టీ20 క్రికెట్: రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ.. భారీ ఆధిక్యంతో భారత్ విజయం

ఫొటో సోర్స్, Reuters
క్రికెట్ మైదానంలో రోహిత్ శర్మ దూకుడు కొనసాగుతోంది. శ్రీలంకతో శుక్రవారం రాత్రి ఇండోర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. టీ20 క్రికెట్‌లో భారత ఆటగాడు చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్‌తో కలసి సంయుక్తంగా రికార్డులకెక్కాడు. ఇదే ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ కూడా 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొత్తం 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్స్‌లు, 12 ఫోర్లు ఉన్నాయి. భారత ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లోనే రోహిత్ తన శతకాన్ని పూర్తి చేయటం గమనార్హం.
అనంతరం డబుల్ సెంచరీ దిశగా దూసుకెళుతున్నట్లు కనిపించిన రోహిత్ శర్మ వరుసగా.. సిక్స్, ఫోర్, సిక్స్ కొట్టి తర్వాత ఔటై పెవిలియన్ చేరాడు.

ఫొటో సోర్స్, AFP
రోహిత్ శర్మకు తోడు ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన కేఎల్ రాహుల్ సైతం వేగంగా ఆడాడు. 49 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.
వీరిద్దరి బ్యాటింగ్ ప్రతిభతో భారత జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 260 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
261 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 17.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 88 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను గెలిచిన భారత జట్టు మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. చివరి టీ20 ఆదివారం ముంబైలో జరుగనుంది.
మా ఇతర కథనాలు:
- ఛాంపియన్: తుమ్మితే విరిగిపోయే ఎముకలు.. ఈతలో 23 స్వర్ణాలు
- మహిళల క్రికెట్: డబుల్ సెంచరీ సాధించిన ఎలిస్ పేరీ ఎవరు?
- వాళ్లూ కోచ్‌లుగా మారాలి: కిదాంబి శ్రీకాంత్
- నెహ్రా నీ స్వింగ్‌ను ఎలా మరిచిపోగలం
- మిస్ వరల్డ్ పోటీల్లో అడిగే ప్రశ్నలివే..
- అవును.. అనుష్కతో నా పెళ్లయ్యింది
- మీ ద్వేషమే మీకు రక్ష!!
- అనుష్క, విరాట్ల పెళ్లి జరిగింది ఇటలీలోని ఈ గ్రామంలోనే!
- రోహిత్ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
- ధోని: ‘నా దారి... గాంధీ దారి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








