క్రిస్ గేల్: ప్రపంచకప్ తరువాత రిటైర్మెంట్

ఫొటో సోర్స్, Getty Images
వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ వచ్చే ప్రపంచ కప్ తరువాత వన్డేల నుంచి రిటైర్ కానున్నారు.
ఎడమచేతి వాటం ఆటగాడైన 39 ఏళ్ల గేల్ తన వన్డే కెరీర్‌లో 9,727 పరుగులు చేసి ఆ దేశం తరఫున బ్రియాన్ లారా తరువాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
1999లో వన్డే క్రికెట్‌లో ప్రవేశించిన గేల్ ఇప్పటివరకు 284 మ్యాచ్‌లు ఆడి ఈ పరుగులు చేశాడు.10 వేల పరుగుల మైలురాయికి సమీపంలో ఉన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'ఇక వన్డేల్లో ఆడడానికి ముగింపు పలకాలనుకుంటున్నాను. నేను ఇక మైదానంలో వెనుక వరుసల్లో పార్టీ స్టాండ్‌లో కూర్చుంటాను. కొత్త కుర్రాళ్లు ఆటను అనుభవించనీ' అని గేల్ వ్యాఖ్యానించారు.
గేల్ రిటైర్మెంట్ ప్రకటనను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ట్విటర్ వేదికగా ధ్రువీకరించింది.

ఫొటో సోర్స్, facebook/ChrisGayle
ఈ ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లండ్, వేల్స్‌లో ప్రపంచ కప్ నిర్వహించనున్నారు.
ప్రపంచకప్‌ను గెలుచుకుని కెరీర్ ముగించాలనుకుంటున్నారా అని మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. 'కచ్చితంగా.. మా జట్టులోని కుర్రాళ్లు నాకు ఆ విషయంలో హామీ ఇచ్చారు' అని చెప్పాడు గేల్.
'నా కోసం వారు ప్రపంచ కప్ గెలవాలి. నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇది నాకు చాలా కీలకమైన ఏడాది. 2019 నా కోసం గుర్తుండిపోయే విజయం అందించి ముగుస్తందనుకుంటున్నాను' అన్నాడు.
కాగా, బార్బడోస్‌లో బుధవారం(20.02.2019) నుంచి ఇంగ్లండ్‌తో జరగబోయే 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ గేల్ ఆడనున్నాడు.

ఫొటో సోర్స్, Instagram/ChrisGayle333
ఆ ఆరుగురిలో ఒకడు..
గేల్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 23 సెంచరీలు సాధించాడు. 2015లో జింబాబ్వేపై ఆయన సాధించిన 215 పరుగులు వన్డే క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ప్రపంచ క్రికెట్‌లో వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఆరుగురిలో గేల్ కూడా ఒకడు.
ఇక పార్ట్ టైం ఆఫ్‌స్పిన్నర్‌గా వన్డేల్లో 165 వికెట్లు కూడా గేల్ ఖాతాలో ఉన్నాయి.
2004లో ఇంగ్లండ్‌లో చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న వెస్టిండీస్ జట్టులో గేల్ ఉన్నాడు.

ఫొటో సోర్స్, Instagram/ChrisGayle333
టీ20ల రారాజు
గేల్ తన కెరీర్‌లో 103 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 7వేలకు పైగా పరుగులు చేశాడు.
ఇటీవల కాలంలో ఎక్కువగా పరిమిత ఓవర్ల మ్యాచ్‌లపైనే దృష్టిపెట్టిన ఆయన అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లోనూ ట్వంటీ20లు ఆడుతున్నాడు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా ట్వంటీ20ల్లో కొనసాగుతానని చెప్పిన గేల్.. 2020లో ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ నిర్వహించబోయే 100 బంతుల క్రికెట్ పోటీలోనూ ఆడుతానని ప్రకటించాడు.
ఇంగ్లండ్ ఈ పోటీకి తనను ఆహ్వానిస్తుందని అనుకుంటున్నానని.. ఆ మ్యాచ్‌లో చితక్కొట్టేసి.. మళ్లీ తనలోని యువ క్రికెటర్‌ని బయటకు తెచ్చినందుకు థ్యాంక్స్ చెబుతానని గేల్ అంటున్నాడు.
ట్వంటీ20 క్రికెట్‌లో గేల్ రికార్డుల రారాజుగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- పాకిస్తాన్లో సౌదీ ప్రిన్స్ పర్యటన: నిధుల కోసం ఘన స్వాగతం
- పుల్వామా దాడి: సీఆర్పీఎఫ్ జవాన్లకు భారత ప్రజల అశ్రు నివాళి
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
- పుల్వామా దాడి: ‘అదే జరిగితే యుద్ధం రావొచ్చు’ - అభిప్రాయం
- పుల్వామా దాడి: ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నవ్వుతున్న ప్రియాంకా గాంధీ, నిజమేంటి?
- కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి భద్రతా వైఫల్యాలే కారణమా?
- కశ్మీర్ దాడి: పుల్వామా మారణహోమం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








