40 ఏళ్లలో చైనా నంబర్ వన్ ఎలా అయింది?

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో మావోత్సే తుంగ్ తర్వాత ఆ దేశంలో ఆర్థిక విప్లవం తీసుకొచ్చిన ఘనత డాంగ్ శ్యావోపింగ్‌కే దక్కుతుంది.
శ్యావోపింగ్ 1978లో ప్రారంభించిన ఆ ఆర్థిక విప్లవానికి ఇప్పుడు 40 ఏళ్లు నిండాయి. డాంగ్ శ్యావోపింగ్ ఈ ప్రస్తుత కాలాన్ని చైనాలో మరో విప్లవంగా చెబుతున్నారు.
ఈ ఆర్థిక సంస్కరణల తర్వాత చైనా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బలమైనదిగా నిలిచింది.
ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అత్యధిక విదేశీ కరెన్సీ నిల్వలున్న దేశంగా(312 బిలియన్ డాలర్లు) నిలిచింది.
జీడీపీని బట్టి చూస్తే చైనా (110 బిలియన్ డాలర్లు) రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో చైనా ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా నిలిచింది.
డాంగ్ శ్యావోపింగ్ ఆర్థిక సంస్కరణలను 1978లో ప్రారంభించారు. అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా వాటా 1.8 శాతం మాత్రమే ఉండేది. అది 2017 నాటికి 18.2 శాతానికి పెరిగింది.
చైనా ఇప్పుడు కేవలం అభివృద్ధి చెందుతున్న ఒక ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, అది తన గత బలాన్ని పుంజుకునే దిశగా కదులుతోంది. అప్పట్లో అంటే, 15, 16 శతాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా వాటా 30 శాతానికి దగ్గరగా ఉండేది.
వాస్తవానికి ముగ్గురు నేతలు చైనాను శక్తివంతమైన దేశంగా మార్చారని చెబుతారు. వారే మావోత్సే తుంగ్, డాంగ్ శ్యావోపింగ్, ప్రస్తుత నేత షీ జిన్‌పింగ్. శ్యావోపింగ్ ఆర్థిక విప్లవం వచ్చిన 40 ఏళ్ల తర్వాత మళ్లీ, షీ జిన్‌పింగ్ లాంటి బలమైన నేత నాయకత్వంలో చైనా దూసుకువెళ్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి షీ జిన్‌పింగ్ మానుఫ్యాక్చరింగ్ రంగంలో చైనాను సూపర్ పవర్‌గా మార్చాలని భావిస్తున్నారు. అందుకు ఆయన డాంగ్ శ్యావోపింగ్ విధానాలను అమలు చేస్తున్నారు.
వాటిలో ఆర్థికవ్యవస్థ పరిధి విస్తరించడం, ఆర్థిక సవరణలు చేయడం లాంటి చర్యలున్నాయి.
చైనా ఆర్థిక వ్యవస్థలో ఈ అద్భుతమైన వృద్ధికి ప్రభుత్వ పథకాలు, ప్రైవేటు వ్యాపారవేత్తలే కాకుండా మార్కెట్‌లో ఇతరులకూ దక్కాల్సి ఉంటుంది.
షీ జిన్‌పింగ్ పాలనలో చైనా పూర్తి రాజకీయ శక్తిగా మారింది. అలాంటప్పుడు, ఇక్కడి నేతలు ఆర్థిక వ్యవస్థను ఏ స్థాయి వరకూ నియంత్రణలో ఉంచాలని అనుకుంటున్నారనే ప్రశ్నకూడా తలెత్తుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
డాంగ్ హయాంలో చైనా ఆర్థిక వ్యవస్థ పరివర్తన
ఉవ్వెత్తున ఎగిసిన చైనా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా అభివృద్ధి చెందిన దేశంగానే ఉండిపోలేదు.
ఒక నియంత్రిత ఆర్థికవ్యవస్థ నుంచి బయటపడి, గొప్ప ఆర్థిక వ్యవస్థగా మార్పు చెందింది.
ప్రపంచంలో ఎన్నో దేశాలు చైనాలోని ఆ మార్పును స్వీకరించాయి. కానీ అందులో వరుస విజయాలు సాధించే విషయంలో మాత్రం పోస్టర్ బాయ్ చైనానే అయ్యింది.
మార్కెట్లో విశ్వాసం కోల్పోకుండా, చైనా దేశీయ ఆర్థిక వ్యవస్థలో క్రమేణా సంస్కరణల ప్రక్రియను ప్రారంభించింది. ఆర్థిక వ్యవస్థలో సవరణలు చేసే ముందే ఎక్కడ విదేశీ పెట్టుబడులు అనుమతించాలి, ఎక్కడ అనుమతించకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చింది.
చైనా దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆర్థిక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక ఆర్థిక విభాగం కోసం ఆ దేశం దక్షిణ తీర ప్రాంతాలను ఎంచుకుంది.
డాంగ్ శ్యావోపింగ్ కమ్యూనిస్ట్ సోషలిస్టు రాజకీయ వాతావరణంలో సమూల మార్పులకు పునాది వేశారు. దానికోసం ఆయన మొదట సోవియట్ ఆర్థిక మోడల్ అస్ర్తాన్ని వదిలించారు. తర్వాత చైనా అవసరాలు, అల్లికలకు అనుగుణంగా సోషలిజంతోపాటూ దేశ ఆర్థిక వ్యవస్థలో ఆధునికీకరణ ప్రక్రియను ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా రచయిత హువాంగ్ 'క్రాకింగ్ ద చైనా కనన్‌డ్రమ్: వై కన్వెన్షనల్ ఎకనామిక్ విజ్డమ్ ఈజ్ రాంగ్' అనే పుస్తకంలో "డాంగ్ ఒక గొప్ప సంస్కర్త మాత్రమే కాదు, ఆయనకు అసహనం కూడా ఉంది" అని రాశారు.
"డాంగ్ ఏ సోషలిస్టు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారో, వాటికి ఉదాహరణ మానవ చరిత్రలో లభించదు. చైనా జీడీపీ 1978 మధ్యలో 3,230 శాతం పెరిగింది." అని పేర్కొన్నారు.
చైనా విదేశీ వ్యాపారం 17,500 శాతం పెరిగింది. 2015లోనే చైనా విదేశీ వ్యాపారంలో ప్రపంచంలోనే నంబర్ వన్ అయ్యింది. 1978లో చైనా ఏడాది మొత్తంలో ఎంత వ్యాపారం చేసేదో, అంత వ్యాపారాన్ని ఇప్పుడు కేవలం రెండు రోజుల్లోనే చేస్తోంది.
అంతర్జాతీయ సంబంధాల విషయంలో డాంగ్ కొన్ని సిద్ధాంతాలు పాటించారు. ఆయన స్వయంగాలో ప్రొఫయిల్ మెయింటైన్ చేసేవారు. డాంగ్ దృష్టి పూర్తిగా చైనా ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడంపైనే ఉండేది.
హార్వర్డ్ యూనివర్సిటీ సోషల్ సైన్స్ ప్రొఫెసర్, ఎజ్రా వోజెల్.. డాంగ్ శ్యావోపింగ్ జీవితచరిత్ర రాశారు. ఆయన డాంగ్‌ను ఎంత గొప్ప నేతగా వర్ణించారంటే, ఆయన అన్నిరకాల అస్థిరతలను చక్కదిద్దగల సమర్థులని చెప్పారు.
చైనాలో ఆర్థిక పరివర్తనతో ఆ దేశ పౌరుల ఆర్థిక స్థితి మెరుగు పడడంతోపాటూ, ప్రభుత్వంపై చైనా కమ్యూనిస్టు పార్టీ పట్టు మరింత బిగిసింది. డాంగ్ ఆర్థిక సరళీకరణను చైనా రాజకీయ సరళీకరణగా చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
షీ జిన్‌పింగ్, కొత్త రూపంలో చైనా
డాంగ్ శ్యావోపింగ్ తరచూ టూ-క్యాట్ థియరీ కోట్ చేసేవాడు. పిల్లి ఎలుకను పట్టుకునేవరకూ, అది తెల్లదైనా, నల్లదైనా ఎలాంటి తేడా ఉండదనేవారు.
అదే విధంగా షీ జిన్‌పింగ్ చైనాలో పారిశ్రామిక అభివృద్ధి ప్రస్తావన తీసుకొచ్చారు. దానికోసం షీ జిన్‌పింగ్ టూ-బర్డ్స్ థియరీ చెప్పారు. 2014లో 12వ నేషనల్ కాంగ్రెస్‌లో ప్రసంగించిన షీ జిన్‌పింగ్ "పంజరం తెరవాల్సిన అవసరం ఉంది, ముసలి పక్షులను(అంతరించే దశలో ఉన్న పరిశ్రమలు) వాటిలో బంధించాల్సిన అవసరం లేదు" అన్నారు.
ఇప్పుడు ఆ దేశంలో చైనా తర్వాత నాయకుడు ఎవరవుతారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. గత ఏడాది మార్చిలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవీకాలాన్ని రద్దు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
దీనితోపాటే చైనాలో సోషలిజంపై షీ జిన్‌పింగ్ థాట్ ప్రారంభమైంది. దీనిని చైనా నూతన యుగంగా చెబుతున్నారు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీపై ఎవరి నియంత్రణ ఉంటుందో, అక్కడి మిగతా శక్తులన్నింటిపై కూడా వారి నియంత్రణే ఉంటుంది. షీ జిన్‌పింగ్ కమ్యూనిస్టు పార్టీలో ఉన్న తన శత్రువులందరినీ పూర్తిగా తొలగించారని కూడా చెప్పుకుంటారు.
షీ జిన్‌పింగ్ ప్రభుత్వ పరిశ్రమలను పూర్తిగా తన పట్టులోకి తెచ్చుకున్నారు. ప్రభుత్వ సంస్థలను కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణ నుంచి దూరం చేశారు. పూర్తిగా నిర్వహణ చూసేవారికి వీటి బాధ్యతను అప్పగించారు. షీ తన పదవీకాలంలో ఎన్జీఓలపై కూడా నియంత్రణ విధించారు. మానవ హక్కుల కోసం పోరాడిన ఎంతోమందిని అరెస్ట్ చేయించారు.
షీ జిన్‌పింగ్ తన తండ్రిలా ఉదారంగా ఉంటారని చాలా మంది అనుకునేవారు. షీ తండ్రి షీ చోంగ్‌షున్ 1978లో క్వాంగ్‌దోంగ్ ప్రాంతానికి గవర్నర్‌గా ఉండేవారు. ఆయన డాంగ్ శ్యావోపింగ్ ఆర్థిక విప్లవానికి నాయకుడు కూడా.
2012 డిసెంబర్ ప్రారంభంలో గ్వాంగ్‌దోంగ్‌లోని షేన్‌చేన్‌లో షీ జిన్‌పింగ్ మొదటి అధికారిక పర్యటన జరిగింది. ఆ పర్యటనలో ఆయన డాంగ్ సంస్కరణలకు ఎలాంటి అడ్డంకులూ ఉండవని సందేశం ఇవ్వాలని ప్రయత్నించారు. గత ఐదేళ్లలో షీ అలా చేసి చూపించారు కూడా.

ఫొటో సోర్స్, Getty Images
సరళీకరణ హద్దులు
చైనా సరళీకరణ కోసం ఆయన ఒక పూర్తి బ్లూ ప్రింట్ తయారు చేశారు. కేంద్రం నియంత్రణలో ఉండేవారి నేతృత్వం కోసం చైనా నేతలు పట్టుబట్టారు. కానీ స్థానిక ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు, విదేశీ పెట్టుబడుల మధ్య ఆశ్చర్యపరిచేలా అనుసంధానం ఏర్పడింది.
విదేశీ పెట్టుబడులకు చైనా స్వయంప్రతిపత్తి కల్పించింది. మొదటి నేతలతో పోలిస్తే షీ జిన్‌పింగ్ పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్ పై ఎక్కువ దృష్టి పెట్టారు.
2014 తర్వాత చైనాలో ప్రైవేటు పెట్టుబడులు చాలా వేగంగా పెరిగాయి. షీ జిన్‌పింగ్ వ్యాపార పరిధిని ప్రపంచమంతా పెంచారు. వన్ బెల్ట్, వన్ రోడ్ ప్రాజెక్ట్ ద్వారా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రేడ్ నెట్‌వర్క్‌ను ఆసియా, ఐరోపా, ఆఫ్రికాతో అనుసంధానం చేయాలనుకున్నారు.
ప్రస్తుతం చైనా తీరుపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహణకు చైనాకు రుణం చెల్లించలేని శ్రీలంక తమ హంబంటోటా పోర్టును ఆ దేశానికి 99 ఏళ్లు లీజుకు అప్పగించింది.
అదే వరుసలో జిబుతి, పాకిస్తాన్, కిర్గిస్తాన్ కూడా ఉన్నాయి. చైనా 2001లో విశ్వ వ్యాపార సంఘంలో భాగమైంది. ఆ తర్వాత నుంచి తమ విదేశీ వ్యాపారాన్ని సరళతరం చేసుకోడానికి చైనా ఏడు వేల నియమాలను ఉల్లంఘించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








