BBC EXCLUSIVE: సైనా నెహ్వాల్ ఇంటర్వ్యూ.. ‘సింధు టాప్ ప్లేయరే, కానీ ఈరోజు నాది’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి, ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నుంచి
ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. భారతదేశానికి మరొక స్వర్ణ పతకం తెచ్చిపెట్టింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆమె బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలివి.
బీబీసీ: స్వర్ణం గెలిచినందుకు అభినందనలు. మ్యాచ్ ఎలా అనిపించింది?
సైనా నెహ్వాల్: ఈ టోర్నమెంట్‌లో ప్రతి మ్యాచ్ కఠినంగానే ఉంది. నేను గత 10-12 రోజులుగా నాన్‌స్టాప్‌గా ఆడుతూనే ఉన్నాను. చాలా అలసిపోయాను. కానీ, ఈ మ్యాచ్ మరో సెట్‌కు వెళ్తుందని అనుకున్నా. అయినా పోరాడాను. వరుస సెట్లలో విజయం సాధించాను. భారతదేశం కోసం స్వర్ణ పతకం సాధించటం చాలా గొప్ప విషయం. సింధు చాలా గట్టి పోటీ ఇచ్చింది.
బీబీసీ: సింధుపై మీ ఆధిపత్యం కొనసాగుతోంది!
సైనా నెహ్వాల్: అలా ఏమీ కాదు. తను చాలా బాగా ఆడుతోంది. అందరినీ ఓడించింది. నేను ఒక్క ప్లేయర్‌ని లక్ష్యంగా చేసుకుని (పోరాటం) చేయను. సింధు ప్రపంచంలో టాప్ 3లో ఉంది. బాగా ఆడుతుంది. ఈ రోజు నాది. నేను గెలిచాను.
బీబీసీ: ఈ మ్యాచ్ మరొక సెట్ కొనసాగి ఉంటే మీకు అవకాశాలు సంక్లిష్టంగా ఉండేవేమో!
సైనా నెహ్వాల్: చాలా ఇబ్బంది అయ్యేది. నేను చాలా అలసిపోయాను. నా కాళ్లలో నొప్పి మొదలైంది. శక్తి తక్కువైపోయింది. అయినా పూర్తిస్థాయిలో ప్రయత్నించాను. దమ్ము చూపించాలనుకున్నా.. పోరాటం వదిలిపెట్టకూడదనుకున్నా. బహుశా.. అదే నాకు సానుకూలాంశం అయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ: ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోనున్నారు?
సైనా నెహ్వాల్: తెలీదు (నవ్వుతూ) బాగా నిద్రపోవాలి. చాలా రోజుల నుంచి (సరిపడినంతగా) నిద్రపోలేదు. టీమ్ ఈవెంట్లలో చాలా ఒత్తిడి అనిపించింది. అయితే, అది జట్టుకు సంబంధించినది. వ్యక్తిగత ఈవెంట్లలో అయితే నా ఒత్తిడి అంతా నేనే భరించాలి. ఇప్పుడు విశ్రాంతి లభిస్తుంది. ఒక రోజంతా రెస్ట్ తీసుకుంటాను.
బీబీసీ: మీ నాన్నగారు స్టేడియంలోనే ఉండి మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. మ్యాచ్ జరిగేప్పుడు ఆయన కళ్లలోకి చూస్తున్నారా?
సైనా నెహ్వాల్: నేను నాన్నవైపు చూడను. ఎందుకంటే ఆయన ఎలా స్పందిస్తున్నారోనని నాకు టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది. అయితే, నేను స్వర్ణ పతకం సాధించిన మ్యాచ్‌ను ఆయన చూశారు. ఎంజాయ్ చేసి ఉంటారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- పరాజయం చేసే మేలేంటో మీకు తెలుసా!
- మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
- కామన్‌వెల్త్ గేమ్స్ వలసవాద అవశేషమేనా?
- 'టోమహాక్' క్షిపణులు: సిరియాపై దాడికి అమెరికా వాడింది వీటినే
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




