''మమ్మల్ని సెక్స్ బానిసలుగా అమ్మేశారు, అత్యాచారం చేశారు''

ఫొటో సోర్స్, Getty Images
ఈమె పేరు అష్వక్. వయసు 19 ఏళ్లు.
ఉత్తర ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్) ఈమెను లైంగిక బానిసగా అమ్మేసింది.
తర్వాత అష్వక్ అక్కడి నుంచి తప్పించుకుని జర్మనీకి పారిపోయారు. అయినా ఆమెకు ప్రశాంతత లభించలేదు.
తనను గతంలో బానిసగా చేసుకున్న వ్యక్తి మళ్లీ జర్మనీలో ప్రత్యక్షమయ్యాడు. చివరకు ఆమె వారి చెర నుంచి తప్పించుకుని బయటపడ్డారు.
యజీదీ సముదాయానికి చెందిన ఈ యువతి జర్మనీలో ఉండలేక తిరిగి ఇరాక్ చేరుకున్నారు. అక్కడ శరణార్ధుల శిబిరంలో ఆమె ఆశ్రయం పొందుతున్నారు.
తాను లైంగిక బానిసత్వం నుంచి ఏ విధంగా బయటపడ్డారో బీబీసీకి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

ఫొటో సోర్స్, Getty Images
సూపర్ మార్కెట్‌లో భోజనం చేసి, స్కూలుకు వెళ్తున్న సమయంలో ఓ కారు వచ్చి నా పక్కగా ఆగింది. అతను ముందు సీట్లో కూర్చున్నాడు. 'అష్వక్ అంటే నువ్వేనా?' అని జర్మన్ భాషలో అడిగాడు. నేను భయంతో వణికిపోయాను. 'నేను అష్వక్ కాదు.. నువ్వెవరు?' అని అడిగాను.
దానికి అతను 'నువ్వే అష్వక్ అని నాకు తెలుసు. నేను అబూ హుమామ్' అని బదులిచ్చాడు.
ఆ తర్వాత అతను అరబిక్‌లో మాట్లాడుతూ.. 'అబద్ధం చెప్పకు. నువ్వు నాకు తెలుసు. నువ్వు ఎక్కడుంటావో, ఎవరితో ఉంటావో కూడా తెలుసు' అన్నాడు.
అతనికి నా గురించి మొత్తం తెలుసు.
చాలా భయపడ్డాను.
ఆ భయాన్ని ఎవ్వరూ అంచనా వేయలేరు.
నేనొక్కదాన్నే కాదు. జర్మనీలో చాలామంది యజీదీ అమ్మాయిలు నాలాగే బాధపడుతున్నారు.
కారులో వచ్చిందీ, గతంలో నన్ను బంధించిందీ ఒకరే.

అతని గొంతు నాకు బాగా గుర్తు.
వెయ్యేళ్లు గడిచినా, అతని గొంతునూ, ముఖాన్నీ గుర్తుపడతాను.
అతను ఎక్కడున్నా ఇట్టే గుర్తుపడతాను.
రోజుకు 24 గంటలూ మమ్మల్ని కొడుతూ, మమ్మల్ని గమనిస్తూ మాతోనే ఉండేవాడు.
అందుకే అతడిని గుర్తుపట్టగలిగాను.
మా గుండెలు ఇంకా బరువెక్కి ఉన్నాయి.
మా బంధువుల ఆచూకీ తెలిసేవరకూ మా ఊరు సిన్జర్‌కు వెళ్లాలని లేదు.
ఇకపై ఇరాక్‌లో జీవించలేం.
మా మనసు గాయపడింది. మమ్మల్ని సెక్స్ బానిసల్లా అమ్మేశారు, మాపై అత్యాచారం చేశారు.
ఇవి కూడా చదవండి
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.










