Statue of Unity: 150 మంది మహిళలను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు?
స్టాట్యూ ఆఫ్ యూనిటీలో హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న స్థానిక గిరిజన సంఘానికి చెందిన 150 మంది మహిళలను ఉద్యోగం నుంచి తొలగించారు. తమ ఉద్యోగాలను తిరిగి ఇవ్వాలని వీళ్లిప్పుడు డిమాండ్ చేస్తున్నారు.
ఓ ఏజెన్సీ ద్వారా ఈ గిరిజన మహిళలు ఉద్యోగంలో చేరారు. హౌస్ కీపింగ్ ఉద్యోగం కోసం వీళ్లు కాంట్రాక్ట్ పొందారు. కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీని తొలగించి, వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌కు పనులు అప్పగించగా ఈ పని కోసం యంత్రాలను ఉపయోగిస్తోంది వీఎంసీ. అది స్థానిక గిరిజనులకు ఆగ్రహం తెప్పించింది.
గత వారం రోజులుగా చేతిలో ప్లకార్డులు, బేనర్లు పట్టుకుని ఈ మహిళలు నిరసనలో పాల్గొన్నారు. స్థానిక ఎంపీ ఇంటి ముందు లేదా కలెక్టర్ ఆఫీస్ ఎదుట వీళ్లు ధర్నా చేస్తున్నారు. గత వారం రోజులు నుంచి నిరసన తెలియజేస్తున్న ఈ గిరిజన మహిళలు అధికారుల సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు.
గిరిజనులు తమ విలువైన స్థాలాలను ప్రాజెక్ట్ కోసం ఇచ్చారని స్థానిక నేతలు అంటున్నారు. ఇప్పుడు వాళ్లకిచ్చిన చిన్నచిన్న ఉద్యోగాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. గిరిజన మహిళలు తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలో పాల్గొంటారని స్థానిక నేతలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- Do Kwon: క్రిప్టోకరెన్సీ మార్కెట్ కుప్పకూలేందుకు కారణం ఇతనేనా? ఈయన కథేంటి?
- అల్లా, మొహమ్మద్ ప్రవక్తల ఫొటోలు ఎందుకు కనిపించవు? వీరి బొమ్మలను ఖురాన్ నిషేధించిందా?
- అల్‌ఖైదా హెచ్చరిక: ‘మొహమ్మద్ ప్రవక్తను అవమానించే వారిని చంపేస్తాం.. ఆత్మాహుతి దాడులు చేస్తాం’
- ఆంధ్రప్రదేశ్: టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఇంతగా తగ్గిపోవడానికి కారణం ఎవరు?
- ఆర్బీఐ: రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన రిజర్వ్ బ్యాంకు.. పెరగనున్న ఈఎంఐల భారం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)