ట్రంప్-కిమ్ భేటీ: 2020కి కొరియా నిరాయుధీకరణను కోరుకుంటున్న అమెరికా

సోల్‌లో మైక్ పాంపేయో (కుడి)

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సోల్‌లో మైక్ పాంపేయో (కుడి)

2020 కల్లా ఉత్తర కొరియా భారీగా ఆయుధాలను త్యజించాలని అమెరికా ఎదురు చూస్తోందని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపేయో పేర్కొన్నారు.

సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మధ్య భేటీ జరిగిన ఒక రోజు తర్వాత పాంపేయో ఈ వ్యాఖ్యలు చేశారు.

కొరియాను పూర్తి అణ్వస్త్ర రహిత ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తామని ఉత్తర కొరియా ఒక ప్రకటనలో అంగీకరించింది.

అయితే ఆ ప్రకటనలో పూర్తి వివరాలు లేవని.. ఎప్పుడు ఎలా అణ్వాయుధాలను త్యజిస్తారో వెల్లడించలేదని విమర్శలు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, ట్రంప్-కిమ్ సదస్సు: చరిత్రాత్మక కరచాలనం ఇదే

ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాలో పాంపేయో మాట్లాడుతూ.. ఉత్తర కొరియాతో తాము కలిసి పని చేయడానికి సంబంధించి ఇంకా చాలా అంశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

అనంతరం '' మరో రెండున్నర ఏళ్లలో భారీ నిరాయుధీకరణ కోసం ఎదురు చూస్తున్నాం. దాన్ని సాధించగలమన్న విశ్వాసంతో ఉన్నాం'' అని అన్నారు.

అణు కార్యక్రమాలను రద్దు చేయడం ఇప్పుడు ఎంత అవసరమో ఉత్తర కొరియా అర్థం చేసుకుందని తాను భావిస్తున్నానని పాంపేయో అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సింగపూర్‌లో ఇరు దేశాల నేతలు కలిసి విడుదల చేసిన ప్రకటనలో 'వివరాల' గురించి విలేఖర్లు ప్రస్తావించగా.. దాన్ని పాంపేయో ఖండించారు. ఈ ప్రశ్నలు అవమానకరమన్నారు.

ఉత్తర కొరియా నుంచి ఇకపై అణుభయం ఉండదని.. అందరూ మరింత భద్రంగా ఉండొచ్చని ట్రంప్ వ్యాఖ్యనించారు. అనంతరం పాంపేయో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)