మెటా: ‘బీజేపీ’పై పరిశోధనాత్మక కథనాలను ‘ది వైర్’ ఎందుకు తొలగించింది

మెటా లోగో

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మీద రాసిన నాలుగు పరిశోధనాత్మక కథనాలను 'ది వైర్' వెబ్‌సైట్ తొలగించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులను తొలగించడానికి సంబంధించి అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా మెటా పని చేస్తున్నట్లుగా 'ది వైర్' కథనాలు రాసింది.

పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మెటా మాతృసంస్థ.

అయితే 'ది వైర్' ప్రచురించిన కథనాలు వాస్తవం కాదని, కథనాలకు మద్దతుగా అది చూపించిన పత్రాలు 'అసలైనవి' కాదని మెటా ప్రకటించింది.

మెటాకు సంబంధించి రాసిన పరిశోధనాత్మక కథనాలను తొలగించిన 'ది వైర్' వాటి మీద అంతర్గత విచారణ చేపడుతున్నట్లు తెలిపింది.

విచారణ తరువాత కథనాలను వెబ్‌సైట్‌లో ఉంచే అంశం మీద నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

మెటా అంతర్గత ఇ-మెయిల్స్, పత్రాల ఆధారంగా ఆ సంస్థలో బీజేపీ సభ్యులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉన్నట్లుగా 'ది వైర్' రిపోర్ట్ చేసింది. అయితే ఆ పత్రాలు తప్పుడు సమాచారం ఆధారంగా తయారు చేసినవని మెటా తెలిపింది.

అంతర్గత ఇ-మెయిల్ పేరుతో 'ది వైర్'లో ప్రచురితమైన పత్రాలు 'ఫేక్' అని మెటా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ గై రొజెన్ తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

భారత్‌లో ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా సంస్థలు ఒత్తిడులు ఎదుర్కొంటున్నాయని ఇటీవలి కాలంలో విమర్శలు వినిపిస్తున్నాయి. తాము చెప్పిన కంటెంట్‌ను తొలగించడంతోపాటు వ్యక్తులు లేదా గ్రూపుల ఖాతాలను రద్దు చేయడం వంటివి చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

కంటెంట్‌ను బ్లాక్ చేయాలంటూ తన అధికారం ఉపయోగించి తమపై ప్రభుత్వం ఒత్తిడులు తెస్తోందంటూ ఈ ఏడాది జులైలో కర్నాటక హై కోర్టులో ట్విటర్ పిటిషన్ వేసింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విగ్రహాన్ని ఒక వ్యక్తి పూజిస్తున్నట్లుగా ఉన్న ఒక వ్యంగ్యమైన పోస్టును ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించారని, తన పరిశోధనాత్మక కథనాల్లో 'ది వైర్' రాసింది. ఆ పోస్టును 'న్యూడిటీ అండ్ సెక్సువల్ కంటెంట్' నిబంధనలను ఉల్లంఘిస్తున్నందుకు తొలగించామని ఇన్‌స్టాగ్రామ్ తెలిపినట్లు దివైర్ వెల్లడించింది.

అయితే డిలీట్ చేసిన ఆ పోస్టును రీస్టోర్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, సింగరేణి గనుల నుంచి నల్ల బంగారం ఎలా తీస్తారో చూడండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)