జపాన్: ఇది మ్యాన్ హోల్ అంటే నమ్మగలరా?

పారిశుద్ధ్య వ్యవస్థ ఎంత మెరుగ్గా ఉన్నా దానికి పెద్దగా అభిమానులు అంటూ ఉండరు. కానీ.. జపాన్ లో పరిస్థితి మరోలా ఉంది. అక్కడ భూగర్భ మురుగు నీటి పంపుల మ్యాన్ హోల్స్ మూతలు చాలా మందిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పనిలో పరిపూర్ణత్వమన్నది జపనీయుల సంస్కృతిలోనే ఉంది. క్షేత్ర స్థాయిలో కూడా అది కనిపిస్తుంది.
అందమైన రంగుల మ్యాన్ హోల్స్ మూతలు జపాన్ లోని దాదాపు 1700 నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కనిపిస్తాయి.
ఆ చిత్రాలను చాలామంది కెమెరాల్లో బంధిస్తున్నారంటే.. అవి ఎంత బాగున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ మ్యాన్‌హోల్స్ కోసం దేశవ్యాప్తంగా 12,000 డిజైన్లు రూపొందించారు.
వాటిపై అడుగేస్తే జారకుండా ఉండేందుకు సన్నటి చీలికలు.. బొడుపులు ఉంటాయి.
వీటి తయారీ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు.
జపాన్‌లోని పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచే ఆలోచనతో ఇలా రంగులు వేసే ప్రాజెక్టును 40 ఏళ్ల కిందట ప్రారంభించారు. అది నేటింగా ఘనంగా కొనసాగుతోంది.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









