పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్, టెన్నిస్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి.. వారానికి రూ.1.13 కోట్లు ఆర్జన

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మైకేల్ ఎమెన్స్
- హోదా, బీబీసీ స్పోర్ట్స్
ఈ వారం మొదట్లో ఫోర్బ్స్ అత్యధిక మొత్తం సంపాదిస్తున్న మహిళా అథ్లెట్ల జాబితా విడుదల చేసింది. ఇందులో టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టాపర్‌గా నిలవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ అదే జాబితాలో ఏడో స్థానంలో ఉన్నది ఎవరో పెద్దగా ఎవరికీ తెలియదు.
ఆమే పూసర్ల వెంకట సింధు. ఈ తెలుగు క్రీడాకారిణి 2016లో రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారత్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఆమె ఆటల్లో గెలుపు ద్వారా గత ఏడాది అయిదు లక్షల డాలర్లు సంపాదించారు.
కానీ ఎండార్స్‌మెంట్స్ ద్వారా మాత్రం ఆమెకు అంతకన్నా చాలా ఎక్కువ మొత్తం వచ్చింది. ఆమెకు 80 లక్షల డాలర్ల విలువైన స్పాన్సర్‌షిప్‌లు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
అంటే ఆమెకు వారానికి 1.63 లక్షల డాలర్ల సంపాదన అందుతోందన్నమాట. రూపాయల్లో చెప్పాలంటే ఈమె వారానికి 1.13 కోట్లు ఆర్జిస్తున్నారు. ఇది ఆగస్టు 22కి డబ్ల్యూటీఏ (విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్) ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్ ఆదాయం కన్నా ఎక్కువ.
ఒలింపిక్స్‌కి ముందు సింధు స్పాన్సర్స్ కోసం పలువురిని సంప్రదించగా.. చాలా మంది ఆమెను ‘మీరు ఎవరు?’ అని అడిగారట. ఈ మేరకు సింధూ వాణిజ్య విషయాలు చూసుకుంటున్న బేస్‌లైన్ వెంచర్స్ గ్రూప్ ఎండీ తుహిన్ మిశ్రా 2017లో సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
సింధూ ఒలింపిక్స్‌లో రజతం గెలిచాక ఆమెకు వివిధ రాష్ర్ట ప్రభుత్వాల నుంచి 13 కోట్ల రూపాయలు నగదు బహుమతులుగా అందాయి.
ఇదే ఒలింపిక్స్‌లో సింధుపై గెలిచి గోల్డ్ కొట్టిన మారిన్‌కి స్పెయిన్‌లో లభించిన నగదు బహుమతుల విలువ రూ.70 లక్షలు.

ఫొటో సోర్స్, Pvsindhu1/twitter
సింధుకు నగదు బహుమతులతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి కూడా బహుమతులు అందాయి. హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ బీఎండబ్ల్యూ కారును కూడా సచిన్ చేతుల మీదుగా బహూకరించింది.
అప్పటి నుంచి ఆమెకు స్పాన్సర్ చేయడానికి చాలా కంపెనీలు వరుసకట్టాయి.
చివరకు ఈమె స్పాన్సర్‌షిప్‌లు క్రికెటర్లనూ మించిపోయాయి. ఒక్క కోహ్లీ తప్ప.
సింధుకు స్పాన్సర్ల జాబితాలో బ్రిడ్జ్ స్టోన్ టైర్లు, స్పోర్ట్స్ డ్రింక్ గటోరాడే, మూవ్, మింత్రా, నోకియా, పానసోనిక్, తేనె ఉత్పత్తి సంస్థ ఏపీఐఎస్ హిమాలయ, హెర్బల్ డ్రింక్ ఓజశ్విత, బ్యాంక్ ఆఫ్ బరోడా, సీఆర్పీఎఫ్, వైజాగ్ స్టీల్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- గవర్నర్ గిరీ: ఎన్టీయార్ నుంచి కర్ణాటక వరకు
- బీజేపీ: అటల్- అడ్వాణీ నుంచి మోదీ-షా వరకు
- ఫేస్‌బుక్: సమాచారం భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- BBC EXCLUSIVE: సైనా నెహ్వాల్ ఇంటర్వ్యూ.. ‘సింధు టాప్ ప్లేయరే, కానీ ఈరోజు నాది’
- బుధియా ఇప్పుడేం చేస్తున్నాడు?
- సైనా-సింధు: ఒకరు విప్లవం తెచ్చారు.. మరొకరు ముందుకు తీసుకెళ్తున్నారు
- బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థా?
- క్రికెట్ 'ఉక్కు మనిషి' సీకే నాయుడు
- కిట్ కొనడానికి కష్టపడ్డ మిథాలీ.. ఇప్పుడు పారితోషికంలో టాప్
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- మహిళా ఉద్యోగులతో కంపెనీలకు మేలేనా?
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









