హర్ ఘర్ తిరంగా: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసే కార్యక్రమానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎంత... ఇదో కుంభకోణమా?

జెండా

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ ఈ ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ వేడుకలను ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’గా పిలుస్తున్నారు.

ఈ వేడుకల్లో భాగంగా ‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఆగస్టు 13 నుంచి 15వ తేదీల్లో ప్రతి ఇంటిపైనా జెండా ఎగురవేసేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

హర్ ఘర్ తిరంగాతో మూడు రంగుల జెండాతో పౌరుల బంధం బలోపేతం అవుతుందని భారత ప్రభుత్వం చెబుతోంది. ప్రజల్లో దేశ భక్తి కూడా పెరుగుతుందని వివరిస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘‘ప్రస్తుతం జాతీయ జెండాను అధికారిక, దేశ చిహ్నంగా చూస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత జెండాతో వారికి వ్యక్తిగతమైన బంధం పెనవేసుకుంటుంది’’అని హర్ ఘర్ తిరంగా ప్రచార ప్రకటనల్లో రాశారు.

జెండా

ఫొటో సోర్స్, ROBIN SINGH

వివాదం ఏమిటి?

ఈ కార్యక్రమం మొదలు కావడానికి ఇంకా పది రోజుల సమయం ఉంది.

అయితే, దీనిపై ఇప్పటికే రెండు వివాదాలు రాజుకున్నాయి.

వీటిలో మొదటిది జమ్మూకశ్మీర్‌లో మొదలైంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి జెండాలు కొనుగోలు చేయాలని పిల్లలకు సూచించాలని బుడ్గాం జిల్లా జోనల్ ఎడ్యుకేషన ఆఫీసర్ ఒక ఆదేశాన్ని జారీచేశారు.

దీనిపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఒక ట్వీట్ చేశారు. ‘‘దురదృష్టవశాత్తు ఉన్నతాధికారి ఆదేశం జారీచేస్తే.. కింద స్థాయి అధికారిపై చర్యలు తీసుకున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలను పిల్లలతో కొనిపించాలని ఒక ప్రభుత్వ ఆదేశం విడుదలైంది’’అని ఆమె వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మెహబూబా ట్వీట్‌తో జెండా కొనుగోలు చేసే భారాన్ని ఎవరు భరించాలనే అంశంపై చర్చ మొదలైంది.

జెండా

ఫొటో సోర్స్, AFP

లైను

ఏమిటీ హర్ ఘర్ తిరంగా

లైను
  • ఈ కార్యక్రమంలో భాగంగా 20 కోట్ల ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  • అయితే, ప్రస్తుతం దేశంలో కేవలం 4 కోట్ల జెండాలు మాత్రమే ఉన్నాయని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) చెబుతోంది. అంటే మిగతా జెండాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, లేదా కేంద్ర ప్రభుత్వం ఆర్డరు చేయాల్సి ఉంటుంది.
  • కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం.. మూడు పరిమాణాల్లో జెండాలు అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం రూ.9, రూ.18, రూ.25ను వసూలు చేస్తున్నారు.
  • ఈ జెండాలను లోనుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జెండా తయారీ సంస్థలు అందిస్తాయి.
  • ప్రజలు కావాలంటే డబ్బులు పెట్టి జెండాలు కొనుక్కోవచ్చు.
  • ఎవరైనా భారీ మొత్తంలో కావాలన్నా జెండాలు ఆర్డరు చేసుకోవచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీలు బహుమతిగా ఇచ్చేందుకు ఇలా జెండాలను పెద్దయెత్తున కొనుగోలు చేస్తుంటాయి.
  • ప్రస్తుత కార్యక్రమంపై పంచాయతీలు, దుకాణదారులు, పాఠశాలలు, కాలేజీలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఆగస్టు 1 నుంచే పోస్టాఫీసులపైనా జెండాలు ఎగురవేస్తారు.
లైను
వీడియో క్యాప్షన్, కాళి: ఈ వివాదం ఎందుకు?

ఎంత ఖర్చవుతుంది?

20 కోట్ల ఇళ్లపై ప్రభుత్వం జెండాలు ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం ఒక్కో జెండాకు రూ.10 చొప్పున లెక్క వేసుకున్నా దీని కోసం రూ.200 కోట్లు ఖర్చు అవుతుంది.

ఇంత పెద్దమొత్తంలో ప్రస్తుతం జెండాలను తయారుచేయడం లేదు. దీంతో చాలా స్వయం సహాయక సంఘాలు, ట్రేడర్లు, బిజినెస్ హౌస్‌లకు టెండర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజలకు భారీగా జెండాలు అందుబాటులోకి వస్తాయి.

రాజస్థాన్‌లో స్థితిగతుల సాయంతో పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు.

రాజస్థాన్ మొత్తంగా కోటి ఇళ్లపై జెండాలు ఎగురవేయాలని లక్ష్యం పెట్టుకుంది. దీనిలో భాగంగా 70 లక్షల జెండాలు తమకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది. మిగతా 30 లక్షల జెండాలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

అయితే, ఈ 70 లక్షల జెండాల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి.

జెండాతోపాటు దానికి అవసరమైన స్టిక్‌లకు రూ.10 చాలా తక్కువని చాలా కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో భారీగా జెండాలను కొనుగోలు చేయడం కేంద్రానికి కష్టం అవుతోంది.

దీంతో రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జెండాలు అందుబాటులో ఉంచుతామని, ప్రతి జిల్లాలోనూ జెండాలు అందుబాటులో ఉంచడం కష్టమని కేంద్రం చెబుతోంది.

ఇక రెండో సమస్య డబ్బులు. జెండాలు కొనుగోలు చేసిన తర్వాతే డబ్బులు చెల్లిస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో ఒకవేళ తమ జెండాలు అమ్ముడుకాకపోతే.. తమ పరిస్థితి ఏం అవుతుందని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, అమర్‌నాథ్ యాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్: ‘నా కళ్లముందే వాళ్ల టెంట్లన్నీ కొట్టుకుపోయాయి’

ఫ్లాగ్ కోడ్‌లో మార్పులు..

ఈ పూర్తి కార్యక్రమాన్ని ఒక ‘‘కుంభకోణం’’గా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, ఆర్‌టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఈ విషయంపై ఆయన మొత్తంగా నాలుగు ట్వీట్లు చేశారు. కొన్ని కార్పొరేట్ సంస్థలతో మోదీ ప్రభుత్వానికి ఉన్న సంబంధాల వల్లే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. దీని కోసం ఫ్లాగ్ కోడ్‌కు కూడా సవరణలు చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఇండియన్ ఫ్లాగ్ కోడ్-2002 ప్రకారం.. జాతీయ జెండాలను చేతితో నేసిన వస్త్రాలతోనే తయారుచేయాలి. ఇలా పెద్దయెత్తున జెండాలు తయారుచేయడం చాలా కష్టం.

గత ఏడాది డిసెంబరులోనే ఫ్లాగ్ కోడ్‌కు సవరణలు చేశారు. దీని ప్రకారం. సిల్క్, కాటన్, పాలిస్టర్, మెషీన్‌ వస్త్రాలతోనూ జెండాలు చేయొచ్చని సవరణలు చేశారు.

ప్రస్తుతం ఆర్ఐఎల్ దేశంలో అతిపెద్ద పాలిస్టర్ తయారీ సంస్థ అని సాకేత్ గోఖలే చెబుతున్నారు.

అయితే, దేశంలోని భిన్న జౌళీ పరిశ్రమలకు జెండాలు తయారుచేసే ఆర్డర్లు ఇచ్చినట్లు బీబీసీకి సమాచారం అందింది. అయితే, వీటిలో చాలా సంస్థలకు నేరుగా ఆర్ఐఎల్‌తో ఎలాంటి సంబంధాలు లేవు.

జెండాలు తయారుచేసేందుకు ఆర్డర్లు తీసుకున్న కంపెనీలు.. ఆర్డర్లను సకాలంలో పూర్తిచేసేందుకు మిగతా సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఆరెస్సెస్

ఫొటో సోర్స్, Getty Images

ఆరెస్సెస్ ఎగరేస్తుందా?

ఈ జెండాల కార్యక్రమంపై రాజకీయ పార్టీల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

‘‘అసలు ఆరెస్సెస్ తమ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేయదు. మోదీ ప్రభుత్వం ఇంత పెద్దయెత్తున జెండాలను ఎగురవేస్తుండడం సంఘ్ వైఖరికి విరుద్ధంగా కనిపిస్తోంది’’ అని అస్సాంకు చెందిన ఏఐయూడీఎఫ్ నాయకుడు అమీనుల్ ఇస్లాం వ్యాఖ్యానించారు.

‘‘ఈ కార్యక్రమం కోసం ప్రజలు ఒక్కొక్కరు రూ.16 పెట్టి జెండాలు కొనుగోలు చేయాలి. అయితే, కేవలం రూ.16 ఖర్చు పెడితేనే, దేశ భక్తి ఉందని అనుకోకూడదు’’అని అమీనుల్ వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమాన్ని ‘‘హీపోక్రసీ’’గా కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు. ‘‘ఖాదీతో జెండా తయారుచేస్తున్న వారి జీవితాలను ధ్వంసం చేస్తున్నారు’’అని ఆయన అన్నారు.

‘‘ఫ్లాగ్ కోడ్‌లో మార్పులు తర్వాత, హుబ్బల్లిలో ఖాదీ జెండాలు తయారుచేసే యూనిట్‌కు గత ఏడాదిలో 90 లక్షల జెండాలకు ఆర్డర్లు వచ్చాయి. కానీ, ఈ ఏడాది మాత్రం వారికి 14 లక్షల జెండాలకు మాత్రమే ఆర్డర్లు వచ్చాయి’’అని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది.

మరోవైపు ఖాదీని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఖాదీ రుమాలును కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, భారత ప్రభుత్వ అధికారిక జాతీయ జెండాల తయారీ కేంద్రం ఇదొక్కటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)