#FIFA2018: 20 ఏళ్ల తర్వాత కప్పుగొట్టిన ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Getty Images
రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2018ని ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో 4-2 గోల్స్ తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది.
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను గెల్చుకోవటం ఫ్రాన్స్‌కు ఇది రెండోసారి. 20 ఏళ్ల కిందట సొంతగడ్డపై 1998లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ను ఫ్రాన్స్ గెలిచింది.
ఆధునిక ఫుట్‌బాల్ చరిత్రలో అద్భుతమైన ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఒకటిగా భావిస్తున్న ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్, క్రొయేషియాలు హోరాహోరీగా తలపడ్డాయి. 1966 తర్వాత అత్యధిక గోల్స్ తేడా ఉన్న ఫైనల్ ఇదే.
మ్యాచ్ మొదలైన 19 నిమిషాల సమయంలో ఫ్రాన్స్‌కు తొలిగోల్ లభించింది. ఫ్రాన్స్ ఆటగాడు ఆంటోనీ గ్రిజ్‌మన్ కొట్టిన బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లకుండా క్రొయేషియా ఆటగాడు మారియో మన్‌డ్జుకిక్ తల అడ్డుపెట్టాడు. కానీ, ఆ బంతి గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది.
దీంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్ చేసిన తొలి ఆటగాడిగా మారియో మండ్జుకిక్ వార్తల్లోకి ఎక్కాడు.
ఆ తర్వాత మరో 10 నిమిషాలకు క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెర్సిసిక్ కోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. 16 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపిన ఇవాన్‌కు ఈ టోర్నమెంట్‌లో ఇది మూడో గోల్.

ఫొటో సోర్స్, Reuters
మలుపుతిప్పిన వివాదాస్పద వీడియో అసిస్టెంట్ రిఫరీ
మ్యాచ్ 38 నిమిషాల సమయంలో ఆంటోనీ గ్రిజ్‌మన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచటంతో ఫ్రాన్స్ పైచేయి సాధించింది. క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెర్సిసిక్ చేతికి బంతి తాకిందా? లేదా? అన్న సందిగ్ధంలో మ్యాచ్ రిఫరీ వీడియోను పరిశీలించి (వీడియో అసిస్టెంట్ రిఫరీ - వీఏఆర్) ఫ్రాన్స్‌కు పెనాల్టీ కార్నర్ ఇచ్చాడు. ఈ వివాదాస్పద వీఏఆర్ మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
రెండో అర్థభాగంలోనూ మొదటి గోల్ ఫ్రాన్స్‌దే అయ్యింది. 59వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పొగ్బ గోల్ కొట్టి తమ జట్టు ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు. కెలియన్ ఎంబప బంతిపై పట్టు సాధించి గోల్‌పోస్ట్ వరకూ తీసుకొచ్చి, ఆంటోనీ గ్రిజ్‌మన్‌కు అందించాడు. గ్రిజ్‌మన్ దాన్ని పొగ్బవైపు పంపగా.. పొగ్బ దాన్ని అద్భుతమైన గోల్‌గా మలిచాడు.
మ్యాచ్ 65వ నిమిషంలో కెలియన్ ఎంబపె మరో గోల్ కొట్టడంతో ఫ్రాన్స్ ఆధిక్యం 4-1కి పెరిగింది.
అయితే మరో నాలుగు నిమిషాల్లోనే మారియో మండ్జుకిక్ తన గోల్‌తో క్రొయేషియా జట్టుకు ఊరట కల్పించాడు. దీంతో ఫ్రాన్స్ ఆధిక్యం 4-2కు తగ్గింది.
కానీ, ఆ తర్వాత క్రొయేషియా పుంజుకోలేకపోయింది. దీంతో మ్యాచ్‌ను, ప్రపంచకప్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది.
ఫ్రాన్స్, క్రొయేషియా రెండూ.. సెమీ ఫైనల్స్‌లో ఆడిన ఆటగాళ్లతోనే ఫైనల్ బరిలోకి దిగాయి.
ఇవి కూడా చదవండి:
- రష్యా వర్సెస్ పశ్చిమ దేశాలు.. ‘ఇది నూతన ప్రచ్ఛన్న యుద్ధం’
- #FIFA2018: రష్యాలో ఫుట్‌బాల్ అభిమానులకూ గూగుల్ ట్రాన్స్లేట్కి ఏంటీ సంబంధం?
- ఫుట్‌బాల్: మెస్సీని కలుసుకొనేందుకు రష్యాకు కేరళ యువకుడి సైకిల్ యాత్ర
- రొనాల్డో, మెస్సీ, నెయ్మరే కాదు.. వీరూ సాకర్ హీరోలే..
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
- #FIFA2018: క్రికెట్లో ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ ఫుట్‌బాల్‌లో ఎందుకు వెనకబడింది?
- #FIFA2018: 12 మైదానాలు, రూ.23వేల కోట్లు
- #FIFA2018: అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీకి అసలేమైంది?
- 195 కిలోల పులిని మరో చోటికి తరలించడం ఎలాగంటే..
- చరిత్రలో అత్యుత్తమ జట్లివే, వీటిలో ఒకటి కప్పు కొట్టలేదు
- వ్యోమగాములను సురక్షితంగా కిందకు తెచ్చే శక్తి భారత్ సొంతం
- ఇథియోపియా - ఎరిత్రియాల మధ్య ముగిసిన యుద్ధం.. ఇరవయ్యేళ్ల వివాదానికి తెర
- హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎలా పొందుతున్నారు? ఎందుకు పొందుతున్నారు?
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు
- ఒకే రోజు ఇద్దరి కలలు భగ్నం: ప్రపంచ కప్‌లో మళ్లీ మెస్సీ.. రొనాల్డో ఆట చూడగలమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








