PAKvAFG : పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అఫ్గాన్‌పై గెలుపు

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Reuters

క్రికెట్ వరల్డ్ కప్‌లో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ నెగ్గింది.

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అఫ్గాన్ ఇచ్చిన 228 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది.

ఇమాద్ వసీం (51 బంతుల్లో 49) ఆఖరి వరకూ ఉండటం, చివర్లో వాహబ్ రియాజ్ (9 బంతుల్లో 15) మెరుపులు తోడవ్వడంతో పాక్ గట్టెక్కింది.

ఇమాద్ వసీం ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్.

అఫ్గాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ, ముజీబ్ రెహమాన్ చెరో రెండు వికెట్లు తీశారు. రషీద్ ఖాన్‌కు ఒక వికెట్ పడింది.

అంతకుముందు నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గాన్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.

అఫ్గాన్ బ్యాట్స్‌మెన్‌లో అస్గర్, నజీబుల్లా చెరో 42 పరుగులు సాధించి టాప్ స్కోరర్లుగా నిలిచారు.

పాక్ బౌలర్లలో షహీన్ నాలుగు వికెట్లు తీయగా.. వాహబ్ రియాజ్, ఇమాద్ వసీం రెండేసి వికెట్లు పడగొట్టారు.

మ్యాచ్ ఎలా సాగిందంటే..

ఆఖరి ఓవర్‌లో ఆరు పరుగులు అవసరం కాగా, మరో రెండు బంతులు మిగిలి ఉండగాన్ పాక్ లక్ష్యాన్ని ఛేదించింది.

రషీద్ వేసిన 49వ ఓవర్ రెండో బంతికే వాహబ్ రియాజ్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి.

ముజీబ్ అద్భుత ఓవర్..

48వ ఓవర్‌లో పాక్‌కు 2 పరుగులే వచ్చాయి.

ముజీబ్ ఈ ఓవర్‌ను అద్భుతంగా వేశాడు.

పాక్ గెలవాలంటే 12 బంతుల్లో 16 పరుగులు చేయాలి.

ఏడో వికెట్..

పాకిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది.

రషీద్ ఖాన్ వేసిన 47వ ఓవర్ నాలుగో బంతికి షాదాబ్ ఖాన్ (11) రనౌట్ అయ్యాడు.

అయితే, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వాహబ్ రియాజ్ ఓ ఫోరు కొట్టాడు.

ఈ ఓవర్‌లో మొత్తం 10 పరుగులు వచ్చాయి.

విజయం సాధించాలంటే పాక్ 18 బంతుల్లో 18 పరుగులు చేయాలి.

ఒకే ఓవర్‌లో మూడు ఫోర్లు..

పాక్‌ను కట్టడి చేస్తూ వచ్చిన అఫ్గాన్ జట్టు ఒక్కసారి పట్టు సడలించింది.

ఒక్క 46వ ఓవర్‌లోనే 18 పరుగులు సమర్పించుకుంది. అఫ్గాన్ కెప్టెన్ గుల్బదీన్ వేసిన ఈ ఓవర్‌లో ఇమాద్ వసీం మూడు ఫోర్లు బాదాడు.

దీంతో పాక్ చేయాల్సిన పరుగులు 28కి తగ్గాయి. ఇంకా 24 బంతులున్నాయి.

45 ఓవర్లకు..

45 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 182-6.

క్రీజులో ఇమాద్ వసీం (23), షాదాబ్ ఖాన్ (6) ఉన్నారు.

పాక్ గెలవాలంటే 30 బంతుల్లో 46 పరుగులు చేయాలి.

ఇమామ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇమామ్

156కు ఆరు..

పాకిస్తాన్ కష్టాల్లో పడింది.

156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

38వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ సర్ఫరాజ్ (18) రనౌట్ అయ్యాడు.

పాక్ గెలవాలంటే 66 బంతుల్లో 72 పరుగులు చేయాలి.

రషీద్‌కు వికెట్

రషీద్ ఖాన్ వేసిన 35వ ఓవర్ చివరి బంతికి హారిస్ సోహైల్ (27) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.

35 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 142-5.

గెలవాలంటే 84 బంతుల్లో 84 పరుగులు చేయాలి.

నాలుగో వికెట్ కోల్పోయిన పాక్

జట్టు స్కోరు 121 పరుగుల వద్ద ఉండగా హఫీజ్ ఔటయ్యాడు.

ముజీబ్ వేసిన 30వ ఓవర్‌లో తొలి బంతికి ఈ వికెట్ పడింది.

నాలుగో వికెట్‌కు హఫీజ్, హారిస్ కలిసి 40 పరుగులు జోడించారు.

30 ఓవర్లు పూర్తయ్యేసరికి పాక్ స్కోరు 124-4.

క్రీజులో హారిస్ (19), పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ (2) ఉన్నారు.

25 ఓవర్లకు..

బాబర్, ఇమామ్ వికెట్లు పడ్డ తర్వాత పాక్ స్కోరు వేగం నెమ్మదించింది.

18వ ఓవర్ మొదలుకొని, ఆ తర్వాతి ఆరు ఓవర్లలో కేవలం 15 పరుగులే వచ్చాయి.

25 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.

హఫీజ్ 15 పరుగుల వద్ద, హారిస్ 6 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నారు.

వెనువెంటనే రెండు వికెట్లు

తొమ్మిది పరుగుల వ్యవధిలో క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్ వికెట్లను పాక్ కోల్పోయింది.

నబీ బౌలింగ్‌లోనే ఈ రెండు వికెట్లూ పడ్డాయి.

18వ ఓవర్‌లో 81 పరుగుల వద్ద బాబర్ ఆజం (45) బౌల్డయ్యాడు.

అంతకుముందు నబీ వేసిన 16వ ఓవర్‌ చివరి బంతికి ఇమామ్ (36) స్టంపౌట్ అయ్యాడు.

రెండో వికెట్‌కు ఆజం, ఇమామ్ 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

18 ఓవర్లు పూర్తయ్యేసరికి పాక్ స్కోరు 82-3

క్రీజులో హారిస్ (1), హఫీజ్ (0) ఉన్నారు.

బాబర్ ఆజం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, బాబర్ ఆజం

15 ఓవర్లకు..

15 ఓవర్లు ముగిసేసరికి పాక్ ఒక వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది.

బాబర్ ఆజమ్ (35), ఇమామ్ ఉల్ హఖ్ (36) క్రీజులో కుదురుకున్నారు.

రషీద్ ఖాన్ వేసిన15వ ఓవర్‌లో ఓ బౌండరీ సహా ఏడు పరుగులు వచ్చాయి.

అఫ్గాన్ జట్టు పేలవంగా ఫీల్డిండ్ చేస్తోంది.

10 ఓవర్లకు..

పది ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 49-1

బాబర్ ఆజమ్ (23), ఇమామ్ ఉల్ హఖ్ (26 కుదురుగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.

రెండో వికెట్‌కు వీళ్లిద్దరూ ఇప్పటివరకూ 49 పరుగులు జోడించారు.

ఎనిమిదో ఓవర్‌లో ఇమామ్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు.

ఆరంభంలోనే పాక్‌కు షాక్

లక్ష్య ఛేదనలో పాక్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది.

స్కోరు సున్నా వద్ద ఉండగానే ఓపెనర్ ఫఖార్ జమాన్ డకౌట్ అయ్యాడు.

ముజీబ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ఈ వికెట్ పడింది.

రెండు ఓవర్లు ముగిసేసరికి పాక్ 10-1 స్కోరుతో ఉంది.

ఇమామ్ ఉల్ హఖ్ (4), బాబర్ ఆజమ్ (6) బ్యాటింగ్ చేస్తున్నారు.

షహీన్

ఫొటో సోర్స్, Getty Images

పాక్ విజయలక్ష్యం 228

అఫ్గాన్ జట్టు పాక్ ముందు 228 పరుగుల లక్ష్యం ఉంచింది.

నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.

అఫ్గాన్ బ్యాట్స్‌మెన్‌లో అస్గర్, నజీబుల్లా చెరో 42 పరుగులు సాధించి టాప్ స్కోరర్లుగా నిలిచారు.

పాక్ బౌలర్లలో షహీన్ నాలుగు వికెట్లు తీయగా.. వాహబ్ రియాజ్, ఇమాద్ వసీం రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఇన్నింగ్స్ ఆఖరి ఐదు ఓవర్లలో అఫ్గాన్ రెండు వికెట్లు చేజార్చుకుని, 24 పరుగులు సాధించింది.

ఏడో వికెట్..

202 పరుగుల స్కోరు వద్ద అఫ్గాన్ ఏడో వికెట్ చేజార్చుకుంది.

45వ ఓవర్‌లో మూడో బంతికి ఫోర్ కొట్టి జట్టు స్కోరును 200 దాటించిన నజీబుల్లా (42), ఆ మరుసటి బంతికి బౌల్డయ్యాడు.

షహీన్‌కే ఈ వికెట్ కూడా పడింది. అతడికిది మ్యాచ్‌లో మూడో వికెట్.

ఏడో వికెట్‌కు షిన్వారీ, నజీబుల్లా కలిసి 35 పరుగులు జోడించారు.

45 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 203-7.

గత ఐదు ఓవర్లలో ఆ జట్టుకు 19 పరుగులు మాత్రమే వచ్చాయి.

40 ఓవర్లకు..

40 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 184-6 స్కోరుతో ఉంది.

నజీబుల్లా (33) కాస్త కుదురుకుని ఆడుతున్నాడు. అతడితోపాటు షిన్వారీ (3) క్రీజులో ఉన్నాడు.

నబీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నబీ

ఆరో వికెట్..

167 పరుగుల స్కోరు వద్ద అఫ్గాన్ ఆరో వికెట్ కోల్పోయింది.

37 ఓవర్ నాలుగో బంతికి నబీ (16) క్యాచౌట్ అయ్యాడు. వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో ఈ వికెట్ పడింది.

37 ఓవర్లు పూర్తయ్యేసరికి అఫ్గాన్ స్కోరు 169-6.

35 ఓవర్లకు

35 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

గత 15 ఓవర్లలో అఫ్గాన్ 55 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదే సమయంలో రెండు వికెట్లు కోల్పోయింది.

ప్రస్తుతం నజీబుల్లా (15). నబీ (14) క్రీజులో ఉన్నారు.

అఫ్గాన్‌కు ఎదురుదెబ్బ

కుదురుకుంటోందని భావిస్తున్న సమయంలో అప్గా‌న్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

25 ఓవర్లకు 120-3 స్కోరుతో ఉన్న ఆ జట్టు ఆ తర్వాత 4 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది.

అస్గర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అస్గర్

బాగా ఆడుతున్న అస్గర్ (35 బంతుల్లో 42) ఔటయ్యాడు. షాదాబ్ ఖాన్ వేసిన 26వ ఓవర్ రెండో బంతికి అతడు బౌల్డ్ అయ్యాడు.

27వ ఓవర్ చివరి బంతికి ఇక్రమ్ కూడా క్యాచౌటయ్యాడు.

అస్గర్, ఇక్రమ్‌ కలిసి నాలుగో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

27 ఓవర్లకు అఫ్గాన్ 125-5స్కోరుతో ఉంది. క్రీజులో నబీ (1), నజీబుల్లా (0) ఉన్నారు.

20 ఓవర్లకు

20 ఓవర్లు ముగిసేసరికి అప్గాన్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 104 పరుగుల స్కోరుతో ఉంది.

అస్గర్ అఫ్గాన్ (35) కుదురుగా ఆడుతున్నాడు. ఇక్రమ్ (41 బంతుల్లో 13) మాత్రం చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

నాలుగో వికెట్‌కు వీళ్లిద్దరూ 47 పరుగులు జోడించారు.

షాదాబ్

ఫొటో సోర్స్, AFP

మూడో వికెట్ కోల్పోయిన అఫ్గాన్

అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కూడా కోల్పోయింది.

కాస్త కుదురుగా ఆడుతున్న రహ్మత్ షా (35) 12వ ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన బంతిని బాబర్ ఆజమ్ అలవోకగా అందుకున్నాడు. ఇమాద్ బౌలింగ్‌లో ఈ వికెట్ పడింది.

12 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 57-3.

ఇక్రమ్ (3), అస్గర్ (0) బ్యాటింగ్ చేస్తున్నారు.

పది ఓవర్లకు..

పది ఓవర్లు పూర్తయ్యేసరికి అఫ్గానిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.

క్రీజులో రహ్మత్ షా (27 ), ఇక్రమ్ ఉన్నారు. పది బంతులు ఎదుర్కొన్న ఇక్రమ్ ఇంకా ఖాతా కూడా తెరవలేదు.

షహీన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, షహీన్

వరుసగా రెండు వికెట్లు

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ జట్టు 27 పరుగుల స్కోరు వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది.

షహీన్ అఫ్రీది వేసిన ఐదో ఓవర్‌ నాలుగో బంతికి అఫ్గాన్ కెప్టెన్ గుల్బదీన్ (15) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలుత అంపైర్ దీన్ని నాటౌట్‌గా ప్రకటించినా, పాక్ డీఆర్ఎస్‌కు వెళ్లింది. ఫలితం ఆ జట్టుకు అనుకూలంగా వచ్చింది.

గుల్బదీన్ స్థానంలో వచ్చిన హష్మతుల్లా (0) కూడా ఆ తర్వాతి బంతికే క్యాచౌట్ అయ్యాడు.

దీంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి అఫ్గాన్ స్కోరు 31-2కి చేరింది. క్రీజులో రహ్మత్ షా (12), ఇక్రమ్ (0) ఆడుతున్నారు.

తుది జట్లివే..

పాక్: 1 ఇమామ్ ఉల్ హఖ్, 2 ఫఖార్ జమాన్, 3 బాబార్ ఆజం, 4 మహమ్మద్ హఫీజ్, 5 హరీస్ సొహైల్, 6 సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్ & కీపర్), 7 ఇమాద్ వసీం, 8 షాదాబ్ ఖాన్, 9 మహమ్మద్ ఆమిర్, 10 వాహబ్ రియాజ్, 11 షహీన్ అఫ్రీది

అప్గాన్: 1 గుల్బదీన్ (కెప్టెన్), 2 రహ్మత్ షా, 3 హష్మతుల్లా , 4 అస్గర్ , 5 సమియుల్లా, 6 మహమ్మద్ నబీ, 7 నజీబుల్లా 8 ఇక్రమ్ (కీపర్), 9 రషీద్ ఖాన్, 10 హమీద్, 11 ముజీబ్

రిస్థితి ఇదీ

టోర్నీ ఆరంభంలో పేలవ ఆట తీరుతో నిరాశ పరిచిన పాక్ గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో పుంజుకుంది. అప్గాన్‌తో ఈ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్‌తో ఆ జట్టు తలపడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే పాక్‌కు సెమీస్ చేరే అవకాశాలుంటాయి.

అఫ్గాన్ ఫ్యాన్స్

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు అఫ్గాన్ జట్టు టోర్నీలో ఇంతవరకూ ఒక్క విజయం కూడా సాధించలేదు. కానీ, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు దాదాపు గట్టి పోటీ ఇచ్చి టీమిండియాను భయపెట్టింది.

అందువల్ల ఈ మ్యాచ్ కూడా పాక్‌కు నల్లేరుపై నడకేమీ కాబోదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)