయం అందించారు.
శ్రీలంక ఆరుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా ఈ జోడీని విడదీయలేకపోయింది.
విజయానికి రెండు పరుగులు అవసరం కాగా 38వ ఓవర్లో డుప్లెసిస్ ఫోర్ కొట్టాడు.
హషీమ్ ఆమ్లా 105 బంతుల్లో 5 ఫోర్లతో 80 పరుగులు చేయగా, డుప్లెసిస్ 103 బంతుల్లో 10 ఫోర్లు ఒక సిక్స్‌తో 96 పరుగులు చేశాడు.
10 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ డ్వేన్ ప్రెటోరియస్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అయ్యాడు.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకోగా, ఓటమితో శ్రీలంక సెమీ పైనల్ అవకాశం కష్టంగా మారాయి.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు...
శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
డర్హాం మ్యాచ్‌లో టాస్ గెలవడం కీలకంగా కనిపిస్తోంది. బౌలింగ్ పిచ్ కావడంతో దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక స్కోరును పరిగెత్తించలేకపోయింది.
కట్టుదిట్టంగా బంతులేసిన దక్షిణాఫ్రికా బౌలర్లు మొదటి నుంచే వికెట్లు పడగొడుతూ శ్రీలంకపై ఒత్తిడి పెంచారు.
ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంక మొదటి నుంచి స్కోరు పెంచే హడావుడిలో వికెట్లు పారేసుకుంది.
పరుగులు సాధించడంలో శ్రీలంక ఆటగాళ్లందరూ దారుణంగా విఫలం అయ్యారు.
మొదటి వికెట్‌కు 50 పరుగులు భాగస్వామ్యం లభించినా రెండో వికెట్ పడిన తర్వాత చివరి వరకూ జట్టుకు అలాంటి పార్టనర్‌షిప్ అందలేదు.
ముఖ్యంగా 10 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి 25 పరుగులిచ్చిన డ్వేన్ పెట్రోరియస్ లంక బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించాడు.
శ్రీలంక బ్యాట్స్‌మెన్ల వ్యక్తిగత స్కోరులో 30 పరుగులే అత్యధికం. అది కూడా ఇద్దరే చేశారు.
క్రిస్ మోరిస్ 3 వికెట్లు పడగొట్టగా రబడాకు 2, ఫెహ్లుక్వాయో, డుమినికి చెరో వికెట్ పడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాచ్ సాగిందిలా...
37వ ఓవర్లో దక్షిణాఫ్రికా 200 పరుగులు పూర్తయ్యాయి.
36 ఓవర్లలో 196/1
దక్షిణాఫ్రికా విజయానికి 84 బంతుల్లో 8 పరుగులు కావాలి.
33 ఓవర్లకు 178/1
ఆమ్లా, డుప్లెసిస్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయలేకపోతున్న శ్రీలంక బౌలర్లు.
25 ఓవర్లకు 130/1...
ఒపెనర్ హషీమ్ ఆమ్లా(57), డుప్లెసిస్(47) ధాటిగా ఆడుతున్నారు.
ఆరుగురు బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా శ్రీలంకకు వికెట్ పడగొట్టడం కష్టమవుతోంది.
18 ఓవర్లకు 98/1...
హషీమ్ ఆమ్లా(46)హాఫ్ సెంచరీకి చేరువవుతున్నాడు.
డుప్లెసిస్ 28 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఇద్దరూ 50 పరుగుల భాగస్వామ్యం అందించారు.
10 ఓవర్లకు 53/1...
దక్షిణాఫ్రికా 10 ఓవర్లలో 53 పరుగులు చేసింది.
ధాటిగా ఆడుతున్న ఓపెనర్ హషీమ్ ఆమ్లా(28), కెప్టెన్ డుప్లెసిస్(9) స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
5 ఓవర్లకు 31/1
31 పరుగులకు దక్షిణాఫ్రికా తొలి వికెట్.
204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 5వ ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది.
ఐదో ఓవర్ చివరి బంతికి డికాక్(15) లసిత్ మలింగ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
203 పరుగులకు శ్రీలంక ఆలౌట్
50వ ఓవర్లో లసిత్ మలింగ(4) క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇవ్వడంతో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.
ఇది క్రిస్ మోరిస్‌కు మూడో వికెట్.
ఇదే ఓవర్ తొలి బంతికి శ్రీలంక 200 పరుగుల మార్కు దాటింది.
49వ ఓవర్లో శ్రీలంక తొమ్మిదో వికెట్ పడింది.
ఇసురు ఉదన(17) రబాడా బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చాడు.
46 ఓవర్లో 188/8..
46వ ఓవర్లో శ్రీలంక ఎనిమిదో వికెట్ పడింది.
తిశార పెరీరా(21) అండిలే ఫెహ్లుక్వాయో బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చాడు.
టెయిలెండర్లు ఇరుసు ఉదన(13) సురంగ లక్మల్(1) పరుగుతో క్రీజులో ఉన్నారు.
40 ఓవర్లో 163/7..
40వ ఓవర్లో శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది.
18 పరుగులు చేసిన జీవన్ మెండిస్ క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో పెట్రోరియస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇప్పటివరకూ డ్వెయిన్ పెట్రోరియస్ 3 వికెట్లు పడగొట్టాడు.
తిషార పెరీరా(11), ఇసురు ఉదన(2) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
36 ఓవర్లో ఆరో వికెట్
శ్రీలంక టాప్ ఆర్డర్ 135 పరుగులకే కుప్పకూలింది.
36వ ఓవర్లో లంక ఆరో వికెట్ కోల్పోయింది.
ధనుంజయ్ డిసిల్వ(24) డుమిని బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
28వ ఓవర్లో ఐదో వికెట్ పడింది.
కుశాల్ మెండిస్(23) ప్రెటోరియస్ బౌలింగ్‌లో క్రిస్ మోరిస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ప్రస్తుతం జీవన్ మెండిస్(4), తిశార పెరీరా(1) పరుగుతో క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
25 ఓవర్లలో 106/4..
22వ ఓవర్లో శ్రీలంక వంద పరుగుల మైలురాయిని చేరింది.
అదే ఓవర్లో నాలుగో వికెట్ కూడా పడింది.
ఏంజిలో మాథ్యూస్(11) మోరిస్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
కుశాల్ మెండిస్(11) ధనంజయ డిసిల్వా(4) క్రీజులో ఉన్నారు.
20 ఓవర్లలో 91/3..
3 వికెట్లు పడిపోవడంతో శ్రీలంక ఆచితూచి ఆడుతోంది.
20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 91 పరుగులే చేసింది.
కుశాల్ మెండిస్(17), ఏంజిలో మాథ్యూస్(7) బౌండరీల జోలికి వెళ్లకుండా సింగిల్స్, డబుల్స్ మీదే దృష్టి పెట్టారు.

ఫొటో సోర్స్, Reuters
15 ఓవర్లలో 82/3..
12వ ఓవర్లో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది.
ఓపెనర్ కుశల్ పెరీరా(30) ప్రెటోరియస్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
ప్రస్తుతం కుశాల్ మెండిస్(7), ఏంజిలో మాథ్యూస్(4) పరుగులతో క్రీజులో ఉన్నారు.
10 ఓవర్లలో 67/2...
పదో ఓవర్ చివరి బంతికి శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది.
అవిష్క ఫెర్నాండో(30) డ్వైన్ ప్రెటోరియస్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images
తొలి బంతికే వికెట్ పడినా ఫెర్నాండో, ఓపెనర్ కుశల్ పెరీరా వేగంగా పరుగులు చేశారు.
ఈ ఇద్దరూ జట్టుకు 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
కుశాల్ పెరీరా 28 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
5 ఓవర్లలో 36/1...
5 ఓవర్లలో శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.
మొదట బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్ కోల్పోయింది.
ఓపెనర్ దిముత్ కరుణరత్నె కగిసో రబాడా బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
కుశాల్ పెరీరా(11), అవిష్క ఫెర్నాండో(13) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ధోనీ స్లో బ్యాటింగ్‌పై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..
- Eng Vs Aus : లార్డ్స్‌లో ఆస్ట్రేలియా విజయం.. ఇంగ్లండ్‌కు వరుసగా రెండో ఓటమి..
- PAK Vs SA: దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో పాక్ విజయం.. సెమీస్ రేసు నుంచి సౌతాఫ్రికా ఔట్
- ఇరాన్ అధ్యక్షుడే లక్ష్యంగా ట్రంప్ కొత్త ఆంక్షలు.. ఇది యుద్ధ దాహమే అంటున్న అధికారులు
- గడ్డి వంతెన ఇది... దీన్ని ఎలా కడతారో చూడండి
- 'ఇరాన్ ఆయుధ వ్యవస్థలపై అమెరికా సైబర్ దాడి'
- ఇంతమంది చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు...
- మీ లంచ్‌ని తోటి ఉద్యోగి దొంగిలిస్తే.. అదో వైరల్!
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








