అదానీ వివాదం, బీబీసీ డాక్యుమెంటరీ, 2024 ఎన్నికలపై అమిత్ షా ఏమన్నారు?

ఫొటో సోర్స్, SOPA IMAGES
అదానీ గ్రూపు కంపెనీల కేసులో బీజేపీ దాచడానికి ఏమీ లేదని, ఏ విషయానికి తాము భయపడటం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిందని, తాను కేబినెట్ మెంబర్ అయినందున ఈ కేసుపై తాను మాట్లాడేందుకు ఎలాంటి హక్కు లేదని ఆయన చెప్పారు.
అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ జనవరిలో విడుదల చేసిన తన నివేదికలో అదానీ గ్రూప్ కార్యకలాపాలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సీరియస్ ప్రశ్నలను లేవనెత్తింది. మరోవైపు హిండెన్‌బర్గ్ రిపోర్టును అదానీ గ్రూప్ ఖండిస్తోంది.
అదానీ కేసు గత కొన్ని రోజులుగా దేశీయ వార్తల్లో ప్రధానాంశంగా నిలుస్తోంది.
హిండెన్‌బర్గ్ రిపోర్టు వచ్చిన తర్వాత, అదానీ గ్రూప్ షేర్లు భారీగా కుప్పకూలాయి. ఈ గ్రూప్ కంపెనీల షేర్లలో డబ్బులు పెట్టిన వారు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.
హిండెన్‌బర్గ్ రిపోర్టు రాక ముందు ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ వెలుగొందారు. అంతేకాక, ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
కానీ, గ్రూప్ కంపెనీలకు తీవ్ర నష్టాలు రావడంతో, ఈ జాబితాలో గౌతమ్ అదానీ స్థానం కిందకి పడిపోయింది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
అదానీ కేసుపై విపక్షాల ఆందోళనలు
అదానీ కేసు విషయంపై పార్లమెంట్‌లో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరిగిన సమయంలో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై కనీసం స్పందించలేదు.
మరోవైపు ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని పలు ప్రశ్నలు వేశారు. రాజ్యసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించే సమయంలో, అదానీతో ఉన్న సంబంధాన్ని తెలియజేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి విపక్ష పార్టీలు.
లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగంలో కొన్ని మాటలను తొలగించిన తర్వాత అమిత్ షా దీనిపై స్పష్టత ఇచ్చారు.
''పార్లమెంటులో నిబంధనలకు అనుగుణంగా చర్చలు జరగాలి. పార్లమెంటరీ భాషలోనే ఇవి జరగాలి'' అమిత్ షా అన్నారు.
అదానీ, అంబానీ పేర్లను ప్రస్తావించినందుకు, తన ప్రసంగంలో కొన్ని భాగాలను తొలగించారని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దీనిపై లోక్‌సభ స్పీకర్‌కి రాతపూర్వకంగా లేఖ రాసినట్టు రాహుల్ గాంధీ తెలిపారు. కానీ, దీనిపై చర్యలు తీసుకుంటారనే ఆశ లేదన్నారు.
లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగించినపుడు, అదానీ, అంబానీకి సంబంధించి ప్రధాని మోదీని పలు ప్రశ్నలు వేశారు. కానీ, ప్రధాని మోదీ తన ప్రసంగంలో వీటి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా లోక్‌సభ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు.
2024 ఎన్నికల్లో తమకు ఎలాంటి పోటీ ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ ఏకపక్షంగా విజయం సాధిస్తారని చెప్పారు. దేశ ప్రజలే దీన్ని నిర్ణయిస్తారన్నారు. ఇప్పటి వరకైతే, లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమంటూ ఏ పార్టీని కూడా ప్రజలు పరిగణించలేదన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
జీ-20 అధ్యక్షత భారత్‌కు దక్కడంపై కూడా తన అభిప్రాయాన్ని అమిత్ షా ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఉత్పత్తి బాగా ఉన్నపుడు దాన్ని సంతోషంగా తప్పనిసరిగా మార్కెట్ చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇది భారత దేశం మొత్తానికి గర్వకారణమని చెప్పారు. ప్రధాని మోదీ కాలంలో జీ-20 అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు దక్కిందని, దాన్ని విజయవంతంగా నిర్వహిస్తే.. ఆ తర్వాత కీర్తి ప్రధాని మోదీకి దక్కాలన్నారు. ‘‘ఎందుకు లభించకూడదు?’’ అని అమిత్ షా ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, PFI
పీఎఫ్ఐ సంస్థపై నిషేధం
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థను బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా నిషేధించిందని అమిత్ షా చెప్పారు.
పీఎఫ్ఐ కేడర్‌పై చాలా కేసులున్నాయని, వారిని అంతమొందించే పనిని కాంగ్రెస్ చేపట్టిందని, కానీ కోర్టు దీన్ని ఆపేసిందన్నారు. అయితే, తాము విజయవంతంగా పీఎఫ్ఐను నిషేధించినట్టు చెప్పారు. దేశంలో మతోన్మాదాన్ని, మూర్ఖత్వాన్ని పెంచే సంస్థ పీఎఫ్ఐ అన్నారు. ఉగ్రవాదాన్ని తయారు చేసే పనిని వారు చేపట్టినట్లు తెలిపారు.
గత ఏడాదినే ఐదేళ్ల పాటు పీఎఫ్ఐను నిషేధిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్, నిషేధిత సంస్థ సిమీతో పీఎఫ్ఐకి సంబంధాలున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశ అంతర్గత భద్రతకు పీఎఫ్ఐ పెను ప్రమాదంగా మారిందని కూడా పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీపై కూడా అమిత్ షా స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘హిండెన్‌బర్గ్ రిపోర్టు, బీబీసీ డాక్యుమెంటరీ బయటికి వచ్చాయి కదా, వీటిలో ఏదైనా కుట్ర ఉందని భావిస్తున్నారా?’ అని అమిత్ షాను ప్రశ్నించారు.
''వెయ్యి కుట్రలు చేసినా నిజం బయటికి వస్తుంది. ఏమీ జరగదు. సూర్యుని మాదిరి ఎప్పుడూ ఆయన ప్రకాశిస్తూనే ఉంటారు. 2002 నుంచి మోదీకి వెనుకాల వీరు ఇవి చేస్తున్నారు. ప్రతి సారి మోదీ వీటి నుంచి బయటపడుతూ మరింత బలంగా, నిజమైన వ్యక్తిగా, ప్రజల్లో మరింత పాపులారిటీని సంపాదించుకుంటున్నారు'' అని అమిత్ షా అన్నారు.
ఇటీవలే మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చారు. గత కొన్నేళ్లుగా బీజేపీ నేతలు మొఘల్ పాలకుల గురించి పలు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.
నగరాల పేరులు మార్పు, దేశానికి మొగలు పాలకుల అందించిన సహకారం తొలగింపుపై కూడా అమిత్ షా స్పందించారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
పేరు మార్పుపై అమిత్ షా స్పందన
''దేశానికి మొఘలులు చేసిన మేలును తొలగించడం లేదు. మేము తొలగించాలనుకోవడం లేదు. కానీ, ఎవరైనా ఈ దేశ సంప్రదాయాన్ని నెలకొల్పాలనుకుంటే, మేము ఎలాంటి అభ్యంతరం చెప్పం'' అన్నారు.
''ఇంతకుముందు పాత పేరు లేని ఏ నగరం పేరును మేం మార్చలేదు. ఎంతో ఆలోచించిన తర్వాతనే మేము వీటిపై నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ప్రభుత్వానికి ఈ చట్టబద్ధమైన హక్కు ఉంటుంది'' అని తెలిపారు.
బిహార్, జార్ఖండ్‌లలో నక్సలిజం చాలా వరకు ముగిసిపోయిందని అమిత్ షా తన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
చత్తీస్‌గఢ్‌లో కూడా తాము శాంతిని నెలకొల్పగలుగుతామని తెలిపారు. జమ్మూ, కశ్మీర్‌లో కూడా ఉగ్రవాదానికి సంబంధించిన గణాంకాలు కూడా కాస్త మెరుగైన స్థితిలో ఉన్నాయన్నారు.
ఈశాన్య రాష్ట్రాలలో మోదీ ప్రభుత్వం తీసుకునే విధానాలను కూడా అమిత్ షా ప్రస్తావించారు. ఈశాన్య భారతానికి, ఇతర భారతానికి మధ్యనున్న అంతరాయానికి ప్రధాని మోదీ ముగింపు పలికారని చెప్పారు.
ఇతర ప్రాంతాల ప్రజల మాదిరి తమకు గౌరవం దక్కుతుందని ప్రస్తుతం ఈశాన్య భారత ప్రజలు భావిస్తున్నారని అమిత్ షా చెప్పారు.
అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఈశాన్య భారతానికి వెళ్లే ప్రజలకు కూడా అంతే గౌరవం దక్కుతుందన్నారు.

ఇవి కూడా చదవండి:
- మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం ఉందా? లేదా? సుప్రీంకోర్టులో కేసు ఏమిటి?
- బీబీసీపై ఐటీ దాడుల విషయంలో జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు ఏం చెప్పాయి?
- బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు
- బెలూన్లు, డ్రోన్లు, శాటిలైట్లు... పరాయి దేశాల మీద గూఢచర్యం కోసం వీటిని ఎలా వాడతారు?
- జస్టిస్ నజీర్: కోర్టుల్లో న్యాయమూర్తుల తీర్పులు.. వారు రిటైరయ్యాక పదవులపై తలెత్తుతున్న ప్రశ్నలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









