మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు: ‘‘పక్క దేశాల్లో ఇలా వ్యాఖ్యలు చేస్తే మరణ శిక్ష విధిస్తారు’’ – నసీరుద్దీన్ షా
‘‘ఇలాంటి వ్యాఖ్యలను పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో చేస్తే మరణ శిక్ష విధిస్తారు. ఇవి దైవదూషణగా పరిగణిస్తారు’’అని నసీరుద్దీన్ షా అన్నారు.
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
నేటి ముఖ్యాంశాలు
- ఏడు దశాబ్దాల్లో అత్యంత విషమ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు.. వచ్చే ఆర్నెల్ల పాటు నిత్యావసర సరకుల కొనుగోళ్ల కోసం 500 కోట్ల డాలర్లు అవసరమని ఆ దేశ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే చెప్పారు.
- భారత సైక్లింగ్ క్రీడాకారుల బృందంలోని అగ్రశ్రేణి క్రీడాకారిణి ఒకరు.. జాతీయ జట్టు చీఫ్ కోచ్ (స్ప్రింట్) ఆర్.కె.శర్మ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీంతో స్లొవేనియాలో శిక్షణలో ఉన్న భారత బృందం మొత్తాన్నీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెనక్కు పిలిపించింది.
- భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే, టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు.
- జ్ఞాన్‌వాపి మసీదులో బయటపడినట్లుగా చెబుతున్న శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతించాలని స్వామి అవిముక్తేశ్వరానంద్ దాఖలుచేసిన అభ్యర్థనను వారణాసి కోర్టు బుధవారం తోసిపుచ్చింది.
- పారా షూటింగ్ వరల్డ్ కప్ 2022లో భారత్‌కు చెందిన మిక్సిడ్ టీం రూబినా ఫ్రాన్సిస్, మనీశ్ రావల్‌లకు స్వర్ణ పతకాలు వచ్చాయి.
300 అడుగుల లోతు బోరుబావిలో పడిన 18 నెలల చిన్నారిని కాపాడిన సైన్యం
గుజరాత్‌లో 300 అడుగుల లోతు బోరుబావిలో పడిన 18 నెలల చిన్నారిని భారత సైన్యం కాపాడింది.
సురేంద్రనగర్ జిల్లాలోని ధరంగధ్ర తాలూకా దూధాపుర్ గ్రామానికి 20 కి.మీ. దూరంలోని ఓ బోరు బావిలో బాలుడు శివం ప్రమాదవశాత్తు పడిపోయాడు.
అతడిని ప్రాణాలతో కాపాడినట్లు గుజరాత్‌లోని రక్షణ విభాగం తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పారా షూటింగ్ వరల్డ్ కప్‌లో రూబినా, మనీశ్‌లకు స్వర్ణ పతకాలు

ఫొటో సోర్స్, Ani
పారా షూటింగ్ వరల్డ్ కప్ 2022లో భారత్‌కు చెందిన మిక్సిడ్ టీం రూబినా ఫ్రాన్సిస్, మనీశ్ రావల్‌లకు స్వర్ణ పతకాలు వచ్చాయి.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో పీ-6 ఎయిర్ పిస్తోల్ విభాగంలో చైనా జట్టుపై రూబినా, మనీశ్ గెలిచారు.
మరోవైపు దేవరడ్డి శ్రీహర్ష కూడా పారా షూటింగ్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
పతక విజేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
చనిపోయిందని సీబీఐ ప్రకటించిన మహిళ ఎలా బతికి వచ్చారు
జ్ఞాన్‌వాపి మసీదులో పూజలు చేసేందుకు కోర్టు తిరస్కరణ

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, స్వామి అవిముక్తేశ్వరానంద్ జ్ఞాన్‌వాపి మసీదులో బయటపడినట్లుగా చెబుతున్న శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతించాలని స్వామి అవిముక్తేశ్వరానంద్ దాఖలుచేసిన అభ్యర్థనను వారణాసి కోర్టు బుధవారం తోసిపుచ్చింది.
స్వామి స్వరూపానంద సరస్వతి శిష్యుడైన అవిముక్తేశ్వరానంద్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ యోగ్యంకాదని చెబుతూ కోర్టు తిరస్కరించింది.
జ్ఞాన్‌వాపి మసీదులో కోర్టు ఆదేశాలతో సర్వే జరిగింది. ఈ సర్వేలో ఒక శివ లింగం లాంటి నిర్మాణం బయటపడినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, అది నీళ్ల ఫౌంటెయిన్ అని ముస్లిం తరఫున ప్రతినిధులు చెబుతున్నారు.
మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు: పక్క దేశాల్లో ఇలా వ్యాఖ్యలు చేస్తే మరణ శిక్ష విధిస్తారు – నసీరుద్దీన్ షా

ఫొటో సోర్స్, Getty Images
మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై నటుడు నసీరుద్దీన్ షా స్పందించారు.
న్యూస్ చానెల్ ఎన్‌డీటీవీతో ఆయన మాట్లాడారు. ‘‘భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా తక్కువ. పైగా చాలా ఆలస్యంగా స్పందించింది’’అని నసీరుద్దీన్ అన్నారు.
‘‘ఇలాంటి వ్యాఖ్యలను పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో చేస్తే మరణ శిక్ష విధిస్తారు. ఇవి దైవదూషణగా పరిగణిస్తారు’’అని ఆయన అన్నారు.
‘‘ఇక్కడ కోట్ల మంది ప్రజల మనోభావాలు, విశ్వాసాలను అధికారంలో ఉన్నవారు పట్టించుకోవడం లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
మిథాలీ రాజ్: ‘క్రికెట్ కిట్ పట్టుకుని వెళ్తే.. హాకీ ప్లేయర్‌వా? అని అడిగేవారు’
‘నన్నే ఆపుతారా’ - పోలీసులతో సోము వీర్రాజు వాగ్వాదం

ఫొటో సోర్స్, BJP
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసులతో ఘర్షణ పడడం చర్చనీయమైంది.
కోనసీమ జిల్లా జొన్నాడ వద్ద ఈ ఘటన జరిగింది. అమలాపురం బయలుదేరిన సోము వీర్రాజుని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏమిటని ఆయన పోలీసులను నిలదీశారు.
సోము వీర్రాజు వాహనాన్ని ముందుకెళ్లకుండా పోలీసులు నిలువరించారు.
దీంతో తన వాహనం దిగి వచ్చిన వీర్రాజు అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఇదీ నేపథ్యం
అమలాపురంలో గత నెల 24న జరిగిన ఘటనల్లో పోలీసులు దాదాపు 110 మందిని అరెస్ట్ చేశారు.
మంత్రి ఇంటిపై దాడి సహా పలు కేసులు నమోదు చేశారు. కోనసీమ జిల్లా బీజేపీ కార్యదర్శి సుబ్బారావు సహా కొందరు బీజేపీ కార్యకర్తలపైనా కేసులు పెట్టారు. సుబ్బారావుని అరెస్ట్ చేశారు.
పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు అమలాపురం వెళ్లాలని వీర్రాజు అనుకున్నారు. అయితే, ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు పెట్టారు.
అయినప్పటికీ కోనసీమ జిల్లా కేంద్రం వైపు వెళ్లేందుకు వీర్రాజు ప్రయత్నించడంతో ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పోలీసులు ఏమన్నారంటే..
కాగా.. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాము సోము వీర్రాజు పర్యటనను అడ్డుకున్నట్లు పోలీసులు చెప్పారు.
144 సెక్షన్‌తో పాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున రాజకీయ కార్యాచరణకు అనుమతులు లేవని తెలిపారు.
సోము వీర్రాజు ఏం చెప్పారు?
‘అమలాపురంలో హింస తరువాత డీజీపీ కానీ హోం మంత్రి కానీ ఇక్కడకు రాలేదు. పరిస్థితులు అంచనా వేసే సామర్థ్యం కానీ ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై తమ వైఖరేమిటే ప్రభుత్వం తెలియజేయాలి’ అని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
‘వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరిచ్చారు? కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తుంటే అడుగడుగునా ఆంక్షలతో పోలీసు భద్రత మధ్య రాష్ట్రాన్ని ఎంతకాలం పాలిస్తారు? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని ఉద్రిక్త పరిస్థితులను నిర్మాణం చేయదలచుకోలేదని ఎస్పీ స్థాయి అధికారికి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆంక్షలెందుకు? పోలీసు శాఖ ద్వారా ఈ దుందుడుకు చర్యలు మీ ప్రభుత్వం పాలన, అసమర్ధతను బయటపెడుతున్నాయి రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రభుత్వ నిఘా వర్గాలకు కూడా తెలియని స్థాయికి రాష్ట్ర పాలన దిగజారిందనే విషయాన్ని మీ చర్యలు అద్దం పడుతున్నాయి’ అని సోము వీర్రాజు ఆరోపించారు. తన కాన్వాయ్‌కి అడ్డుగా ప్రైవేటు వాహనాలు ఎలా నిలుపుతారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Mithali Raj : అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్

ఫొటో సోర్స్, Getty Images
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే, టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు.
అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్మ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. సుదీర్ఘ కాలం భారత జట్టుకు నేతృత్వం వహించడం గౌరవంగా ఉందని ఆమె అన్నారు.
ఇన్నాళ్లు తనను ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు ఆమె పేరిట ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆమె 10,686 పరుగులు చేశారు.
వన్డే మ్యాచ్‌లు 232 ఆడిన ఆమె 7,805 పరుగులు చేశారు. వన్డేల్లో 7 వేలు పరుగులు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీయే.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
జాతీయ జట్టు సైక్లింగ్ కోచ్‌పై అసభ్య ప్రవర్తన ఆరోపణ.. జట్టు మొత్తం స్లొవేనియా నుంచి వెనక్కు రావాలని ఎస్ఏఐ నిర్దేశం

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం భారత సైక్లింగ్ క్రీడాకారుల బృందంలోని అగ్రశ్రేణి క్రీడాకారిణి ఒకరు.. జాతీయ జట్టు చీఫ్ కోచ్ (స్ప్రింట్) ఆర్.కె.శర్మ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీంతో స్లొవేనియాలో శిక్షణలో ఉన్న భారత బృందం మొత్తాన్నీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెనక్కు పిలిపించింది.
‘‘భారత క్రీడాకారుల పాస్‌పోర్టులన్ని సమర్పించాలని, బృందం మొత్తం స్లొవేనియా నుంచి తిరిగి స్వదేశం వచ్చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించింది’’ అని సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ మణీందర్ పాల్ సింగ్ బుధవారం నాడు ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.
మహిళా సైక్లిస్ట్ ఫిర్యాదు మీద విచారించటానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కమిటీని ఏర్పాటు చేయటంతో సోమవారం నాడు ఈ ఘటన వెలులోకి వచ్చింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత బృందం శిక్షణ కోసం, విదేశీ పోటీల పరిచయ కార్యక్రమంలో భాగంగా స్లొవేనియాలో ఉండగా కోచ్ అసభ్య ప్రవర్తన ఘటన జరిగినట్లు చెప్తున్నారు. జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ దిల్లీలో జరుగనున్న ఏసియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు సన్నాహకంగా భారత బృందం స్లొవేనియాలో ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది.
‘‘ఈ శిబిరంలో కోచ్ ఆర్.కె.శర్మ అసభ్య ప్రవర్తన ఘటనకు సంబంధించి సదరు క్రీడాకారిణి నుంచి మాకు ఫిర్యాదు అందింది’’ అని సీఎఫ్ఐ సోమవారం నాడు ఒక ప్రకటనలో చెప్పింది. సీఎఫ్ఐ ఫిర్యాదుదారుకు మద్దతుగా నిలుస్తోందని, ఎస్ఏఐ ఏర్పాటు చేసిన విచారణ కమిటీకి పూర్తి సహకారం అందిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఉదంతంపై సీఎఫ్ఐ కూడా ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఖతార్: భరించలేని వాతావరణం.. పిట్టల్లా రాలిపోతున్న వలస కూలీలు.. మరణాల లెక్కల్ని ప్రభుత్వం దాచిపెడుతోందా?
స్టాచూ ఆఫ్ యూనిటీ: 150 మంది మహిళలను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు?
బీహార్‌లో బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

ఫొటో సోర్స్, ANI
భారతదేశాన్ని కుదిపేసిన 2012 నాటి నిర్భయ సామూహిక అత్యాచారాన్ని తలపించే దారుణ ఘటన బుధవారం నాడు బీహార్‌లో చోటు చేసుకుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ పోలీసులను ఉటంకిస్తూ తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లా బెట్టియా నగరంలో బుధవారం నాడు ఒక బస్సులో ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.
బస్సులో బాధితురాలు అపస్మారక స్థితిలో కనిపించిందని ప్రాధమిక దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.
బస్సు డ్రైవరు, అతడితో పాటు ఉన్న వారు తనకు ఒక కూల్ డ్రింక్ ఇచ్చారని, అందులో నిద్రమాత్ర వేశారని బాధితురాలు తన వాంగ్మూలంలో చెప్పింది. ఆ కూల్ డ్రింక్ తాగిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన మైనర్ బాలిక మీద ఆ ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
శ్రీలంక సంక్షోభం: నిత్యావసర సరకుల కోసం 500 కోట్ల డాలర్లు అవసరమన్న ప్రధాని

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఏడు దశాబ్దాల్లో అత్యంత విషమ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు.. వచ్చే ఆర్నెల్ల పాటు నిత్యావసర సరకుల కొనుగోళ్ల కోసం 500 కోట్ల డాలర్లు అవసరమని ఆ దేశ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే చెప్పారు.
ఆహారం, ఇంధనం, ఎరువులు వంటి కనీస అవసరాలైన సరకుల కోసం ఈ మొత్తం అవసరమని ఆయన మంగళవారం నాడు శ్రీలంక పార్లమెంటులో పేర్కొన్నారు.
శ్రీలంక గత మే నెలలో చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ అప్పులు చెల్లించలేక డిఫాల్టర్‌గా మారింది.
గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించటానికి సహాయ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థతో చర్చలు జరిపింది.
ఎరువుల కోసం భారతదేశానికి చెందిన ఎక్జిమ్ బ్యాంక్ నుంచి 5.5 కోట్ల డాలర్ల రుణం తీసుకోవటానికి శ్రీలంక పార్లమెంటు ఇంతకుముందు ఆమోదం తెలిపింది.
ఐక్యరాజ్యసమితి కూడా శ్రీలంకకు సాయం అందించాల్సిందిగా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసిందని, ఆహార, వ్యవసాయ, ఆరోగ్య రంగాల కోసం 4.8 కోట్ల డాలర్లు సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని రణిల్ విక్రమసింఘే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్: టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఇంతగా తగ్గిపోవడానికి కారణం ఎవరు?
‘తెలంగాణలో వారసత్వ దుష్పరిపాలనను అంతం చేయాలి’: ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, @narendramodi
గ్రేటర్ మునిసిపల్ హైదరాబాద్ కార్పొరేషన్‌లోని బీజేపీ కార్పొరేటర్లు, తెలంగాణకు చెందిన పార్టీ ఇతర నాయకులు బుధవారం నాడు దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.
ఈ సందర్భంగా వారితో విస్తృత అంశాలపై చర్చించానని, సమాజ సేవా కార్యక్రమాల మీద, క్షేత్ర స్థాయిలో ప్రజలకు సాయం చేయటం గురించి ఈ చర్చల్లో మాట్లాడామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
తెలంగాణలో సుపరిపాలన కోసం, వారసత్వ దుష్పరిపాలనను అంతం చేయటం కోసం బీజేపీ పనిచేస్తుందని మోదీ పేర్కొన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అమెరికా సరిహద్దును చేరుకోవటానికి 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన వలసదారులు

ఫొటో సోర్స్, Reuters
వేలాది మంది వలసదారులు సోమవారం ఉదయం దక్షిణ మెక్సికో నుంచి అమెరికా సరిహద్దు వరకూ సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇదే అతిపెద్ద బిడారు కావచ్చునని వలసదారుల ఉద్యమకారులు చెప్తున్నారు.
రాయిటర్స్ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం కనీసం 6,000 మంది వలసదారులు గ్వాటమెలా - మెక్సికో సరిహద్దులోని నగరం తాపాచులా నుంచి బయలుదేరారు. వీరిలో ఎక్కువ మంది వెనెజువెలా పౌరులు ఉన్నారు.
ఈ వారం లాస్ ఏంజెలెస్‌లో జరుగునున్న అమెరికా ఖండాల దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో వలస అంశం కూడా ఒక ప్రధాన అంశంగా ఉంది. లాటిన్ అమెరికా దేశాల నుంచి సామూహిక వలసలపై ఈ సదస్సులో భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించే అవకాశముంది.

ఫొటో సోర్స్, Reuters
వెనెజువెలా, క్యూబా, నికరాగువా దేశాల నుంచి వలసదారులు అధికంగా వస్తుంటారు. ఈ దేశాలను అమెరికాల శిఖరాగ్ర సదస్సు నుంచి మినహాయిస్తున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం ఈ వారం ఆరంభంలో ప్రకటించింది. దీంతో తాను కూడా ఈ సదస్సుకు హాజరు కాబోనని మెక్సికో అధ్యక్షుడు ఆంద్రెస్ మాన్యువెల్ లోపెజ్ ఒబ్రాడర్ చెప్పారు.
ఈ నేపథ్యంలో అమెరికా సరిహద్దుకు చేరుకోవటం లక్ష్యంగా ఈ వలసదారుల బిడారు దాదాపు 2,000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టింది. అయితే వారు ఎప్పటికి ఈ సరిహద్దును చేరుకుంటారనే అంశంపై స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్ యుద్ధం వల్ల మాంద్యం ముప్పులో ప్రపంచ దేశాలు: ప్రపంచ బ్యాంకు హెచ్చరిక

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటికే అతలాకుతలమైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు.. యుక్రెయిన్ యుద్ధం కారణంగా మాంద్యం ముప్పును ఎదుర్కోబోతున్నాయని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.
ఆసియా, యూరప్ దేశాల్లో తక్కువ అభివృద్ధి చెందని దేశాలు ‘‘భారీ మాంద్యాన్ని’’ చవిచూడబోతున్నాయని చెప్పింది.
అధిక ద్రవ్యోల్బణం, అల్ప వృద్ధితో కూడిన ‘స్టాగ్‌ఫ్లేషన్’ ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇంధన, ఆహార వ్యయాలు పెరుగుతూ పోతున్నాయి.
‘‘యుక్రెయిన్‌లో యుద్ధం, చైనాలో లాక్‌డౌన్లు, సరఫరా శ్రేణులకు ఆటంకాలతో పాటు స్టాగ్‌ప్లేషన్ ముప్పు.. వృద్ధిని అడ్డుకుంటున్నాయి. చాలా దేశాలు మాంద్యంలోకి వెళ్లిపోకుండా నివారించటం కష్టమవుతుంది’’ అని జూన్ నెలకు ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికలో డేవిడ్ వివరించారు.
‘మోదీ ప్రభుత్వం అరబ్ దేశాల ముందు మోకరిల్లుతోంది’: సుబ్రమణ్యం స్వామి విమర్శ

ఫొటో సోర్స్, ANI
‘‘మోదీ ప్రభుత్వం అరబ్ దేశాలకు ఎదురు నిలవలేదు’’ అంటూ పార్లమెంటు సభ్యుడు సుబ్రమణ్యం స్వామి వ్యాఖ్యానించారు.
బీజేపీ అధికార ప్రతినిధులు టీవీ చానల్ చర్చలో మహమ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యల పట్ల ఇస్లామిక్ దేశాల ప్రతిస్పందనతో పార్టీ నేతలపై బీజేపీ చర్యలు చేపట్టిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం మీద స్వామి ఈ విమర్శలు ఎక్కుపెట్టారు.
‘‘భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా, ఉగ్రవాద హమాస్‌కు అనుకూలంగా ఓటు వేసింది. అఫ్గాన్ సంక్షోభం సమయంలో భారత ప్రభుత్వం కతార్ చుట్టూ తిరుగుతూ తాలిబాన్‌తో తమను జట్టుకట్టించాలని విజ్ఞప్తులు చేస్తూ ఉంది. దుబాయ్‌కి మనీలాండరర్‌గా గుర్తింపు ఉంది. అది బీబీసీఐని నియంత్రిస్తుంది. ఇంకా కావాలా?’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండిన నూపుర్ శర్మ ఒక టీవీ చానల్ చర్చలో.. మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మరో అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ కూడా.. మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పదంగా ట్వీట్ చేశారు.
వీరిద్దరి వ్యాఖ్యలపై అరబ్ ప్రాంతపు ఇస్లామిక్ దేశాల నుంచి తీవ్ర ప్రతిస్పందన పెల్లుబికింది. భారతదేశం క్షమాపణ చెప్పాలని కూడా కతార్ డిమాండ్ చేసింది. ఈ వివాదం ముదురుతుండటంతో.. అది తమ పార్టీ అభిప్రాయం కాదని బీజేపీ చెప్పింది. పార్టీ నుంచి నూపుర్ శర్మను సస్పెండ్ చేసింది. నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
