పుల్వామా దాడి: ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నవ్వుతున్న ప్రియాంకా గాంధీ, నిజమేంటి? Fact Check

ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
    • హోదా, బీబీసీ న్యూస్

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాకు సంబంధించిన ఒక స్లో మోషన్ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

దానితోపాటు పుల్వామా దాడి తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నవ్వుతున్న ప్రియాంకా గాంధీ అని పెడుతున్నారు.

ఇలాంటి అంశాలపై ప్రియాంకా గాంధీ సీరియస్‌నెస్‌తో వ్యవహరించలేదని ఈ వీడియో షేర్ చేస్తున్న వారు అంటున్నారు.

మా పరిశోధనలో ఉత్తర ప్రదేశ్ లక్నోలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోనే కాస్త స్లో మోషన్ చేశారని, దానిని పూర్తిగా తప్పుగా చెబుతూ షేర్ చేస్తున్నారని తెలిసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కాంగ్రెస్ పార్టీ ముందే ఏర్పాటు చేయాలని భావించిన ప్రియాంకా గాంధీ మొట్ట మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను పూర్తిగా చూస్తే సోషల్ మీడియాలో వాదనలు తప్పు అని తెలుస్తోంది.

ట్విటర్‌లో @iAnkurSingh పేరుతో ఒక యూజర్ కూడా ఇలాగే ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేశారు.

సోషల్ మీడియా క్లిప్

ఫొటో సోర్స్, SM Viral Video Grab

సోషల్ మీడియా క్లిప్

ఫొటో సోర్స్, What's App Grab

ఆయన చేసిన ఈ ట్వీట్‌ను వాట్సాప్‌లో షేర్ చేస్తున్నారు. ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోను సుమారు 50 వేల మంది చూశారు కూడా.

గురువారం జమ్ము-కశ్మీర్‌ పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మిలిటెంట్ దాడి వార్త వచ్చిన సుమారు నాలుగు గంటల తర్వాత ప్రియాంకా గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఒక సందేశంతో ప్రారంభించారు.

"మీ అందరికీ తెలుసు. రాజకీయ చర్చ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కానీ పుల్వామాలో జరిగిన మిలిటెంట్ దాడిలో మన జవాన్లు అమరులయ్యారు. అందుకే మేం ఇప్పుడు రాజకీయ చర్చ జరపడం భావ్యం కాదని భావిస్తున్నాం" అన్నారు.

ప్రియాంకా గాంధీ ఆ తర్వాత "మేమంతా చాలా దుఃఖంలో ఉన్నాం. అమరుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలి. మనం భుజం భుజం కలిపి వారికి అండగా నిలవాలి" అన్నారు.

ఆ తర్వాత పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా, రాజ్ బబ్బర్‌తో కలిసి ప్రియాంకా గాంధీ కొంత సేపు మౌనం పాటించారు. నాలుగు నిమిషాల్లోనే ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిన ప్రాంతం నుంచి వెళ్లిపోయారు.

పుల్వామా దాడిలో జవాన్లు మృతి చెందడంతో ప్రియాంకా గాంధీ తన ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు చేశారని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి.

కానీ పుల్వామా దాడితో దేశమంతటా విషాదంగా నెలకొన్నప్పుడు కొంతమంది సోషల్ మీడియా యూజర్లు మాత్రం దానిలో కూడా రాజకీయం వెతికారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)