జార్జ్ సోరోస్‌: మోదీ ప్రజాస్వామ్యవాది కాదన్నఈ బిలియనీర్ ఎవరు... ఆయన కామెంట్స్‌పై రియాక్షన్ ఏంటి?

మోదీని విమర్శించిన బిలియనీర్ సోరోస్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

శుక్రవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జార్జ్ సోరోస్ ప్రకటన భారత ప్రజాస్వామ్య ప్రక్రియను నాశనం చేసేలా ఉందని ఆరోపించారు.

అంతకుముందు జర్మనీలోని మ్యూనిచ్ డిఫెన్స్ కాన్ఫరెన్స్‌లో జార్జ్ సోరోస్ మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వాది కాదన్నారు.

మోదీ వేగంగా నాయకుడిగా మారడానికి భారతీయ ముస్లింలపై హింసే ప్రధాన కారణమని ఆరోపించారు. రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తుందన్నారు.

''గౌతమ్ అదానీ కేసులో మోదీ ప్రస్తుతం మౌనంగా ఉన్నారు, అయితే విదేశీ పెట్టుబడిదారుల ప్రశ్నలకు, పార్లమెంటులో సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. దీంతో ప్రభుత్వంపై వారికి ఉన్న పట్టు సన్నగిల్లుతుంది'' అని ఆరోపించారు. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుజ్జీవనానికి దారితీస్తుందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.

అంతేకాదు, 2020 జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి భారతదేశాన్ని హిందూ జాతీయవాద దేశంగా మారుస్తున్నారని సోరోస్ విమర్శలు చేశారు.

స్మృతి ఇరానీ

ఫొటో సోర్స్, ANI

ప్రతిపక్షాలు ఎలా స్పందించాయి?

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నరేంద్ర మోదీ భారతదేశాన్ని హిందూ జాతీయవాద దేశంగా మార్చడం ఆ దేశానికి అతిపెద్ద, భయంకరమైన దెబ్బ అని జార్జ్ సోరోస్ ఆ సమయంలో వ్యాఖ్యానించారు.

పౌరసత్వ చట్టం (సీఏఏ) ద్వారా లక్షలాది మంది ముస్లింల పౌరసత్వాన్ని తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆంక్షలు విధించడం ద్వారా మోదీ కశ్మీర్ ప్రజలను శిక్షిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం సోరోస్‌ వ్యాఖ్యలను ఖండించారు. విదేశాల నుంచి భారత ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాదించారు.

ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నమని, దీనికి భారతీయులందరూ తగిన సమాధానం చెప్పాలని స్మృతి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు జార్జ్ సోరోస్ ప్రకటనపై కాంగ్రెస్ కూడా స్పందించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ మీడియా విభాగం చీఫ్ జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ.. ''అదానీ కుంభకోణం భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందా లేదా అనేది పూర్తిగా కాంగ్రెస్, ప్రతిపక్షాలు, మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. దీనికి జార్జ్ సోరోస్‌తో సంబంధం లేదు. ఆయనలాంటి వ్యక్తులు మా ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరని మా నెహ్రూ వారసత్వం స్పష్టంచేస్తోంది" అని తెలిపారు.

ఇదే సమయంలో శివసేనకు చెందిన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది బీజేపీని టార్గెట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''జార్జ్ సోరోస్ ఎవరు? ఆయనపై బీజేపీ ట్రోల్ మినిస్ట్రీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోందని ఆమె ట్వీట్ చేశారు.

"మంత్రిగారూ... మీరు భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఇజ్రాయెల్ ఏజెన్సీ జోక్యంపై ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అది భారత ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు" అని కూడా ఆమె ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా కూడా మంత్రి స్మృతి ఇరానీపై విరుచుకుపడ్డారు.

ఆమె ట్విట్టర్‌లో "గౌరవనీయులైన కేబినెట్ మంత్రి జార్జ్ సోరోస్‌కు తగిన సమాధానం ఇవ్వాలని ప్రతి భారతీయుడికి పిలుపునిచ్చారు. దయచేసి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పళ్ళేల చప్పుడు చేయండి" అని ఎద్దేవాచేశారు.

మోదీని విమర్శించిన బిలియనీర్ సోరోస్

ఫొటో సోర్స్, Getty Images

జార్జ్ సోరోస్ ఎవరు?

జార్జ్ సోరోస్ ఒక అమెరికన్ బిలియనీర్. పారిశ్రామికవేత్త. బ్రిటన్‌లో ఆయనను 1992లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను నాశనం చేసిన వ్యక్తిగా విమర్శిస్తుంటారు.

ఆయన హంగేరిలోని ఒక యూదు కుటుంబంలో జన్మించారు. హిట్లర్ పాలనలో జర్మనీలో యూదులను చంపుతున్న సమయంలో వారి కుటుంబం ఏదో విధంగా బయటపడింది.

అనంతరం ఆ కమ్యూనిస్టు దేశాన్ని వదిలి పశ్చిమ దేశానికి తరలివచ్చారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన సోరోస్ దాదాపు రూ. 3.6 లక్షల కోట్లు సంపాదించారు.

ఈ డబ్బుతో ఆయన వేలాది పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడుతున్న పలు సంస్థలకు సహాయం చేశారు.

1979లో ఆయన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆ సంస్థ ఇప్పుడు దాదాపు 120 దేశాల్లో తన సేవలు అందిస్తోంది. అయితే ఆయన చర్యల కారణంగా సోరోస్ ఎప్పుడూ రైట్ వింగ్ నాయకులకు టార్గెట్‌గా మారుతారు.

సోరోస్ 2003 ఇరాక్ యుద్ధాన్ని విమర్శించారు. ఆయన డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ అమెరికాకు మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. దీని తరువాత సోరోస్‌పై అమెరికన్ రైట్ వింగ్స్ విమర్శలు తీవ్రమయ్యాయి.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత సోరోస్‌పై దాడులు కొత్తపుంతలు తొక్కాయి. అంతేకాదు ట్రంప్ కూడా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సోరోస్‌పై పలుమార్లు విమర్శలు గుప్పించారు.

మోదీని విమర్శించిన బిలియనీర్ సోరోస్

ఫొటో సోర్స్, Getty Images

సోరోస్‌ను వ్యతిరేకిస్తున్న దేశాలేంటి?

2018 అక్టోబరులో అమెరికన్ శ్వేతజాతి ఆధిపత్య వాది అయిన రాబర్ట్ బోవర్స్ ఓ ప్రార్థనా మందిరంపై కాల్పులు జరిపి 11 మంది యూదులను చంపారు.

బోవర్స్ సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనలాంటి భావజాలం ఉన్న శ్వేతజాతీయులను ఊచకోత కోసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన నమ్మేవారు.

దీని వెనుక జార్జ్ సోరోస్ ఉన్నారని ఆయన భావించారు.

అమెరికాలో మాత్రమే కాదు, జార్జ్ సోరోస్‌కు వ్యతిరేకంగా ఆర్మేనియా, ఆస్ట్రేలియా, రష్యా, ఫిలిప్పీన్స్‌లో కూడా ప్రచారాలు నిర్వహించారు.

మరోవైపు తుర్కియేని విభజించి నాశనం చేయాలనుకునే యూదుల కుట్రలో సోరోస్ కేంద్రంగా ఉన్నారని తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ అర్డోన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

శరణార్థులు ఐరోపా అంతటా వ్యాపించేలా సోరోస్ ప్రోత్సహిస్తున్నారని బ్రిటన్ బ్రెగ్జిట్ పార్టీకి చెందిన నిగెల్ ఫరేజ ఆరోపించారు.

సోరోస్ మొత్తం పాశ్చాత్య ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా నిగెల్ పరిగణించారు. సోరోస్ జన్మస్థలమైన హంగేరీ ప్రభుత్వం కూడా ఆయనను తన శత్రువుగా భావిస్తోంది.

2018 ఎన్నికల ప్రచారంలో హంగేరియన్ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ సోరోస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

ఓర్బన్ ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం సోరోస్ మద్దతు ఉన్న సంస్థలపై ప్రభుత్వ దాడులు పెరిగాయి. దీంతో సోరోస్ సంస్థ హంగేరిలో తన సేవలు నిలిపివేసింది.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)