అతిభయంకర వైరస్‌లున్న ల్యాప్‌టాప్.. రూ.7.6 కోట్లు.. మీరేమైనా కొనుక్కుంటారా?

ఫొటో సోర్స్, thepersistenceofchaos.com
'వన్నా క్రై' కంప్యూటర్ వైరస్ పేరు విన్నారా?
2017లో 3 లక్షలకుపైగా కంప్యూటర్‌లకు సోకి, సైబర్ ప్రపంచాన్ని ఇది గడగడలాంచింది.
అయితే, ఇలాంటి ఆరు అతిభయంకర వైరస్‌లు ఓ ల్యాప్‌టాప్‌కు ఎక్కించారు పరిశోధకులు.
అమెరికాలో దాన్ని అమ్మకానికి పెట్టారు.
ఈ వైరస్‌లు ఎంత ప్రమాదకరమైనవంటే.. అన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ.6.6 లక్షల కోట్లకుపైగా నష్టాన్ని కలిగించాయి.
'బుద్ధున్నవాళ్లు ఎవరైనా ఇలాంటి ల్యాప్‌టాప్‌ను కొనుక్కుంటారా?' అని అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్లే.
ఇప్పటికే ఓ ఔత్సాహికుడు రూ.7.6 కోట్లకు దాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
ల్యాప్‌టాప్ వేలం ముగిసే గడువు ఇంకా మిగిలి ఉండటంతో దీని ధర మరింత పెరిగి అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సైబర్ సెక్యూరిటీ సంస్థ డీప్ ఇన్‌స్టిక్ట్‌తో కలిసి చైనీస్ ఇంటర్నెట్ ఆర్టిస్ట్ గ్వో ఓ డాంగ్.. 'ద పర్సిస్టెన్స్ ఆఫ్ కేవోస్' పేరుతో ఓ ఆర్ట్ ప్రాజెక్ట్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు.
కావాలని ఆరు అతిభయంకర వైరస్‌లను దీనికి ఎక్కించారు. దీన్నో ఓ కళాఖండం అని వారు అంటున్నారు.
వైరస్‌లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, ఈ ల్యాప్‌టాప్‌ను మరే నెట్‌వర్క్‌తో అనుసంధానం కాకుండా చేసే చర్యలు తీసుకున్నట్లు వారు చెబుతున్నారు.
ఇంటర్నెట్‌తోనూ కనెక్ట్ అయ్యే వీలు లేకుండా చేసి దీన్ని కొనుగోలుదారుకు ఇస్తామని వివరిస్తున్నారు.
అమెరికాలో నష్టం కలిగించే ఉద్దేశంతో కంప్యూటర్ వైరస్‌లను విక్రయించడం నేరం.
అందుకే కేవలం కళాఖండంలా గానీ, పరిశోధనల కోసం గానీ దీన్ని కొనుక్కోవచ్చు.
''సైబర్ ప్రపంచం ఎదుర్కొన్న చారిత్రక ముప్పులు ఈ వైరస్‌లు. వాటిని యాక్టివ్‌గా ఓ ల్యాప్‌టాప్‌లో చూడటం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంటుంది'' అని గ్వో ‘వైస్’ వార్తా వెబ్‌సైట్‌తో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ల్యాప్‌టాప్‌లోని ఆరు వైరస్‌లు ఇవే..
- వన్నాక్రై
- ఐలవ్‌యూ
- మైడూమ్
- సోబిగ్
- డార్క్‌టెకీలా
- బ్లాక్‌ఎనర్జీ
అయితే, ఇలాంటి ల్యాప్‌టాప్ కోసం డబ్బులు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు కెవిన్ బ్యూమోంట్ అంటున్నారు.
''దాన్ని కొనుక్కోవాలని అనుకునేవారు యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్‌లు లేకుండా తమ ల్యాప్‌టాప్‌ను వదిలేస్తే సరిపోతుంది. డబ్బులు మిగులుతాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
- జికా వైరస్: క్యాన్సర్‌కు మందు
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ‘నిపా’ వైరస్‌కు బలైన నర్స్ లిని తన భర్తకు రాసిన అంతిమ లేఖ
- జహంగీర్: సొంత కొడుకు కళ్లు పొడిపించిన మొఘల్ చక్రవర్తి
- ఫోన్ స్కామ్: మొబైల్ ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- 'భర్త కళ్ల ముందే మహిళపై సామూహిక అత్యాచారం.. మొబైల్‌తో షూటింగ్'
- మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా, కాలేదా.. ఈ 7 సంకేతాలే చెబుతాయి!
- తెలుగుదేశం పార్టీ: గత వైభవాన్ని తీసుకురాగల నాయకుడెవరు
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- కోడిని చంపకుండా కోడికూర: ఈ పరిశోధనలతో సాధ్యమేనా
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలోసూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి? అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








