'భర్త కళ్ల ముందే మహిళపై సామూహిక అత్యాచారం.. మొబైల్‌తో షూటింగ్': రాజస్థాన్‌లో దళిత సంఘాల నిరసనలు

ఫొటో సోర్స్, MAHESH VERMA/BBC
రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో ఓ దళిత మహిళపై ఆమె భర్త కళ్ల ముందే కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లుగా దృశ్యాలున్న వీడియో వైరల్ అయ్యింది.
ఘటనపై మండిపడుతూ దళిత సంఘాలు అల్వర్‌లోని థానాగాజీలో నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.
రహదారిపై వెళ్తున్న ఆ దంపతులను నిందితులు అటకాయించి అఘాయిత్యానికి పాల్పడ్డారని, తమ చర్యలను మొబైల్‌తో చిత్రీకరించారని ఆరోపించాయి.
వీడియోను బయటపెడతామని నిందితులు హెచ్చరించడంతో ఘటనపై ఆ దంపతులు మొదట మౌనం వహించారని పేర్కొన్నాయి.
వారిని నిందితులు డబ్బుల కోసమూ బెదిరించారని, చివరికి వీడియోను బయటపెట్టారని ఆరోపించాయి.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఈ విషయం బయటకు రాకుండా కొన్ని రోజులపాటు తొక్కిపట్టి ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
విధుల నిర్వహణలో అలసత్వం వహించారన్న ఆరోపణలతో స్థానిక స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సర్దార్ సింగ్‌ను పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది.
ఏప్రిల్ 26న ఈ అత్యాచార ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

దళిత సంఘాల ఆగ్రహం
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ థానాగాజీ పట్టణంలో దళిత సంఘాలు మంగళవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. స్థానికంగా ఉన్న జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నాయి.
ఈ పరిణామాల తర్వాతే పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు.
అత్యాచార ఘటనలో ఐదుగురు పాల్గొన్నారని, నిందితులను వెతికిపట్టుకునేందుకు 14 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయని రాజస్థాన్ డీజీపీ కపిల్ గార్గ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.
పోలీసుల శాఖలో నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
అత్యాచారాన్ని నిందితులు మొబైల్‌లో చిత్రీకరిస్తూ ఆ మహిళ భర్తను విచక్షరహితంగా కొట్టారని దళిత సంఘాలు ఆరోపించాయి. తమను వదిలిపెట్టాలని ఆ దంపతులు వేడుకున్నా, కనికరం చూపలేదని పేర్కొన్నాయి.
''మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ఆ దంపతులను ఐదుగురు వ్యక్తులు అటకాయించారు. నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. భర్త సమక్షంలోనే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు'' అని చరణ్ సింగ్ అనే దళిత కార్యకర్త బీబీసీతో చెప్పారు.

‘వారి కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది’
ఘటన తర్వాత ఆ దంపతులను సమ్యక్ సమాజ్ సంఘ్ అనే సంస్థకు చెందిన రామ్‌స్వరూప్ బౌద్ధ్ కలిశారు.
వారి కుటుంబ పరిస్థితి గురించి ఆయన బీబీసీకి వివరించారు.
''అత్యాచార ఘటన తర్వాత వారి కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది. తమ జీవితాలు నాశనమయ్యాయని వారు బాధపడుతున్నారు. వారి బాధను అందరూ అర్థం చేసుకోవాలి. సందేహించొద్దు'' అని రామ్‌స్వరూప్ అన్నారు.
నిందితుల ఆగడాలు తాళలేక మే 2న ఆ జంట పోలీసులను ఆశ్రయించిందని 'డెమొక్రటిక్ ఇండియా' అనే ఎన్జీవోకు చెందిన మహేశ్ వర్మ చెప్పారు.
కేసు నమోదు చేసుకున్నా, పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదని, ఎన్నికలు ఉండటంతోనే తాత్సారం చేశారని అన్నారు.
అయితే, పోలీసులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
దళితులపై అత్యాచారాలు ఎక్కువగా నమోదయ్యే రాష్ర్టాల్లో రాజస్థాన్ ఏటా తొలి మూడు స్థానాల్లో ఉంటుందని దళిత్ అధికార కేంద్ర సంస్థ పీఎల్ మీమ్రోఠ్ అన్నారు.
గతేడాది హోళీ పండుగ రోజు రాష్రంలోని భివాడీలో ఓ దళితుడిని కొందరు కొట్టిచంపారని రామ్‌స్వరూప్ బౌద్ధ్ గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
- ''మమ్మల్ని సెక్స్ బానిసలుగా అమ్మేశారు, అత్యాచారం చేశారు''
- భారత్‌లో మహిళలు సురక్షితంగానే ఉన్నారా...
- మామిడి పళ్లు నోరూరిస్తున్నాయా.. ఆరోగ్యం జాగ్రత్త
- #MeToo: 'పని మనుషులపై లైంగిక వేధింపులు.. లక్షల్లో బాధితులు'
- "సీజేఐ వేధించారంటున్న ఆ మహిళ మరి సుప్రీంకోర్టునే ఎందుకు నమ్మారు"
- 'దళిత' పదం: అవమానకరమా... ఆత్మగౌరవ సంకేతమా?
- దళితుడు ఖరీదైన కారులో వెళ్లినందుకు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు దాడి చేశారా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









