హదికా కియానీ, కనికా కపూర్: పాకిస్తాన్ పాటలను బాలీవుడ్ కాపీ కొడుతోందా

కనికా కపూర్, హదికా కియానీ

ఫొటో సోర్స్, YT/HADIQA/KANIKA

ఫొటో క్యాప్షన్, కనికా కపూర్, హదికా కియానీ

ఉర్దూలో 'బుహే బరియాన్...' అంటే అర్థం తలుపులు, కిటికీలు, గోడలు దాటుకుని చిరుగాలిలా వస్తాను అని అర్థం.

1999లో పాకిస్తాన్ గాయని హదికా కియానీ పాడిన ఈ పాట చాలామందికి తెలుసు. ఈ 'బుహే బరియన్' పాటలోని రిథమ్‌ను పోలిన కొన్ని పాటలు ఇండియాలో పలు హిందీ సినిమాలలో కూడా వినిపించాయి.

2002లో ప్రీతీ జింటా, జిమ్మీ షెర్గిల్, అర్జున్ రాంపాల్‌ల సినిమా 'దిల్ హై తుమ్హారా' పాట- దిల్ లగా లియా, మైనే తుమ్సే ప్యార్ కర్కే అనే పాట, అదే సంవత్సరం షారూఖ్, సల్మాన్ నటించిన 'హమ్ తుమ్హారే హై సనమ్' సినిమాలో షారుఖ్, మాధురీ దీక్షిత్‌ల మధ్య సాగే టైటిల్ సాంగ్ 'బుహే బరియాన్' తరహాలో సాగుతాయి.

తాజాగా విడుదలైన ఓ పాటలో కూడా ఇదే రిథమ్‌తో పాటు పాత పాటలోని కొన్ని పదాలు వినిపిస్తాయి. ఈ పాటను భారతీయ గాయని కనికా కపూర్ వాయిస్‌లో 'సరిగమ మ్యూజిక్' అందించింది.

"బుహే బరియా తే నాలే కందే టప్‌ కే...మే అవాంగి హవా బణా కే" అనే పాట లిరిక్స్, రిథమ్ 'బుహే బరియాన్' పాట నుంచి స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తాయి. అయితే, ఈ పాటలో వినిపించే మిగిలిన సాహిత్యం భిన్నంగా ఉంటుంది.

పాకిస్తానీ గాయని హదికా కియానీ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో తన పాటలోని రిథమ్‌ను, సాహిత్యాన్ని వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె అభ్యంతరాలపై కనికా కపూర్ కూడా స్పందించారు. దీంతో, భారత పాకిస్తాన్ గాయనీ గాయకులు, సంగీతకారులు పరస్పరం కాపీ చేయడం, ప్రేరణ పొందడం గురించి చర్చ నడుస్తోంది.

హదికా కియానీ

ఫొటో సోర్స్, INSTA/HADIQAKIANIOFFICIAL

ఫొటో క్యాప్షన్, హదికా కియానీ

హదికా కియానీ ఏం రాశారు?

"బుహే బరియాన్ పాటతోపాటు, నా ఆల్బమ్ రోష్నిలోని అన్ని పాటల కాపీరైట్‌లు నా సొంతం. బుహే బరియాన్ అనే కవితను మా అమ్మ రాశారు. నాకు హక్కులు ఉన్నాయి. ఎవరైనా వాటిని కాపీ చేస్తే అది చట్టవిరుద్ధం. మా టీమ్ వారిపై చర్యలు తీసుకుంటుంది'' అని హదికా రాశారు.

హదికా చెబుతున్న రోష్నీ ఆల్బమ్ 1999లో వచ్చింది. ఈ ఆల్బమ్‌లో 14 పాటలు ఉన్నాయి. ఆల్బమ్ విడుదలైన తర్వాత హదికా చాలా పాపులర్ అయ్యారు. ARY న్యూస్ ప్రసారం చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ స్క్రీన్ షాట్‌లో హదికా స్పందన ఇలా ఉంది.

''మరొకసారి మా అమ్మ రాసిన పాటను సిగ్గు లేకుండా కాపీ చేశారు. ఎవరూ హక్కుల గురించి అడగలేదు, ఎవరూ రాయల్టీ చెల్లించలేదు. సులభంగా డబ్బు సంపాదించడానికి మా అమ్మ రాసిన పాటను రీ-రికార్డింగ్ చేసారు. షారుఖ్, ప్రీతి జింటా వంటి స్టార్లు బాలీవుడ్ చిత్రాలలో ఇది చాలాసార్లు కాపీ చేశారు. డబ్బు సంపాదించడానికి దాదాపు ప్రతి గాయకుడు ఈ పాటను పాడారు. ఈ పాటతో తయారు చేసిన చాలా వీడియోలకు 20 కోట్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ ఉన్నాయి'' అని రాశారామె.

వీడియో క్యాప్షన్, సల్మాన్ ఖాన్: పామును కర్రతో బయటకు తీసుకెళ్తుంటే, మూడు సార్లు కాటేసింది

"నేను ఇంకా బతికే ఉన్నాను, మీరు నా పాటలను ఉపయోగించాలనుకుంటే, నా అనుమతి తీసుకోండి. వేరొకరి పాటలతో డబ్బు సంపాదించడం మంచిది కాదు. నేను ఏ గాయకుడికి వ్యతిరేకం కాదు. కానీ, వారు చేస్తున్న పనులతో నిరాశ చెందాను. పాకిస్తానీ సంగీతాన్ని కాపీ చేస్తున్నారు'' అని కనిక రాశారు.

ఈ అంశంపై బీబీసీ హదికాను సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ, ఈ కథనం రాసే వరకు ఆమె నుంచి స్పందన రాలేదు.

కనికా కపూర్

ఫొటో సోర్స్, INSTA/KANIKAKAPOOR

ఫొటో క్యాప్షన్, కనికా కపూర్

కనికా కపూర్ స్పందన ఏంటి?

హిందూస్తాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనికా కపూర్ ఈ ఆరోపణలను ఖండించారు. "ఈ పాట విన్న ప్రతి ఒక్కరికీ ఇది అసలైన పాట అని తెలుస్తుంది. పల్లవి నుంచి పాట చివరి వరకు ఇది ఒరిజినల్. మేము హుక్ లైన్‌గా బుహే బరియాను ఉపయోగించాము. ఇది పాత జానపద గీతానికి చెందిన హుక్‌లైన్‌. నా ఉద్దేశం, మా కంపెనీ ఉద్దేశం ప్రకారం ఇది జానపద గీతం'' అన్నారామె.

"ఈ పాటకు సంబంధించిన చాలా వెర్షన్‌లను మేము విన్నాం. దాని గురించి ఎవరూ ఏమీ చెప్పలేదు. మేము జానపద పాటను కాపీ పేస్ట్ చేయలేదు. మేం కేవలం రెండు లైన్ల నుంచి ప్రేరణ పొందాము. ఇది కాపీ అన్నవాళ్లు ఈ పాటను రాసి కంపోజ్ చేసిన కున్వర్ జునేజా, శృతి రాణేలకు అన్యాయం చేసినట్లే. ఇది కాపీ అని ఎవరైనా అంటే అది తప్పు'' అని కనిక స్పష్టం చేశారు.

భారత్ పాకిస్తాన్ ఆర్టిస్టుల మధ్య కాపీరైట్ వివాదాలు చాలా కాలంగా ఉన్నాయి

ఫొటో సోర్స్, INSTAGRAM/KANIKA/HADIKA

ఫొటో క్యాప్షన్, భారత్ పాకిస్తాన్ ఆర్టిస్టుల మధ్య కాపీరైట్ వివాదాలు చాలా కాలంగా ఉన్నాయి

భారత్ పాకిస్తాన్ మధ్య కాపీ వివాదాలు

లిరిక్స్, రిథమ్‌ను కాపీ చేశారంటూ భారత్, పాకిస్తాన్ కళాకారుల మధ్య విమర్శలు చెలరేగడం ఇది మొదటిసారి కాదు.

పైగా ఒక దేశంలో తయారైన పాటను మరో దేశంలో వాడుకోవడం కూడా కొత్త కాదు. దీనికి తాజా ఉదాహరణ మనోజ్ ముంతాషీర్ ఇటీవల విడుదల చేసిన 'దిల్ గలతీ కర్ బైటా హై, గలతీ కర్ బైటా హై దిల్...బోల్ హమారా క్యా హోగా' పాట. ఈ పాటను జుబిన్ నౌటియాల్ పాడారు.

కానీ వాస్తవానికి ఈ ఖవ్వాలిని చాలా సంవత్సరాల కిందటే నుస్రత్ ఫతే అలీ ఖాన్‌తో సహా చాలా మంది పాకిస్తానీ గాయకులు పాడారు. ఇలా కాపీ విమర్శలు ఎదుర్కొన్న పాటల జాబితా పెద్దదే ఉంది. అందులో ఐదు ప్రముఖ పాటలు ఇవి:

1.సడక్ (1991), పాట- తుమ్హే అప్‌నా బనానే కీ కసమ్ ఖాయీ హై

ముస్తఫా జైదీ గజల్'చలే తో కట్ హీ జాయేగా సఫర్ ఆహిస్తా, ఆహిస్తా...' నుండి ఈ పాటకు మెలోడీని తీసుకున్నారు. ఈ పాటను పాకిస్తాన్ గాయనీ ముసారత్ నజీర్ పాడారు.

2. ఇన్సాఫ్ అప్నే లాహు సే (1994) పాట- హవా హవా యే హవా, 2017లో ముబారకన్ సినిమా పాట- హవా హవా

ఈ రెండు పాటల సంగీతం, సాహిత్యం 80లలో పాకిస్తానీ గాయకుడు హసన్ జహంగీర్ పాడిన పాటల మాదిరిగానే ఉన్నాయి.

3. దబాంగ్(2010) పాట మున్నీ బద్నామ్ హుయి డార్లింగ్ తేరే లియే...

వీడియో క్యాప్షన్, ఉత్తరాదిని ఊపేస్తున్న తెలుగు సినిమా

ఇదే తరహా పాట 1993లో ఒమర్ షరీఫ్ సినిమా ‘మిస్టర్ చార్లీ’ లో కూడా ఉంది. పాట సాహిత్యం- "లడ్కా బద్నామ్ హువా...హసీనా తేరే లియే" అని ఉంటుంది. బప్పి లాహిరి అదే స్టైల్‌లో, పదాలతో పాట పాడారు.

4. బేవఫా సనమ్ (1995) పాట- ‘అచ్చ సిల దియా తూనే మేరే ప్యార్ కా...’

1970లో పాకిస్తానీ చిత్రం 'విచోరా'లో నూర్‌జహాన్ పాడిన పాట- ‘కోయి నవా లారా లా కే మైను రోల్ జా’ పాట రిథమ్ గుర్తుకొస్తుంది.

5. రాజా హిందుస్తానీ(1996) పాట- ‘కిత్నా ప్యారే తుజే రబ్ నే బనాయా...’

1997లో మరణించిన నుస్రత్ ఫతే అలీ ఖాన్ అంతకు ముందు ఓ ఖవ్వాలి పాడారు - కిన్నా సోహ్నా తేను రబ్ నే బనాయా అనే ఈ పాట రాజా హిందుస్తానీ పాటకు మూలంలాగా ఉంటుంది.

నుస్రత్ ఫతే అలీఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నుస్రత్ ఫతే అలీఖాన్

నుస్రత్ ఫతే అలీ పాటలు- బాలీవుడ్

మీ పాటలను ఎవరు ఎక్కువ కాపీ చేశారని ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు విజుషా, అను మాలిక్ అని సమాధానం చెప్పారు నుస్రత్ ఫతే అలీఖాన్. ఈ వీడియో సోషల్ మీడియాలో ఉంది.

సంగీత దర్శకుడు విజు షా ‘మొహ్రా’ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని 'తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్' అనే పాపులర్ పాట ఈ సినిమాలో ఉంది.

1994లో విడుదలైన ఈ సినిమాకు కొన్ని సంవత్సరాల ముందే నుస్రత్ అలీ ఖాన్ ఓ ఖవ్వాలి పాడారు. 'దమ్ మస్త్ కలందర్ మస్త్ మస్త్'. ఇది అచ్చం తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ అనే పాటకు మాతృకలాగా ఉంటుంది.

1995లో వచ్చిన 'యారాన' సినిమాలోని 'మేరా పియా ఘర్ ఆయా' అనే పాట కూడా అంతకు ముందు నుస్రత్ ఫతే అలీఖాన్ పాడిన పాట నుంచి ప్రేరణ పొంది రూపొందించినదే.

ఈ సినిమా విడుదలకు ముందు నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాడిన ఖవ్వాలీ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

భారతీయ సినిమాల నుంచి పాకిస్తాన్ కాపీ కొట్టిన పాటలు

పాటలను ఇలా కాపీ చేయడం, అనుమతి లేకుండా వాడుకోవడంలో ఒక్క భారతీయులనే తప్పుబట్టే పరిస్థితి లేదు. అనేక భారతీయ సినిమాల పాటలు విదేశాలలో కాపీ అయ్యాయి.

2012లో 'ఏక్ థా టైగర్' చిత్రంలోని 'సయ్యారా' పాటలోని రిథమ్‌ను 2013లో సింగర్ రకీజా తన పాటలో కాపీ చేశారు.

2011లో వచ్చిన 'రా వన్' చిత్రంలోని ఛమక్‌ చల్లో పాటలోని రిథమ్‌ను 2013లో దారా బుబామారాలో ఉపయోగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)