‘ఖలిస్థాన్ రిఫరెండం’ ఎంత తీవ్రమైనది? కెనడాలో స్థిరపడిన భారతీయులు ఏమంటున్నారు

ఖలిస్థాన్ రిఫరెండం

ఫొటో సోర్స్, NARINDER NANU

    • రచయిత, మాన్సీ దాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కెనడాలో పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. ఖలిస్థాన్ అనుకూల 'సిక్స్ ఫర్ జస్టిస్' (ఎస్‌ఎఫ్‌జే) అనే గ్రూపు సెప్టెంబర్ 18న ఇక్కడి ఓంటారియోలోని బ్రాంప్టన్‌లో 'ఖలిస్థాన్ రిఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ)'ను నిర్వహించింది.

భారత్‌లోని సిక్కుల కోసం 'ఖలిస్థాన్' పేరిట ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం ఈ గ్రూపు లక్ష్యం. గతంలో కూడా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

దీనికంటే ముందు కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించిన నివేదికలు వచ్చాయి. ఆ తర్వాత కెనడాలో నివసించే భారతీయులు, విద్యార్థులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కోరింది.

కెనడాలోని నివసించే సిక్కులు దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ హెచ్చరిక, ఒక పెద్ద వర్గానికి షో ఆఫ్ లాంటిదని కొందరు అంటున్నారు. 'కెనడాలోని నివసించే సిక్కులకు, పంజాబ్ స్వాతంత్ర్యానికి మద్దతునిచ్చే వారి భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది ఉల్లంఘన' అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

''మోదీ ప్రభుత్వం దౌత్యమార్గాల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణను ఆపలేకపోయింది. దాని తర్వాత, విదేశాంగ మంత్రిత్వశాఖ ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోంది'' అని 'సిక్స్ ఫర్ జస్టిస్' గ్రూపు న్యాయ సలహాదారు గురుపత్‌వంత్ సింగ్ పన్ను అన్నట్లు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

లైన్

హెచ్చరించిన భారత్

కెనడా అధికారులు ఈ రిఫరెండంను భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించినట్లు 'ఇండిపెండెంట్' వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక నివేదిక పేర్కొంది.

''కెనడాలో ఇటీవలి కాలంలో భారత వ్యతిరేక చర్యలు, ద్వేషపూరిత నేరాలు, జాతి హింస పెరిగిపోయింది. కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి'' అని అక్కడ నివసించే భారతీయులు, విద్యార్థులను భారత ప్రభుత్వం కోరింది.

సెప్టెంబర్ 22న విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి, మీడియాతో దీని గురించి మాట్లాడారు. '' ఈ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా హాస్యాస్పదం. ఇది రాడికల్ గ్రూపులు చేసిన ప్రయత్నం. దౌత్య స్థాయిలో కెనడా ప్రభుత్వంతో ఈ వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి. భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు మద్దతు ఇస్తామని, ఈ రిఫరెండంను అధికారికంగా గుర్తించబోమని కెనడా అధికారులు చెప్పారు'' అని ఆయన మీడియాతో అన్నారు.

భారత మిత్ర దేశం (కెనడా)లో రాడికల్ గ్రూపులు ఇలాంటి రాజకీయ ప్రేరిత చర్యను చేపట్టడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని గురించి కెనడా ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చిస్తుందని బాగ్చి చెప్పారు.

దీని మరుసటి రోజు, అంటే సెప్టెంబర్ 23న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.

వీడియో క్యాప్షన్, గురు గ్రంథ్ సాహిబ్‌లో ఏం ఉంటుంది? అది చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి

''భారత వ్యతిరేక కార్యకలాపాలు, ద్వేషపూరిత నేరాలు, సమూహాల మధ్య పెరుగుతోన్న హింసాత్మక ఘటనల గురించి కెనడా అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇలాంటి నేరాలపై దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, కెనడాలోని భారత రాయబార కార్యాలయం, భారత కాన్సులేట్ కోరారు. దోషులకు ఇంకా శిక్ష పడలేదు.

పెరుగుతోన్న హింసాత్మక ఘటనల దృష్ట్యా కెనడాలో ఉండే భారతీయులు, విద్యార్థులు, పర్యాటకం లేదా విద్య కోసం అక్కడి వెళ్లే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి.

కెనడాలోని భారతీయులు, అక్కడికి వెళ్లేవారు... ఒట్టోవాలోని భారత రాయబార కార్యాలయంలో లేదా టొరంటో, వాంకోవర్‌లోని కాన్సులేట్ కార్యాలయాల్లో లేదా వెబ్‌సైట్‌ల ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని'' ఆ ప్రకటనలో భారత ప్రభుత్వం కోరింది. అత్యవసర సమయాల్లో తక్షణ సహాయం పొందడం కోసం ఇలా చేయాలని సూచించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

లైన్

కెనడాలో ఎంతమంది భారతీయులు ఉన్నారు

లైన్
  • కెనడా ప్రభుత్వం లెక్కల ప్రకారం, అక్కడ స్థిరపడిన భారతీయుల సంఖ్య దాదాపు 14 లక్షలు.
  • భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, కెనడాలో నివసిస్తున్న భారతీయుల్లో 50 శాతం మంది సిక్కులు, 39 శాతం మంది హిందువులు.
  • వీరే కాకుండా ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు కూడా ఉన్నారు.
  • వీరిలో ఎక్కువ మంది గ్రేటర్ టొరంటో, గ్రేటర్ వాంకోవర్, మాంట్రియల్, కాల్గరీలో ఉంటారు.
లైన్
2020 జూలైలో దిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఎదుట ఖలిస్థాన్ మద్దతుదారులకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 2020 జూలైలో దిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఎదుట ఖలిస్థాన్ మద్దతుదారులకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ

కెనడాలోని భారతీయులు ఏమంటున్నారు

టొరంటోలో నివసించే జర్నలిస్ట్, రచయిత షమీల్ దీని గురించి మాట్లాడుతూ... ''నిర్వాహకులు దీన్ని రిఫరెండం అని పిలుస్తున్నారు. నా ఉద్దేశంలో దీన్ని రిఫరెండం అని పిలవడం తప్పు. దీన్ని ఒక పిటిషన్ అని పిలవాలి'' అని ఆయన అన్నారు.

ఖలిస్థాన్‌కు కెనడాలో చాలా మద్దతు ఉందని చెప్పడం కూడా సరికాదేమో అని ఆయన అభిప్రాయపడ్డారు.

''ఖలిస్థాన్ ఏర్పడటం వల్ల, అది ఏర్పడకపోవడం వల్ల తమ జీవితాల్లో వచ్చే మార్పు ఏంటని ఇక్కడ స్థిరపడిన చాలామంది అడుగుతారు. భారత్‌లో ఖలిస్థాన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే, ప్రజాభిప్రాయ సేకరణ భారత్‌లో చేపట్టాలి. కెనడాలో కాదు. కెనడాలో స్థిరపడిన ప్రజలు తిరిగి భారత్‌కు వెళ్లి స్థిరపడాలని కోరుకోవట్లేదు. కాబట్టి, ఈ వ్యవహారంలోకి తమను లాగడం దేనికీ పనికిరాదని వారు భావిస్తున్నారు.

ఏదైనా హింస జరగనంతవరకు విభిన్న అభిప్రాయాలు కలిగి ఉండటం కెనడాలో నేరం కాదు. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలను కలిగి ఉండటం ఇక్కడ చాలా సాధారణం. ప్రభుత్వం వాటిని గౌరవిస్తుంది కూడా'' అని ఆయన వివరించారు.

కెనడాలో నివసించే మరో సీనియర్ జర్నలిస్ట్ గురుప్రీత్ సింగ్ కూడా ఈ విషయాలతో ఏకీభవించారు. ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాల్లో కెనడా ప్రభుత్వం జోక్యం చేసుకోదని గురుప్రీత్ చెప్పారు.

''కెనడాలో ఏ ప్రాంతానికైనా తమ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించుకునే హక్కు ఉంటుంది. ఇందులో కెనడా ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఉదాహరణకు ఇక్కడి క్యూంబెక్ ప్రాంతం చాలాసార్లు ఇలాంటి డిమాండ్లు వచ్చాయి.

అయితే, ఖలిస్థాన్ లేదా ఉద్యమం పేరుతో ఎలాంటి హింసను సహించబోమని ఇక్కడి ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది.

''ఎవరైనా హింస మార్గంలో తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని చూస్తే, దానికి ఎలాంటి మద్దతు లభించదు. కానీ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో అంటే మాట్లాడటం లేదా చర్చల ద్వారా తమ డిమాండ్ల కోసం పోరాడుతుంటే అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదు'' అని కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అని ఆయన వ్యాఖ్యానించారు.

గురుప్రీత్ సింగ్ మాట్లాడుతూ... ''గత వారంలో జరిగిన వాటి పట్ల భారత ప్రభుత్వం కోపంగా ఉంది. సిక్కు సమాజం కూడా ఆందోళనలో ఉంది. కానీ ఇక్కడొక ప్రశ్న తలెత్తుతోంది. అదేంటంటే... భారత్‌లో ఎన్నో ద్వేషపూరిత నేరాలు జరుగుతున్నాయి. వాటి గురించి భారత సర్కారు అసలేం చేయట్లేదు. కానీ, దీని గురించి స్పందించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

''మీరు చూస్తోన్న ప్రజాభిప్రాయ సేకరణ కేవలం ఒక బూటకం. ప్రజల మధ్య అగాధం సృష్టించేందుకు చేస్తోన్న ప్రయత్నం'' అని గురుప్రీత్ సింగ్ అన్నారు.

ఖలిస్థాన్ రిఫరెండం

ఫొటో సోర్స్, SIKHS FOR JUSTICE

నిర్వాహకుల ప్రకటన

ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు దాదాపు లక్ష మంది ప్రజలు వచ్చినట్లు రిఫరెండం నిర్వాహకులు ప్రకటించారు.

కానీ, సీనియర్ జర్నలిస్ట్ షమీల్ మాట్లాడుతూ... ''ఓంటారియోలో ఉండే సిక్కుల జనాభా ప్రకారం చూస్తే నిర్వాహకులు చెబుతోన్న లెక్కను నమ్మడం చాలా కష్టం. ఊహించిన దాని కంటే ఎక్కువమంది ప్రజలు వచ్చి ఉండొచ్చు. కానీ, లక్ష మంది వచ్చారనడం అతిశయోక్తి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

లైన్

రిఫరెండంపై వివాదం ఏంటి?

వేర్పాటువాదం అనే అజెండాతో అమెరికా నుంచి పనిచేస్తోన్న 'సిక్స్ ఫర్ జస్టిస్' అనే ఈ గ్రూపును 'యూఏపీఏ' చట్టం కింద భారత ప్రభుత్వం 2019 జూలై 10న నిషేధించింది.

ఇది జరిగిన సంవత్సరం తర్వాత 2020లో ఖలిస్థాన్ గ్రూపుతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని భారత ప్రభుత్వం తీవ్రవాదులుగా ప్రకటించింది. 'సిక్స్ ఫర్ జస్టిస్' గ్రూపుతో ముడిపడి ఉన్న దాదాపు 40 వెబ్‌సైట్లను మూసి వేసింది.

కెనడా కంటే ముందు ఇతర ప్రాంతాల్లో కూడా ఖలిస్థాన్‌కు మద్దతుగా రిఫరెండంను నిర్వహించడానికి ఎస్‌ఎఫ్‌జే ప్రయత్నించింది. భారత్‌లోని సిక్కుల కోసం 'ఖలిస్థాన్' పేరిట ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం ఈ గ్రూపు లక్ష్యం. అందుకే సిక్కుల మద్దతును కూడగట్టేందుకు ఈ గ్రూపు ప్రయత్నిస్తోంది.

ఇందిరాగాంధీ

ఫొటో సోర్స్, PIB

'సిక్స్ ఫర్ జస్టిస్' అంటే ఏంటి?

ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత 1984లో భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి. ఇది కెనడాలో నివసించే సిక్కులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరికీ చాలా సున్నితమైన సమస్యగా మిగిలిపోయింది.

అదే సంవత్సరంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని, ఆమె సిక్కు అంగరక్షకులే హత్య చేశారు.

'ఆపరేషన్ బ్లూ స్టార్' కింద సిక్కులకు అత్యంత పవిత్ర ప్రదేశంగా భావించే స్వర్ణ దేవాలయంలో సైనిక చర్యకు ఆదేశించారు. ఈ సందర్భంగా చాలా మంది చనిపోయారు.

దీని తర్వాత 1985 జూన్‌లో మాంట్రియల్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం 'కనిష్క్' గాలిలోనే పేలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 329 మంది దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన కెనడా పౌరులు.

1984లో స్వర్ణ దేవాలయం నుంచి భింద్రన్‌వాలే అనుకూలదారులను బయటకు తీసుకురావడం కోసం నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్‌కు నిరసనగా ఈ విమానాన్ని పేల్చినట్లు చెబుతారు. సిక్కు వేర్పాటువాద గ్రూపు బబ్బర్ ఖల్సాకు చెందిన సభ్యులు ఈ దాడిలో ప్రధాన పాత్ర పోషించారని అంటారు.

ఈ ఘటన తర్వాత సురక్షితమైన జీవితాన్ని గడపాలనే కోరికతో పెద్ద సంఖ్యలో సిక్కులు యూకే, అమెరికా, కెనడా, ఇటలీ ప్రాంతాల్లో స్థిరపడటం మొదలుపెట్టారు. ఇలా వెళ్లిన చాలామందిలో ఆనాటి పంజాబ్ హింస తాలూకూ జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు కలిసి ఖలిస్థాన్ డిమాండ్‌ను మొదలు పెట్టారు.

2007లో అమెరికాలో 'సిక్స్ ఫర్ జస్టిస్' పేరిట ఒక గ్రూపు ఏర్పాటైంది. దీన్ని గురుపత్‌వంత్ సింగ్ పన్ను ఏర్పాటు చేశారు. ఆయన పంజాబ్ యూనివర్సిటీలో న్యాయ విద్యలో పట్టభద్రుడు అయ్యారు. తర్వాత అమెరికా వెళ్లి న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేశారు. ఈ గ్రూపుకు న్యాయ సలహాదారు కూడా ఆయనే. ఖలిస్థాన్‌కు మద్దతుగా 'రిఫరెండం 2020'ని నిర్వహించాలని ఆయనే సూచించారు.

పంజాబ్‌తో సహా ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, కెన్యా, మిడిల్ ఈస్ట్ వంటి దేశాల్లో రిఫరెండం నిర్వహించాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజల్లో ఏకాభిప్రాయం కుదిరితే పంజాబ్‌ను ప్రత్యేక దేశంగా పున: స్థాపించాలనే డిమాండ్‌తో ఐక్యరాజ్యసమితిని కలవాలనే యోచనలో ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఇటీవల ఏం జరిగింది?

ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రేటర్ టొరంటోలో ఓ విద్యార్థిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని రెండు హిందూ దేవాలయాలపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనలు కూడా జరిగాయి. ఆలయ గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. భారత హైకమిషన్ ఈ ఘటనను ఖండించింది. నిందితులను త్వరగా పట్టుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది.

కెనడాలోని గురుద్వారాలతో సహా అన్ని వర్గాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయని, దీనిపై విచారణ కొనసాగుతోందని గురుప్రీత్ సింగ్ చెప్పారు.

'హిందూఫోబియా' కారణంగా దేశంలో నివసిస్తున్న హిందువులు భయపడుతున్నారని కెనడా పార్లమెంట్ సభ్యుడు చంద్ర ఆర్య పార్లమెంట్‌లో అన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో టొరంటోలోని ఒక సబ్‌స్టేషన్ వెలుపల ఒక వ్యక్తిపై కాల్పులు జరిగాయి.

గతేడాది బ్రాంప్టన్‌లోని ఒక పాఠశాలను ధ్వంసం చేశారు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ పక్కనే ఉన్న ఈ గ్రామస్థులు సిక్కు మతంలోకి ఎందుకు మారుతున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)