అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?

ఫొటో సోర్స్, EPA
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి అమెరికా కంటే పురాతనమైన సోయా సాస్‌ను వడ్డించారు. దీన్ని బట్టి చూస్తే.. ఆసియా నేతలు ట్రంప్‌కి భోజనం పెట్టేటపుడు ఎలాంటి దౌత్య సందేశాలు పంపి ఉంటారో? అని మీకు ఆశ్చర్యం కలగక మానదు.

స్టార్టర్లు
టోక్యో బడ్డీ బర్గర్లు: జపాన్ ప్రధాని షింజో అబే ట్రంప్‌కి అమెరికన్ హాంబర్గర్ లంచ్‌లో ఏం వడ్డించారో తెలుసా? బోన్ లెస్ బీఫ్. దీంతో పాటు హెయింజ్ కెచప్ మస్టర్డ్ నుకూడా స్టార్టర్‌గా పెట్టారట.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ట్రెడిషనల్ స్టీక్, ఐస్ క్రీమ్ సండే: ట్రంప్‌కి స్టీక్ అంటే చాలా ఇష్టం కాగా.. చేపలంటే పడదట. అందుకేనేమో ట్రంప్ జపాన్‌కు వెళ్లినపుడు టోక్యో టెప్పన్యాకి రెస్టారెంట్‌లో స్టీక్, చాకొలేట్ ఐస్‌క్రీమ్ సండేని వడ్డించారట.
తెరియాకి చికెన్,ఉడికించిన గుడ్డు: ఇక జపనీస్ స్టైల్ స్టీక్ కూడా మెనూలో పెట్టారు. విందులో ఉడికించిన గుడ్డును పుట్టగొడుగుల కూరతో కలిపి సర్వ్ చేశారు. ఇక జపాన్ సంప్రదాయ రెస్టారెంట్‌లో ట్రంప్‌కి స్థానిక వంటకాలను రుచి చూపించారు. అందులో భాగంగా తెరియాకి చికెన్‌ను వడ్డించారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
వాణిజ్యంపై పలు చిక్కులు నెలకొన్నా.. ట్రంప్.. అబే మాత్రం ఒకే విందు తిన్నారు.

మెయిన్ కోర్సులు
దక్షిణ కొరియాలో రాజకీయ రొయ్యలు: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రాజకీయాలపై మంచి చర్చ జరుగుతుండగా.. ఉత్తర కొరియా సరిహద్దులోని సముద్రంలో పట్టుకొచ్చిన రొయ్యల వంటకాన్ని ట్రంప్‌కి వడ్డించారు.
అయితే వాటిని ట్రంప్ తిన్నారా? లేదా? అనేది స్పష్టం కాలేదు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
ఈ విందు సందర్భంగా ట్రంప్‌ను కలిసిన అతిధుల్లో లీ యోంగ్ - సూ కూడా ఉన్నారు. ఈమె ‘‘ జపాన్ సైనికులకు యుద్ధ సమయంలో సెక్స్ స్లేవ్ గా పని చేశారు.

ఫొటో సోర్స్, AFP
శతాబ్దాల కిందటి సోయా సాస్: దక్షిణ కొరియా ట్రంప్‌కి 360 ఏళ్ల కిందటి సోయా సాస్‌ను వడ్డించింది. ఈ సాస్ అమెరికా కంటే పురాతనమైంది. దీన్ని బట్టి అమెరికాకన్నా దక్షిణ కొరియాకు ఎక్కువ చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
మెక్సికో టాకోస్: ట్రంప్ వంటకాల ఎంపికలోనూ అనేక రాజకీయ కారణాలు ఉంటాయట. దక్షిణ కొరియా, అమెరికా బలగాలతో కలిసి మిలిటరీ బేస్‌లో మెక్సికో సంప్రదాయ వంటకమైన టాకోలను ట్రంప్ ఆరగించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
టాకోస్, బుర్రీడోతో పాటు వేపుళ్లు చాలా బాగున్నాయని ట్రంప్ మెచ్చుకున్నారు. సైనికులతో కలిసి చాలా పసందైన భోజనం చేశానంటూ ట్రంప్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కుంగ్ పూ చికెన్, చిల్లీ ఫిష్:
చైనా వెళ్లిన ట్రంప్ ఏది తినాలో ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే, అమెరికన్లు బాగా ఇష్టపడే కుంగ్ పూ చికెన్‌ను వడ్డించారు.
చికెన్ ముక్కలను మిరపకాయలతో కలిపి బాగా ఫ్రై చేసి ఈ వంటకాన్ని చేస్తారు. దాంతోపాటు, చిల్లీ ఫిష్‌నూ వడ్డించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
అయితే, ఈ మెనూపై చైనా నేతల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు చైనా సంప్రదాయ వంటకాల గొప్పదనాన్ని చెప్పేలా మెనూ ఉందని అంటే, మెనూ భిన్నంగా లేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.

భోజనానంతరం
ట్రంప్ మనవరాలి నోట చైనా పాట :భోజనం పూర్తయిన తర్వాత ట్రంప్ తన మనవరాలు అరబెల్లా, మాండరిన్ భాషలో పాట పాడుతున్న వీడియోను అందరికీ చూపించారు. ఐదేళ్ల ఆ బాలిక, చైనా పాటలు, పద్యాలు పాడుతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

ఫొటో సోర్స్, AFP/Getty Images
హలో-హలో: ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ వియత్నాం వెళ్లారు. అక్కడ నుంచి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో దుతెర్రేతో సమావేశమయ్యేందుకు బయలుదేరుతారు.
అక్కడ హలో-హలో అనే స్థానిక స్వీట్‌ను ట్రంప్ ఆగరిస్తారట.

ఇలా తన పన్నెండు రోజుల ఆసియా పర్యటనలో వివిధ రకాల వంటకాలను రుచిచూసిన ట్రంప్, అమెరికా తిరుగు ప్రయాణంలో తన ఇంటి వంటకాలను ఆరగిస్తారట.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)