జేఎన్‌యూలో అదృశ్యమైన విద్యార్థి ఐఎస్ఐఎస్‌లో చేరాడా? :Fact Check

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
    • హోదా, బీబీసీ న్యూస్

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నజీబ్ అహ్మద్ ఇస్లామిక్ స్టేట్ జిహాదీ గ్రూపులో చేరాడంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది.

ఇతడ్ని గుర్తుపట్టారా? ఇతను జేఎన్‌యూకు చెందిన నజీబ్. అతను ఐసిస్‌లో చేరాడు. అతను రాహుల్ గాంధీకి, అరవింద్ కేజ్రీవాల్‌కు సిరియా నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాడు అంటూ ఆ ఫొటో కింద వ్యాఖ్య రాసి ఉంది.

ఆయుధాలు ధరించి నిలబడిన కొంత మంది మధ్యలో ఓ వ్యక్తి కూర్చొని ఉన్నట్లుగా ఉన్న ఆ ఫొటోలో మధ్యలోని వ్యక్తే నజీబ్ అని ఈ సోషల్ పోస్టుల్లో చెబుతున్నారు.

"మై భీ చౌకీదార్ (నేను కూడా కాపలాదారుడినే)" అంటూ ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రచారంపై నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నఫీస్ చేసిన ఓ ట్వీట్ తర్వాత ఈ ఫొటో సోషల్ మీడియాలో కనిపించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"మీరు కూడా కాపలాదారుడే అయితే నా కుమారుడు నజీబ్ ఎక్కడున్నాడో చెప్పండి. దారుణాలకు పాల్పడుతున్న ఏబీవీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదు? మా అబ్బాయి ఎక్కడున్నాడో కనిపెట్టడంలో అత్యున్నత విచారణ సంస్థలు మూడూ కూడా ఎందుకు విఫలమయ్యాయి? #WhereIsNajeeb" అని ఆమె ట్వీట్ చేశారు.

జేఎన్‌యూలో మొదటి సంవత్సరం చదువుతున్న నజీబ్ అహ్మద్.. నవంబర్ 2016లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ఏబీవీపీ - బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం) సభ్యులతో ఘర్షణ అనంతరం కనబడకుండా పోయాడు.

ఈ కేసును సీబీఐకి అప్పగించగా వారు నజీబ్ జాడ కనుక్కోవడంలో విఫలమయ్యారు. దీంతో అక్టోబర్ 2018లో ఈ కేసును మూసేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అయితే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2018లో కూడా బీజేపీ మద్దతుదారులు చాలామంది ఈ చిత్రాన్ని షేర్ చేశారు.

అప్పటి నుంచి ఈ ఫొటో సోషల్ మీడియాలో వేలసార్లు షేర్ అయింది.

ఈ ఫొటో వాస్తవమో కాదో నిర్థరించాలంటూ బీబీసీ పాఠకులు ఈ చిత్రాన్ని ఫ్యాక్ట్ చెక్ బృందానికి వాట్సాప్‌లో పంపించారు.

ఈ ఫొటోకు, నజీబ్‌కు ఎలాంటి సంబంధం లేదని మా పరిశోధనలో తేలింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో

ఫొటో సోర్స్, Prashant Chahal

జేఎన్‌యూ క్యాంపస్ నుంచి 2016 అక్టోబరు 14న నజీబ్ కనిపించకుండా పోయాడు. కానీ ఈ చిత్రాన్ని 2015 మార్చి, 7 న అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ థాంప్సన్ రాయిటర్స్‌కు చెందిన థాయర్ అల్ సుడానీ తీశారు. (ఆధారం: http://cms.trust.org/item/20150308143923-oy9xy/)

రాయిటర్స్ వెబ్‌సైట్‌లో ఉన్న ఈ ఫొటోకు ఉన్న క్యాప్షన్ ఇది... "ఇరాక్‌లోని తల్ సైబా పట్టణంలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్లు సాధారణంగా ఉపయోగించే నల్ల జెండా పెయింట్ వేసి ఉన్న ఓ గోడ దగ్గర నిలబడి ఉన్న షియా ముస్లిం ఫైటర్లు - 2015 మార్చి, 7."

రాయిటర్స్ వివరాల ప్రకారం.. ఈ ఫొటో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లకు సంబంధించినది కాదు. వారంతా ఇరాకీ సాయుధ దళాలకు చెందిన షియా మిలీషియా సభ్యులు.

తిక్రిత్ నగరాన్ని ఐఎస్ఐఎస్ చెర నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని 2015 ఏప్రిల్ 2 న ఇరాకీ దళాలు అధికారికంగా వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)