కశ్మీర్: కాలు లేకపోయినా క్రికెట్‌లో సూపర్‌స్టార్
- రచయిత, రియాజ్ మస్రూర్
- హోదా, బీబీసీ కోసం
కశ్మీర్ కుర్రాడు ఆమిర్ హుసేన్‌కు ఒక కాలు లేదు. అయినా స్థానికంగా క్రికెట్‌లో అతడో సూపర్‌స్టార్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగుల్లో అదరగొడతాడు. ఆటలో నైపుణ్యంతో పాటు కొండంత ఆత్మవిశ్వాసం అతడి సొంతం.
చిన్నప్పుడు నిప్పుల కుంపటి కాలి మీద పడటంతో ఆమిర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది.
వైద్యులు పరీక్షించి కాలు తొలగించక తప్పదని చెప్పారు. అలా కాలు కోల్పోయినా అతడిలో ఆత్మవిశ్వాసం, అందరిలా జీవించాలన్న కోరిక మాత్రం తగ్గలేదు.
చిన్నప్పుడు స్నేహితులతో పోటీపడి ఈత నేర్చుకున్నాడు. పెద్దయ్యాక చాలామంది కుర్రాళ్లలా క్రికెట్‌ను ఇష్టపడ్డాడు.

ఎలాగైనా తానూ క్రికెట్ ఆడాలన్న లక్ష్యంతో సాధన చేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఒక కాలితోనే బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాడు.
క్రమంగా ఆటలో నైపుణ్యం పెంచుకుంటూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించ సాగాడు. అలా అందరితో సమానంగా ఆటలో నైపుణ్యం ప్రదర్శిస్తూ స్థానిక క్రికెట్‌లో హుసేన్ మంచి పేరు తెచ్చుకున్నాడు.
వృత్తి రీత్యా హుసేన్ టైలర్. ఎవరిపైనా ఆధారపడకుండా జీవించడమే తనకు ఇష్టమంటాడు హుసేన్.
‘కొందరు ఆరోగ్యంగా ఉన్నా, ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు నిరుత్సాహంగా కనిపిస్తారు. అలాంటి వాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నది నా కోరిక. నా కాలు మాత్రమే పోయింది.. ఆత్మవిశ్వాసం కాదు’ అన్నది హుసేన్ మాట.
మా ఇతర కథనాలు
- ఆటోడ్రైవర్ కొడుకు టీ20కి ఎంపిక
- స్కేటింగ్ సునామీ: ఈ పాప వయసు 6, పతకాలు 64
- ఒక్క ఆటతో.. అబ్బాయిలకు డ్రగ్స్ దూరం, అమ్మాయిలకు స్వాతంత్ర్యం
- లైఫ్‌స్టైలే వినోద్ కాంబ్లీ ఫెయిల్యూర్‌కు కారణమా?
- రోహిట్: ఏంటా వేగం.. ఏంటా బాదుడు?
- రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ.. భారీ ఆధిక్యంతో భారత్ విజయం
- నెహ్రా నీ స్వింగ్‌ను ఎలా మరిచిపోగలం
- విరాట్ కోహ్లీ: అవును.. అనుష్కతో నా పెళ్లయ్యింది
- భారత్ జిందాబాద్ అన్న పాకిస్తానీ అరెస్టు
- రోహిత్ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











