‘మా ఊరిలో పిల్లల్ని కనకూడదు, ఎవరైనా చనిపోతే పూడ్చకూడదు’

అక్కడ పిల్లలను కనడానికి పొరుగు గ్రామాలకు వెళతారు. నెలలు నిండే వరకు తమ గ్రామాల్లోనే నివసించే గర్భిణులు, ప్రసవ సమయానికి నడుచుకుంటూ పక్క ఊళ్లకు వెళ్లాల్సిందే! ఈ ఊళ్లో నివసిస్తున్నవారెవరూ ఇక్కడ పుట్టినవారు కాదు.
ఈ ఆచారం ఘనాలోని మాఫి దోవ్ గ్రామంలో ఉంది. అక్కడ మూఢాచారాలు శిశుజననాలను శాసిస్తున్నాయి. ఒక్క ప్రసవాల విషయంలోనే కాదు.. ఆ ఊళ్లో మరికొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి.
అక్కడ ఎవరూ జంతువులను పెంచుకోకూడదు. ఎవరైనా చనిపోతే ఆ గ్రామంలో పూడ్చకూడదు! పిల్లల్ని కనడాన్ని అపరాధం, దైవద్రోహంగా పరిగణిస్తారు.
‘‘మా పూర్వీకులు ఇక్కడకు వచ్చినపుడు, స్వర్గం నుంచి ఓ అశరీరవాణి.. 'ఇది పవిత్ర క్షేత్రం. మీరిక్కడ ఉండాలంటే కొన్ని నియమాలున్నాయి' అని చెప్పింది. ఇక్కడ ఎవరూ.. పిల్లలను కనకూడదు, ఎవరూ జంతువులను పెంచుకోరాదు. చనిపోయాక ఎవరినీ ఖననం చేయకూడదు’’ అని గ్రామ పెద్ద క్వామ్ త్సిదిత్సే అన్నారు.
కాన్పు సమయంలో తమ బాధలు వర్ణనాతీతమని గ్రామ మహిళలు చెబుతున్నారు.
‘‘పురుడు పోసుకోవడానికి చాలాదూరం నడవాల్సి వస్తుంది. నా మొదటి కాన్పుకు చాలా బాధ పడ్డాను. పక్క ఊరిలో ప్రసవించడానికి ఒక కారు కోసం చాలా ఇబ్బందులు పడ్డాను. రెండో బిడ్డను కూడా వేరే ఊరిలో కన్నాను. మేం పిల్లలను మా ఊళ్లో కనాలంటే ఈ ఆచారానికి స్వస్తి పలకాల్సిందే..’’ అని ఓ మహిళ అన్నారు.
ఈ ప్రాంతంలోని ఇతర గ్రామాల్లో ఈ ఆచారాన్ని పాటించడంలేదు. కానీ, ఈ ఆచారాన్ని వదులుకోవడానికి మాఫి దోవ్ గ్రామ పెద్దలు సుముఖంగా లేరు.
ఇవి కూడా చదవండి
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు... అతి చౌక నగరాలు
- సైక్లోన్ ఇదాయ్: ఆఫ్రికాలో పెను విపత్తు... వరద కోరల్లో వేలాది మంది విలవిల
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో... ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- మసూద్ అజర్: ‘పాకిస్తాన్లోని టెర్రరిస్టులకు చైనా ఎందుకు అండగా ఉంటోంది?’
- జేఎన్యూలో అదృశ్యమైన విద్యార్థి ఐఎస్ఐఎస్లో చేరాడా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











