ప్రియాంక చోప్రా: ఇరాన్ ముస్లిం మహిళల నిరసనలకు మద్దతు ఇవ్వడంపై మరో వివాదం

ఫొటో సోర్స్, LEIGH VOGEL/POOL/EPA-EFE/REX/SHUTTERSTOCK
ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న మహిళలకు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మద్దతుగా నిలవడం వివాదాస్పదమైంది.
ఇరాన్ నిరసనకారులకు మద్దతు తెలిపినందుకు కొందరు ఆమెను ప్రశంసిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఇటీవల ఇరాన్‌లో మాషా అమినీ అనే యువతిని అరెస్టు చేయగా, పోలీసుల కస్టడీలో ఆమె చనిపోయారు. నాటి నుంచి హిజాబ్‌కు వ్యతిరేకంగా అక్కడ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
నిరసనలను ప్రభుత్వం అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఘర్షణలు చెలరేగి ఇప్పటికి చాలా మంది మరణించారు.
ఈ నేపథ్యంలో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు మద్దతుగా నిలిచారు ప్రియాంక చోప్రా.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
'మీ ధైర్యం నాలో ఎంతో స్ఫూర్తి నింపుతోంది. పురుషాధిపత్య వ్యవస్థను సవాలు చేయాలంటే నిజంగానే ఎంతో ధైర్యం కావాలి. మీ హక్కుల కోసం పోరాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టడం అంత సులభం కాదు.
నేను మీతో ఉన్నా' అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
అయితే, సొంత దేశం(భారత్)లో ముస్లిం మహిళల హక్కులను అణచి వేస్తుంటే వాటి గురించి మాట్లాడకుండా ఇరాన్‌లో మహిళ గురించి మాత్రమే మాట్లాడటం ఏంటని? కొందరు ప్రశ్నిస్తున్నారు.
'ఇరాన్‌లో మహిళల హక్కుల గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతున్నారు. అది మంచిదే. మరి భారత్‌లోనూ మహిళలు అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు. వీరి గురించి మాట్లాడకపోవడం ప్రియాంక హిపోక్రసీని చూపిస్తోంది' అని ఆండ్రీ బొర్గేస్ అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సీనియర్ జర్నలిస్టు రాణా అయూబ్ కూడా దీని మీద స్పందించారు.
'ఇరాన్ మహిళల మీద ప్రియాంక చోప్రా ఆందోళనలను అభినందించాల్సిందే. కానీ తన సొంత దేశం భారత్‌లో బిల్కిస్ బానోతో పాటు ముస్లింల మీద, మైనారిటీ మహిళల మీద జరుగుతున్న వేధింపుల మీద ఆమె మౌనంగా ఉండటం గమనించాల్సిన విషయం' అని రాణా ఆయుబ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
'భారత్‌లో రేప్ చేసిన వారిని వదిలేసినప్పుడు ప్రియాంక చోప్రా మౌనంగా ఉన్నారు. ఆమె హిపోక్రటిక్ మాత్రమే కాదు అవకాశవాది కూడా' అని ముకర్రం అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇదే సమయంలో మరికొందరు ప్రియాంక చోప్రాకు కొందరు మద్దతుగా నిలుస్తున్నారు.
'మాషా అమిని మరణం తరువాత నిరసనలు వ్యక్తం చేస్తున్న ఇరాన్ మహిళలకు అండగా నిలిచినందుకు ప్రియాంక చోప్రాకు అభినందనలు.
అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే ధైర్యం ఉందని మరొకసారి మీరు నిరూపించుకున్నారు.
సినిమా, టీవీ పరిశ్రమలో చాలా మంది మీ బాటలోనే నడుస్తారని ఆశిస్తున్నా' అని బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
'సత్యం వైపు, మహిళల హక్కుల వైపు ప్రియాంక చోప్రా నిలబడ్డారు. మహిళలను మనుషులుగా చూడని వాళ్లు తప్ప మరెవరూ ఆమెను విమర్శించరు' అని ప్రముఖ రచయిత తారీక్ ఫతేహ్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

ఫొటో సోర్స్, MAHSA AMINI FAMILY
మాషా అమినీ ఎవరు?
22 ఏళ్ల మాషా అమినీ ఇరాన్‌కు చెందిన యువతి. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ సెప్టెంబరు 13న ఆమెను అరెస్టు చేశారు.
మూడు రోజుల తరువాత పోలీసుల కస్టడీలో ఆమె చనిపోయారు.
ఆమెను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయిందని ప్రజల్లో నిరసనలు చెలరేగాయి. కానీ 'అకస్మాత్తుగా గుండెలో సమస్య తలెత్తి' మాషా చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు.
'వ్యానులోనూ పోలీసు స్టేషన్‌లోనూ మాషాను విపరీతంగా కొట్టారు. మా అబ్బాయి అక్కడే ఉన్నాడు' అని మాషా తండ్రి అమ్జద్ ఆరోపిస్తున్నారు.
నాటి నుంచి ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. మహిళలు బయటకు వచ్చి హిజాబ్‌ను తీసేయడం ప్రారంభించారు.
ఇరాన్‌లో ఈ హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. పోలీసుల కాల్పుల్లో ఘర్షణల్లో ఎంతో మంది నిరసనకారులు చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
- మంత్రం అంటే ఏంటి? మంత్రాలతో ధ్యానం చేస్తే మెదడుకు మేలు జరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?
- ఇరాన్-కర్ణాటక: ఈ వివాదం హిజాబ్‌కు సంబంధించిందా, లేక మహిళల ఇష్టాయిష్టాలకు చెందినదా
- డయేరియాతో బాధ పడుతున్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు?
- హిజాబ్ ధరించని మహిళలను ‘వెంటాడి, వేటాడే’ ఇరాన్ మొరాలిటీ పోలీసులు ఎవరు? ఏం చేస్తారు?
- మహాత్మా గాంధీ జయంతి: ‘గాంధీని పూజించడం చాలా ప్రమాదకరం’ అని ఎవరు అన్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)