కిలిపాల్: తెలుగు, బాలీవుడ్ పాటలకు లిప్‌సింక్ చేస్తూ వైరల్ అయిన టాంజానియా అన్నా, చెల్లెలు
టాంజానియాకు చెందిన ఈ అన్నా చెల్లెళ్లు లిప్ సింకింగ్ బాలీవుడ్ పాటలతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు.
RRR సినిమాలో నాటు నాటు పాటకు కూడా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల్లాగే డ్యాన్స్ చేస్తూ అలరించాడు కిలిపాల్. అలాగే ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంతో పాటు చాలా బాలీవుడ్ హిట్ సాంగ్స్‌కు లిప్ సింక్ చేస్తూ పాడటం, డ్యాన్స్ చేయడంతో కిలిపాల్, ఆయన చెల్లెలు నీమా పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల్ని సంపాదించుకున్నారు.
ఆఫ్రికాలోని టాంజానియాకు చెందిన 26 ఏళ్ల కిలిపాల్ స్థానిక మసాయి తెగకు చెందిన యువకుడు. తూర్పున ఉన్న ప్వాని ప్రాంతంలో మిందు టులీని అనే ఒక చిన్న గ్రామంలో నివసిస్తుంటాడు.
వీళ్ల గ్రామానికి కరెంట్ సరఫరా కూడా లేదు. ఫోన్ చార్జింగ్ చేసుకోవడానికి కూడా సమీపంలోని పట్టణం లుగోబాకు వెళ్లాల్సి ఉంటుంది.
అయితే, టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన కిలి.. తర్వాత బాలీవుడ్ సాంగ్స్‌కు తనదైన డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయ్యాడు.
‘సంగీతం విశ్వ భాష. అన్ని జీవుల మధ్యా శ్రావ్యమైన బంధం. మనం ఏ దేశంలో పుట్టాం, ఏ జాతికి చెందాం అన్నదానితో సంబంధం లేకుండా సంగీతం మనందరినీ కలుపుతుంది. దీనికి కిలిపాల్ నిజమైన ఉదాహరణ’ అని ప్రముఖ గాయకుడు జుబిన్ నౌటియాల్ అన్నారు.
ఆవులు కాసి జీవించే వీళ్లు ఇప్పుడు టాంజానియాలోనే కాదు భారతదేశంలో కూడా ఫేమస్ అయ్యారు.
భారతదేశానికి ప్రయాణించాలని ఉందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- హిమాన్షు బాడీషేమింగ్.. ‘అమిత్ షా గురించి, మోదీ కుటుంబం గురించి ఇలాగే మాట్లాడొచ్చా?’ - కేటీఆర్ ఆగ్రహం
- యూరప్: ప్రాణాలను కాపాడే వ్యాక్సీన్లు రెడీగా ఉన్నా ప్రజలు ఎందుకు వేయించుకోవట్లేదు?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూ తప్పదా... ఒమిక్రాన్ ఆంక్షలు ఎప్పటి నుంచి?
- కోవిడ్ -19తో మగవాళ్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందా... ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎలా?
- చైనా: ప్రపంచ ఆయుధ పోటీలో డ్రాగన్‌దే విజయమా?
- శ్యామ్ సింగరాయ్ రివ్యూ: అన్నీ ఉన్న కథలో ఆ ఒక్క ఎలిమెంట్‌ను దర్శకుడు ఎలా మిస్సయ్యారు?
- హిందూ రాజ్యం: హరిద్వార్ ధర్మ సంసద్‌లో వివాదాస్పద ప్రసంగాలపై కలకలం.. ఎవరెవరు ఏమన్నారు?
- ఉత్తర తెలంగాణపై దండెత్తిన కోతులు.. కొండ ముచ్చులు వీటికి చెక్ పెట్టగలవా?
- అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు ప్రమాదకరమా? కళ్లు పచ్చగా ఉంటే బాక్సులో పెట్టాలా? ఎండలో పెడితే సరిపోతుందా?
- బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. గర్ల్‌ఫ్రెండ్‌కు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)