విరాట్ కోహ్లీ: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన అవార్డుల్లో మూడు ఇతనికే

ఫొటో సోర్స్, Getty Images
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 2018 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఈ మేరకు ఐసీసీ ప్రకటించింది.
ఓ ఏడాది ఇలా మూడు అవార్డులనూ గెలుచుకున్న మొదటి క్రికెటర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు.
30 ఏళ్ల కోహ్లీ 2018లో 13 టెస్టుల్లో 1,322 పరుగులు చేశాడు. అతని యావరేజ్ 55.08. ఇందులో 5 సెంచరీలున్నాయి.
ఇక వన్డేల విషయానికి వస్తే 14 వన్డేల్లో 1,202 పరుగులు చేశాడు. వీటిలో ఆరు సెంచరీలున్నాయి. సగటు 133.55.
ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. ఈ రికార్డును అందుకోవడం అమేజింగ్‌గా ఉందని చెప్పాడు.
టెస్ట్ జట్ల ర్యాకింగ్‌లో భారత్ మొదటి స్థానంలో ఉంది.
మరోవైపు టెస్ట్ ఇంటర్నేషనల్ టీమ్‌లో రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. బుమ్రా అంతర్జాతీయ టెస్ట్, వన్డే టీంలలో చోటు సంపాదించగా.. రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ వన్డే జట్టులో చోటు సంపాదించారు.
2018 ఇంటర్నేషనల్ టెస్ట్ టీం
టామ్ లాథమ్ (న్యూ జిలాండ్)
దిముత్ కరుణరత్నే (శ్రీలంక)
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)
విరాట్ కోహ్లీ (కెప్టెన్)
హెన్రీ నికోల్స్ (న్యూజిలాండ్)
రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్)
కగిసో రబడ (దక్షిణాఫ్రికా)
నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా)
జస్ప్రీత్ బుమ్రా
మహమ్మద్ అబ్బాస్ (పాకిస్తాన్)
2018 ఇంటర్నేషనల్ వన్డే టీం
రోహిత్ శర్మ
జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్)
విరాట్ కోహ్లీ (కెప్టెన్)
జో రూట్ (ఇంగ్లండ్)
రోస్ టేలర్ (న్యూజిలాండ్)
జోస్ బట్లర్ (ఇంగ్లండ్, వికెట్ కీపర్)
బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)
ముస్తాఫిజర్ రహ్మాన్ (బంగ్లాదేశ్)
రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్)
కుల్దీప్ యాదవ్
జస్ప్రీత్ బుమ్రా
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









