#BBCArchives: ఫిడెల్ క్యాస్ట్రో అరుదైన వీడియో ఇంటర్వ్యూ

ఫొటో సోర్స్, Getty Images
అది 1961. అప్పటి క్యూబా అధినేత ఫిడెల్ క్యాస్ట్రో కొంతమంది జర్నలిస్టుల బృందాన్ని వెంట తీసుకుని క్యూబా అంతటా పర్యటించారు. విప్లవం తరువాత ప్రజల జీవితాలలో వచ్చిన మార్పులను చూపించారు. ఆనాటి పాత్రికేయుల బృందంలో ఉన్న బీబీసీ రిపోర్టర్ రాబిన్ డే.. క్యాస్ట్రోను ఇంటర్వ్యూ చేశారు. దుబాసీ సహాయం లేకుండా ఆ ఇంటర్వ్యూలో క్యాస్ట్రో ఇంగ్లీషులోనే మాట్లాడారు. ఆనాటి అరుదైన వీడియో ఇంటర్వ్యూ బీబీసీ ఆర్కైవ్స్ నుంచి మీ కోసం.
రిపోర్టర్: క్యూబా, అమెరికాలు మంచి స్నేహితులుగా, సత్సంబంధాలు కలిగిన ఇరుగుపొరుగు దేశాలుగా ఉండాలంటే ఏం జరగాలని మీరు భావిస్తున్నారు?
క్యాస్ట్రో: క్యూబాతో అమెరికా కొత్త అజెండాతో చర్చలు జరపడం ఒక మార్గం. క్యూబాపై అమెరికా దురాక్రమణకు ప్రయత్నించింది. అయితే, నువ్వు నాశనం చేయాలనుకున్న దేశంతో నువ్వే చర్చలు జరపాలనుకోవడం కుదిరేపని కాదు.
రిపోర్టర్: డాక్టర్ క్యాస్ట్రో, మీరు అనుసరిస్తున్న విధానాలు క్యూబాలో ఆర్థిక సమస్యలకు దారి తీస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు?
క్యాస్ట్రో: మీరు క్యూబా అంతటా ప్రయాణిస్తున్నప్పుడు ఏం చూశారు? ప్రతి ఒక్కరు పని చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు మీకు కనిపించాయా?
రిపోర్టర్: ఇబ్బందులనైతే నేను చూడలేదు. అందరూ ఆనందంగానే కనిపించారు. అలా అని ఎలాంటి కొరతలు లేవని అనుకోలేం కదా? కొన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలు ఆనందంగానే కనిపించవచ్చు. కానీ, ఆ ఇబ్బందులే రేపు తీవ్రమైన సమస్యలుగా మారవచ్చు.
క్యాస్ట్రో: ఎటువంటి సమస్యలూ ఉత్పన్నం కావు. ఎందుకంటే, మేం ఉత్పాదకతను పెంచుతున్నాం. మీరు అన్ని రంగాలనూ చూశారు. ప్రతి రంగంలో ఎన్నో పనులు అవుతున్నాయి. యంత్ర సామగ్రి పెరుగుతోంది. వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగింది. అందుకే మాకు కావాల్సినవన్నీ మాకు అందుబాటులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
రిపోర్టర్: డాక్టర్ క్యాస్ట్రో, చాలా మంది మిమ్మల్ని ఒక కమ్యూనిస్ట్ అని అంటారు. అది నిజమేనా?
క్యాస్ట్రో: మేము సోషలిస్టులమని అంటున్నాం.
రిపోర్టర్: మిస్టర్ కృశ్చేవ్ (సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ మొదటి సెక్రటరీ) కూడా తనను తాను సోషలిస్ట్ అనే చెప్పుకుంటారు.
క్యాస్ట్రో: కానీ, ఆయన కమ్యూనిస్ట్‌గా మారబోతున్నానని అంటున్నారు, ఎందుకంటే ఆయనొక కమ్యూనిస్ట్ సమాజాన్ని నిర్మిస్తున్నారు. మేము సామ్యవాద సమాజాన్ని నిర్మిస్తున్నాం.
మా ఇతర కథనాలు చదవండి:
- క్యూబాలో క్యాస్ట్రోల 60 ఏళ్ల పాలనకు తెర
- చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని 10 కరచాలనాలు
- చే గువేరా భారతదేశం గురించి ఏమన్నారంటే..
- ఉత్తర కొరియాకు మిత్రదేశాలు ఎన్ని?
- 40 ఏళ్లలో చైనా నంబర్ వన్ ఎలా అయింది?
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
- మన కోసం ఆనాడు కార్ల్ మార్క్స్ చేసిన ఐదు పనులు!
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- విజయవాడలోని ఈ కమ్యూనిస్టుల విగ్రహాలు ఏం చెబుతున్నాయి?
- మాదాల రంగారావు: 'తెలుగు వెండితెరకు ఎర్ర రంగు అద్దిన తొలి హీరో'
- మహారాష్ట్ర రైతులను సీపీఐ(ఎం) ఎలా సమీకరించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)







