ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల జాబితా ఇదేనా...

మంత్రివర్గం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే, కొత్త మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు? పాత క్యాబినెట్లో ఎవరెవరికి మళ్లీ స్థానం దక్కుతుంది? దీనికి సంబంధించిన తుది జాబితాను సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత మూడు రోజులుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు.

ఈ జాబితా ఖరారైంది. అనధికారికంగా విడుదలైంది. అయితే, ఇంకా అధికారికంగా జాబితాను విడుదల చేయలేదదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారికి ఇప్పటికే ఫోన్ చేసి సమాచారాన్ని తెలిపినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

సోమవారం ఉదయం 11.31 గంటలకు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి ఈ తుది జాబితా ఇదే. అయితే, చివరి నిమిషంలో ఇందులో చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కొత్త మంత్రివర్గంలో సభ్యులు వీళ్లే…

మంత్రివర్గం

ఇదిలా ఉంటే, కొడాలి నాని, మల్లాది విష్ణు, ప్రసాదరాజు, కొలగట్ల వీరభద్రస్వామిలకు క్యాబినెట్ హోదా కలిగిన పదవులు ఇస్తారని సమాచారం. కొడాలి నానికి ఏపీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి దానికి అధ్యక్షునిగా నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలుస్తోంది.

మల్లాది విష్ణుకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఖాయమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ స్వీకర్‌గా కొలగట్ల వీరభద్ర స్వామి, చీఫ్ విప్‌గా ప్రసాదరాజులను నియమించే అవకాశాలున్నాయి.

జగన్ తొలి మంత్రి వర్గంలో ముగ్గురు మహిళలు ఉండగా, కొత్త క్యాబినెట్లో ఆ సంఖ్య నాలుగుకు పెరుగుతోంది. తానేటి వనిత (ఎస్పీ), ఆర్కే రోజా (ఓసీ), ఉషశ్రీ చరణ్ (బీసీ), విడదల రజనీ (బీసీ) కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. వీరిలో తానేటి వనిత కాకుండా మిగతా ముగ్గురూ కొత్తవారే.

మడకశిర నియోజకవర్గం నుంచి మోపూరుగుండు తిప్పేస్వామి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ, చివరిదశలో తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

విడదల రజని
ఫొటో క్యాప్షన్, విడదల రజని
గుడివాడ అమర్‌నాథ్
ఫొటో క్యాప్షన్, గుడివాడ అమర్‌నాథ్
బూడిద ముత్యాలనాయుడు
ఫొటో క్యాప్షన్, బూడిద ముత్యాలనాయుడు

మొత్తంగా, ఈసారి ప్రకాశం జిల్లాకు మంత్రి పదవి దక్కలేదని తెలుస్తోంది. కులాలవారీగా చూస్తే కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ సామాజిక వర్గాలకు కూడా కొత్త మంత్రివర్గంలో చోటు దక్కలేదనే విమర్శలు కూడా అప్పుడే వినిపిస్తున్నాయి.

పల్నాడులో నిరసనలు

జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి. రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనగా మండల కేంద్రమైన రెంటచింతలలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు తగలపెట్టారు.

రాస్తారోకో నిరసన కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం మహిళ నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు.

మంత్రుల రాజీనామాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రుల రాజీనామాను గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ఆమోదించారు. మొత్తం 24 మంది మంత్రుల రాజీనామాను ఆయన ఆంగీకరించారు. తదుపరి మంత్రివర్గం కొలువుదీరేవరకు ఆయా మంత్రుల శాఖలన్నీ ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉంటాయని ఆయన తెలిపారు.

సజ్జల రామకృష్ణారెడ్డి

'క్యాబినెట్ పునర్వవస్థీకరణలో సామాజిక న్యాయం పాటించారు' - సజ్జల

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వవస్థీకరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నింటికీ ప్రాధాన్యత ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత కొత్త మంత్రుల జాబితాను ఫైనల్ చేశారని చెప్పారు.

బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్లాస్‌లు కాదు... బ్యాక్‌ బోన్ అని ఆయన అభివర్ణించారు. నినాదంగా ఉన్న సామాజిక న్యాయాన్ని నిజం చేశారని అన్నారు.

కొత్త కేబినెట్‌లో బీసీ, మైనార్టీలు 11 మంది, ఎస్సీలు అయిదుగురు, ఎస్టీలు ఒకరికి, ఓసీలు ఎనిమిది మందికి చోటు కల్పించినట్లు చెప్పారు. మహిళలకు కూడా ప్రాధాన్యం లభించిందని చెప్పారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు వేగంగా అంతరించిపోతోందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)