హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ముస్లిం అమ్మాయిలపై ఎందుకీ వివక్ష?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షకీల్ అక్తర్
- హోదా, బీబీసీ ఉర్దూ, దిల్లీ
ముంబైకి చెందిన తబస్సుమ్ (పేరు మార్చాం) ఒక డాక్టర్. వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె చాలా ఆసుపత్రులు, క్లినిక్‌లలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారు.
మంచి మార్కులతో ఆమె వైద్య విద్యను పూర్తి చేశారు. కాబట్టి త్వరలోనే ఉద్యోగం దొరుకుతుందని ఆశపడ్డారు. దాదాపు 10 నుంచి 12 సంస్థలలో ఉద్యోగం కోసం ప్రయత్నించారు. కానీ, ఆమెకు ఎక్కడా సానుకూల స్పందన లభించలేదు.
తన అనుభవం గురించి తబస్సుమ్ వివరించారు. ''మిగతా అభ్యర్థులకు నా కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయని నేను అనుకున్నా. వారికి నా కంటే ఎక్కువ అనుభవం ఉందేమో, అందుకే వారు నన్ను ఎంపిక చేయలేదేమో అని భావించా.
కొన్ని రోజుల తర్వాత ఒక ప్రైవేట్ క్లినిక్‌లో కూడా ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాను. ఆ క్లినిక్‌ను మా కాలేజీకి చెందిన ఒక మాజీ ప్రొఫెసర్ నిర్వహిస్తున్నారు. ఆయన ఒక ముస్లిం. ఆయన భార్య నాతో మాట్లాడుతూ 'మీరు తలపై హిజాబ్ ధరించారు. కొంతమంది రోగులకు ఇది అభ్యంతరకరంగా ఉండొచ్చు. కాబట్టి మీరు ఇక్కడ ఉద్యోగం వస్తుందని ఆశించొద్దు' అని అన్నారు.
అప్పుడు నాకు ఉద్యోగానికి సంబంధించిన ఫోన్ కాల్స్ ఎందుకు రావట్లేదో అర్థమైంది. నేను నేరుగా వెళ్లి దరఖాస్తు చేసిన సంస్థల నుంచి నాకు ఎలాంటి స్పందన రాలేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పంపించినప్పుడు ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ ఇంటర్వ్యూ తర్వాత నన్ను తీసుకోలేదు'' అని ఆమె తెలిపారు.
లక్నోకు చెందిన నైలా (పేరు మార్చాం) కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒకవేళ ఇక్కడ పనిచేయాలనుకుంటే హెడ్ స్కార్ఫ్‌ను తొలిగించాల్సి ఉంటుందని ఒక స్కూల్ రిసెప్షన్ దగ్గరే తనకు చెప్పారని ఆమె తెలిపారు.
''ఇది మీ పాలసీ అయితే జాబ్ అప్లికేషన్ నిబంధనల్లో దీన్ని పేర్కొనాలని నేను వారికి చెప్పాను. కొన్ని రోజుల తర్వాత పరీక్ష కోసం కాల్ లెటర్ తీసుకునేందుకు రావాలని ఆ పాఠశాల నుంచి నాకు ఫోన్ వచ్చింది. కానీ, నేను అక్కడికి మళ్లీ వెళ్లలేదు. ఎందుకంటే వారు ఉద్యోగం ఇవ్వరని నాకు తెలుసు'' అని నైలా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హిజాబ్ కారణంగా ఉద్యోగాలు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు
ఉద్యోగాలు పొందడంలో వివక్ష గురించి ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే యువతులు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. చదువు విషయంలోనూ ముస్లిం మహిళలు ఇతర వర్గాల కంటే చాలా వెనుకబడి ఉన్నారు. ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ.
ఇటీవల 'లీడ్ బై' అనే ఎన్జీవో ఒక నివేదికను సమర్పించింది. ''ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న ముస్లిం యువతుల్లో దాదాపు సగం మందికి ముస్లింలైన కారణంగా ఉద్యోగాలు లభించడం లేదు. అంటే ఉద్యోగాల్లో ముస్లిం మహిళలు 47 శాతం వరకు వివక్షకు గురవుతున్నారు'' అని ఆ నివేదికలో పేర్కొంది.
లీడ్ బై సంస్థ డైరెక్టర్ డాక్టర్ రోహా షాదాబ్, బీబీసీతో మాట్లాడారు. ''భారత్‌లోని శ్రామిక శక్తిలో ముస్లిం మహిళల ప్రాతినిధ్యం, వారి పట్ల వివక్షపై ఎటువంటి అధ్యయనం జరగలేదు. మన్మోహన్ సింగ్ హయాంలో సచ్చర్ కమిటీ నివేదిక మాత్రమే ముస్లిం మహిళల ప్రాతినిధ్యం గురించి చర్చించింది. ఉపాధి విషయంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధ్యయనం చేయడానికి ఇది మా మొదటి ప్రయత్నం. ఈ అధ్యయనం ప్రకారం, హిందు యువతులతో పోలిస్తే 47.1 శాతం మంది ముస్లిం అమ్మాయిలకు ఉద్యోగానికి సంబంధించిన ఫోన్ కాల్స్ రాలేదు'' అని ఆయన వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''ఈ అధ్యయనం కోసం కొత్త పద్ధతిని అవలంభించాం. ఫ్రెషర్ జాబ్ అప్లికేషన్ కోసం ఒక రెజ్యూమ్‌ను సిద్ధం చేసి దాన్ని హబీబా అలీ, ప్రియాంక శర్మ పేరు మీద ఉద్యోగాల కోసం పంపించాం. 10 నెలల వ్యవధిలో అనేక జాబ్ సెర్చ్ వెబ్‌సైట్‌లలోని వేర్వేరు ఉద్యోగాలకు హబీబీ, ప్రియాంక పేరుతో చెరో వెయ్యి దరఖాస్తులు పంపించాం. ఈ అప్లికేషన్లలో ఫొటోలను జతపర్చలేదు. ఈ విధానం ద్వారా వివక్ష ఉన్నట్లు కనుగొన్నాం.
ఈ వివక్ష రేటు 47 శాతానికిపైగా ఉంది. హిందు మహిళ పేరుతో ఉన్న దరఖాస్తుకు 208 చోట్ల నుంచి సానుకూల స్పందన వచ్చింది. అదే ముస్లిం అమ్మాయి పేరుతో ఉన్న అప్లికేషన్‌కు కేవలం 103 ఫోన్ కాల్స్ మాత్రమే వచ్చాయి. 41 శాతం కంటే ఎక్కువ కంపెనీలు ప్రియాంక కోసం ఫోన్ చేయగా, హబీబా కోసం సంప్రదించిన రిక్రూటర్‌ల సంఖ్య 12.5 శాతం మాత్రమే'' అని వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ అధ్యయనంలో మరో విషయం బయట పడింది. అదేంటంటే ఉత్తర భారతదేశంలో ముస్లిం మహిళలపై వివక్ష రేటు 40 శాతం, పశ్చిమాన 59 శాతం, దక్షిణాదిలో 60 శాతంగా ఉన్నట్లు తెలిసింది.
''కానీ, ఇది పూర్తి సమీక్ష కాదు. ఒకవేళ రెజ్యూమ్‌లో హిజాబ్ ధరించిన హబీబా ఫొటోను పెడితే ఎలాంటి ఫలితం వచ్చేదో మాకు తెలియదు. అలాగే శర్మ అనే ఇంటిపేరు ద్వారా ప్రియాంక అనే అమ్మాయిని బ్రాహ్మణ అమ్మాయిగా రెజ్యూమ్‌లో మేం చిత్రీకరించాం. అయితే, ప్రియాంక శర్మ స్థానంలో ఒక దళిత అమ్మాయి పేరును రాస్తే ఫలితం భిన్నంగా ఉండొచ్చు. కానీ, ఉద్యోగాల్లో ముస్లిం మహిళలపై విపరీతమైన వివక్ష ఉందనేది మాత్రం ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైంది'' అని రోహా అన్నారు.
'లీడ్ బై' ఫౌండేషన్, ముస్లిం మహిళలకు వ్యాపారం, వాణిజ్యం, కార్పొరేట్ రంగాలలో ముందుకు సాగడానికి శిక్షణ ఇస్తుంది.
''బయాస్ ఇన్ హైరింగ్'' పేరుతో ఈ ఫౌండేషన్ సమర్పించిన ఈ నివేదికపై సోషల్ మీడియాలో కూడా చాలా మంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
అమిత్ వర్మ అనే ట్విటర్ ఖాతాదారుడు... ''మన రాజకీయాలే కాదు, మన సమాజం కూడా ముస్లింలకు వ్యతిరేకమని దీన్ని బట్టి తెలుస్తోంది. సమాజం డిమాండ్ ఆధారంగానే రాజకీయాలు నడుస్తున్నాయి'' అని ట్వీట్ చేశారు.
''ఈ అధ్యయనం పని ప్రదేశాల్లో ముస్లిం వ్యతిరేక వైఖరిని చాలా సముచితమైన రీతిలో బయటకు తీసుకు వచ్చింది'' అని నీలాంజన్ సర్కార్ అనే మరో యూజర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
''మీరు చాలా కష్టపడాలి. ప్రతీ పౌరుడికి సమాన అవకాశాలు ఉన్నాయి'' అని అలీషాన్ జాఫ్రీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఆమ్నా అనే యూజర్... ''ఇది కళ్లు తెరిపించే సర్వే. ముస్లిం మహిళలకు ప్రతీ ఉద్యోగంలో, ప్రతీ స్థాయిలో వివక్ష ఎదురవుతోంది'' అని రాశారు.
ఇవి కూడా చదవండి:
- వలసపోయే ప్రజల ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకర మార్గాలు ఇవే...
- ఆ డ్రైవర్ చేసిన చిన్న తప్పు 53 మంది ప్రాణాలను బలి తీసుకుందా?
- గుజరాత్ అల్లర్లు: 20 ఏళ్లు గడిచిన తర్వాత ఆ నాటి కేసుల పరిస్థితి ఏమిటి, జైలు కెళ్లింది ఎందరు, బాధితులు ఏమంటున్నారు?
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల బరువైన అతిపెద్ద బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకే అమరావతి వాసి ఉమేశ్ హత్యకు గురయ్యారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












