IPL-2022 వేలం: హైదరాబాద్ ప్లేయర్ ఠాకూర్ తిలక్‌ వర్మకు ముంబయి బంపర్ ఆఫర్, అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్‌కు రూ. 50 లక్షలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్

ఫొటో సోర్స్, ANI

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ కోసం రెండో రోజు ఆదివారం మెగా వేలం కొనసాగుతోంది.

రెండో రోజు వేలంలో హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ వేలంలోకి రాగా... ముంబై ఇండియన్స్ జట్టు రూ. 1.70 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

తల్లిదండ్రులతో తిలక్ వర్మ

ఫొటో సోర్స్, Tilak Varma/Instagram

ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రులతో తిలక్ వర్మ

తాజాగా అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను గెలిపించిన యువ సారథి యశ్ ధుల్, ఢిల్లీ క్యాపిటల్స్ వశమయ్యాడు.

యశ్ దుల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, యశ్ దుల్

వరల్డ్ కప్ టోర్నీలో బ్యాటుతో మంచి ప్రదర్శన కనబర్చినప్పటికీ వేలంలో ఫ్రాంచైజీలు ఆయన కోసం పోటీపడలేదు. రూ. 50 లక్షల ధరకు దిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

జైదేవ్ ఉనాద్కట్ రూ. 1.30 కోట్లకు ముంబై సొంతం కాగా.... ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌పై గుజరాత్ టైటాన్స్ రూ. 3.20 కోట్లను వెచ్చించింది. పంజాబ్ కింగ్స్ రూ. 2 కోట్లకు రాజ్ అంగద్‌ను, రాజస్తాన్ రాయల్స్ రూ. 2.60 కోట్లకు నవదీప్ సైనీని, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4.2 కోట్లకు చేతన్ సకారియాను కైవసం చేసుకున్నాయి.

ఇషాంత్ శర్మ, పుజారాలకు నిరాశ

భారత ప్లేయర్లు ఇషాంత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, సౌరభ్ తివారీలకు రెండో రోజూ వేలంలో నిరాశ తప్పలేదు. వారి పేర్లు వేలానికి రాగా ఏ ఫ్రాంచైజీ వారిపై ఆసక్తి చూపలేదు. న్యూజీలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్, ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్, దక్షిణాఫ్రికా బౌలర్ లుంగీ ఎన్‌గిడీలను కూడా ఫ్రాంచైజీలు కొనలేదు.

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్, ఇయాన్ మోర్గాన్... ఆస్ట్రేలియా ప్లేయర్లు మార్నస్ లబ్‌షేన్, ఆరోన్ ఫించ్ కూడా అన్‌సోల్డ్ జాబితాలోనే ఉండిపోయారు.

రెండో రోజు వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్‌కు అధిక ధర

ఆదివారం వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ అధిక ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ జట్టు రూ. 11.50 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. అతడితో పాటు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియాన్ స్మిత్‌ను రూ. 6 కోట్లకు సొంతం చేసుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు చాలా సేపు పోటీపడ్డాయి. చివరకు రూ. 8 కోట్లకు అతను ముంబయి సొంతమయ్యాడు.

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 7.75 కోట్లకు, టిమ్ డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8.25 కోట్లకు దక్కించుకున్నాయి.

రెండో రోజు వేలం దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎయిడెన్ మార్క్‌రమ్‌తో ప్రారంభమైంది. రూ. 2.6 కోట్లకు అతను సన్‌రైజర్స్ జట్టులో చేరాడు. అతనితో పాటు మార్కో జెన్సన్‌ను రూ. 4.2 కోట్లకు సన్‌రైజర్స్ దక్కించుకుంది. కోటి రూపాయల వేలంతో అజింక్యా రహానేను కోల్‌కతా సొంతం చేసుకుంది. శివమ్ దూబే కోసం చెన్నై రూ. 4 కోట్లు కేటాయించింది. విజయ్‌శంకర్‌ను రూ. 1.40 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.

అన్‌క్యాప్డ్ కేటగిరీలో అవేశ్ ఖాన్ రూ. 10 కోట్ల మొత్తానికి లక్నో సూపర్ జెయింట్స్ సొంతమయ్యాడు. గత సీజన్‌లో రూ. 70 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు.

ఇషాన్ కిషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇషాన్ కిషన్

శనివారం నాటి వేలం వివరాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ కోసం శనివారం ప్రారంభమైన మెగా వేలంలో టీమిండియా యువ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అత్యధిక విలువను సొంతం చేసుకున్నాడు.

ఇషాన్ కిషన్‌ను దక్కించుకోవడం కోసం తీవ్రంగా పోటీపడిన ముంబై ఇండియన్స్ చివరకు రూ. 15.25 కోట్ల రికార్డు మొత్తానికి అతడ్ని దక్కించుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

మరో టీమిండియా యువ ఆటగాడు దీపక్ చహర్ కోసం కూడా వేలంలో ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చహర్‌ కోసం తలపడ్డాయి. అనంతరం రాజస్తాన్ రాయల్స్ కూడా ఈ పోటీలో చేరింది.

చివరకు రూ. 14 కోట్ల భారీ మొత్తానికి చహర్‌ను చెన్నై సొంతం చేసుకుంది. శనివారం నాటి వేలంలో రూ. 15.25 కోట్లతో ఇషాన్ కిషన్ అత్యంత విలువైన ఆటగాడిగా నిలవగా, దీపక్ చహర్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

దీపక్ చహర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, దీపక్ చహర్

వీరి తర్వాతి స్థానం శ్రేయస్ అయ్యర్ సొంతం చేసుకున్నాడు. వేలం కంటే ముందు నుంచే అయ్యర్‌పై చాలా అంచనాలు నెలకొన్నాయి.

అంచనాలకు తగినట్లుగానే అతని కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ, బెంగళూరు పోటీపడ్డారు. రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌తో అయ్యర్ వేలంలోకి వచ్చాడు. చివరకు కోల్‌కతా ఈ ఆటగాడిని రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది.

శ్రేయస్ అయ్యర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా అయ్యర్ పేరు తెచ్చుకున్నాడు. కానీ గత సీజన్లలో అతను ప్రత్యేకమైన ప్రదర్శనను ఇవ్వలేకపోయాడు.

గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని కూడా కోల్పోవాల్సి వచ్చింది. శ్రేయస్ స్థానంలో రిషభ్ పంత్‌కు ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అయ్యర్‌ను రిటెయిన్ చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

వెస్టిండీస్‌తో జరుగుతోన్న సిరీస్‌లో సత్తా చాటుతోన్న పేసర్ ప్రసిధ్ కృష్ణపై కూడా కాసుల జల్లు కురిసింది. ఈ యువ పేసర్‌ను రాజస్తాన్ రాయల్స్ రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ జట్టు లాకీ ఫెర్గూసన్ కోసం రూ. 10 కోట్లు వెచ్చించింది.

ఉత్కంఠగా జరుగుతోన్న ఐపీఎల్ వేలంలో చిన్న అపశ్రుతి దొర్లింది. వేలం నిర్వాహకుడు హ్యు ఆడమ్స్ అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడటంతో కాసేపు వేలం ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

కాస్త విరామం తర్వాత తిరిగి వేలం ప్రక్రియ కొనసాగింది. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 8.75 కోట్లకు వాషింగ్టన్ సుందర్‌ను, లక్నో సూపర్ జెయింట్స్ 8.25 కోట్లకు కృనాల్ పాండ్యాను సొంతం చేసుకున్నాయి.

మిచెల్ మార్ష్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ పోటీపడ్డాయి. అయితే అనూహ్యంగా రూ. 6.50 కోట్లకు ఢిల్లీ జట్టు అతన్ని కొనుగోలు చేసింది.

అన్‌క్యాప్డ్ ప్లేయర్లూ మెరిశారు

అన్‌క్యాప్డ్ ప్లేయర్లు షారుక్ ఖాన్, రాహుల్ తేవటియాలపై కూడా ఫ్రాంచైజీలు నమ్మకముంచాయి. గత సీజన్‌లో పంజాబ్ తరఫున ఆడిన షారుక్ ఖాన్‌ను ఈసారి కూడా పంజాబ్ రూ. 9 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్ తేవటియాను కూడా గుజరాత్ రూ. 9 కోట్లకు దక్కించుకుంది.

మరో అన్‌క్యాప్డ్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 8.50 కోట్లకు కొనుగోలు చేయగా... శివమ్ మావి, రూ. 7.25 కోట్లకు కేకేఆర్ సొంతమయ్యాడు. అభిషేక్ వర్మను రూ. 6.5 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.

అన్‌క్యాప్డ్ కేటగిరీలో అవేశ్ ఖాన్ రూ. 10 కోట్ల మొత్తానికి లక్నో సూపర్ జెయింట్స్ సొంతమయ్యాడు. గత సీజన్‌లో రూ. 70 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

రూ. 10 కోట్ల క్లబ్‌లోని శార్దుల్, హర్షల్

హర్షల్ పటేల్, నికోలస్ పూరన్, శార్దుల్ ఠాకూర్ కూడా రూ. 10 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయారు. గత సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి 'పర్పుల్ క్యాప్'ను దక్కించుకున్న హర్షల్ పటేల్‌పై చెన్నై, ముంబై, లక్నో ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 10.5 కోట్లకు అతన్ని వేలంలో దక్కించుకుంది.

వెస్టిండీస్ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 10.75 కోట్లు వెచ్చించింది. శార్దుల్ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌తో వేలం ప్రక్రియ ప్రారంభమైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ధావన్‌ను పంజాబ్ కింగ్స్ జట్టు రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్‌లో ధావన్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. నితీశ్ రాణా (రూ. 8 కోట్లు) కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చేరాడు.

ఆర్‌సీబీ జట్టులో కార్తీక్, చెన్నైకి రాయుడు

భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ కోసం గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీ పడగా... రూ. 6.25 కోట్లకు గుజరాత్ అతన్ని దక్కించుకుంది. దీపక్ హుడాను లక్నో రూ. 5.75 కోట్లకు కొనుగోలు చేసింది.

గతేడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై జట్టులో సభ్యుడైన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఫాప్ డుప్లెసిస్ కోసం సీఎస్కే, ఆర్‌సీబీ జట్లు ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నాయి. చివరకు ఆర్‌సీబీ రూ. 7 కోట్లు చెల్లించేందుకు ముందుకు రావడంతో సీఎస్కే వెనక్కి తగ్గింది. దీంతో ఈసారి డుప్లెసిస్, ఆర్‌సీబీ తరఫున బరిలో దిగనున్నాడు.

దక్షిణాఫ్రికా ప్లేయర్ కగిసో రబడాను రూ. 9.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సొంతం చేసుకుంది.

వికెట్‌కీపర్ల కేటగిరీలో ఇషాన్ కిషన్‌ను అత్యధిక ధరకు ముంబై సొంతం చేసుకోగా... అంబటి రాయుడు గురించి చెన్నైతో పాటు ఢిల్లీ పోటీపడింది. కానీ రూ. 6.75 కోట్లకు రాయుడు, చెన్నై సొంతమయ్యాడు. జానీ బెయిర్‌స్టో (రూ. 6.47 కోట్లు)ను పంజాబ్, దినేశ్ కార్తీక్ (రూ. 5.50 కోట్లు)ను ఆర్‌సీబీ దక్కించుకున్నాయి.

సురేశ్ రైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సురేశ్ రైనా

ఐపీఎల్ స్టార్లను పట్టించుకోని ఫ్రాంచైజీలు

ఐపీఎల్ తొలిరోజు మెగా వేలంలో సురేశ్ రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రైనా కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చాడు. రైనాతో పాటు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ వైపు కూడా ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్, అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీలకు కూడా నిరాశ తప్పలేదు. భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను కూడా ఎవరూ పరిగణలోకి తీసుకోలేదు.

ఢిల్లీ సొంతమైన డేవిడ్ వార్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎన్నో విజయాలు అందించిన ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. రూ. 6.25 కోట్లకు ఢిల్లీ అతన్ని సొంతం చేసుకుంది. వేలం ముందు నుంచే డేవిడ్ వార్నర్‌పై అందరి దృష్టి నెలకొంది. గత సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన హైదరాబాద్ కొన్ని మ్యాచ్‌ల్లో పక్కకుబెట్టింది. దీనిపై వార్నర్ బహిరంగంగానే తన ఆవేదనను వెళ్లగక్కాడు.

ఈసారి వేలంలో ఫ్రాంచైజీలన్నీ వార్నర్ కోసం పోటీపడతాయని, ఆయనకు అధిక ధర పలుకుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.

డేవిడ్ వార్నర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డేవిడ్ వార్నర్

వెస్టిండీస్ ప్లేయర్ షిమ్రోన్ హెట్‌మైర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ చాలా సమయం పాటు పోటీపడ్డాయి. రూ. 8.5 కోట్లకు హెట్‌మైర్‌ను, రూ. 7.75 కోట్లకు భారత యువ బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్‌ను రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

కాసుల వర్షంలో తడిసిన మరికొంత మంది ఆటగాళ్లు వీరే...

  • కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ నితీశ్ రాణా కోసం చాలా ఫ్రాంచైజీలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. కానీ రూ. 8 కోట్లకు కోల్‌కతా అతన్ని రిటెయిన్ చేసుకుంది.
  • వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరిచాయి. కానీ కొత్త జట్టు లక్నో రూ. 8.75 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది.
  • భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రూ. 5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ సొంతమయ్యాడు.
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 10

  • దక్షిణాఫ్రికా ప్లేయర్ క్వింటన్‌ డికాక్, మనీశ్ పాండే ఐపీఎల్ అరంగేట్ర జట్టు లక్నోకు ప్రాతినిధ్యం వహించనున్నారు. డికాక్‌ను రూ. 6.75 కోట్లకు, మనీశ్ పాండేను రూ. 4.6 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.
  • యాషెస్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 7.25 కోట్లకు దక్కించుకుంది.
  • న్యూజీలాండ్ ప్లేయర్ ట్రెంట్ బౌల్ట్ ధరను రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్ పెంచుకుంటూ పోయాయి. చివరకు బౌల్ట్ రూ. 8 కోట్ల ధరకు రాయల్స్‌ సొంతమయ్యాడు.
  • వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 4.40 కోట్లకు దక్కించుకుంది.

వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వరుసగా...

  • ఇషాన్ కిషన్: రూ. 15.25 కోట్లు, ముంబై ఇండియన్స్
  • దీపక్ చహర్: రూ. 14 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్
  • శ్రేయస్ అయ్యర్: రూ. 12.25 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్
  • నికోలస్ పూరన్: రూ. 10.75 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్
  • వనిందు హసరంగ: రూ. 10. 75 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • శార్దుల్ ఠాకూర్: రూ. 10.75 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్
  • హర్షల్ పటేల్: రూ. 10.5 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • ప్రసిధ్ కృష్ణ: రూ. 10 కోట్లు, రాజస్తాన్ రాయల్స్
  • కగిసో రబడ: రూ. 9.25 కోట్లు, పంజాబ్ కింగ్స్
  • షిమ్రోన్ హెట్‌మైర్: రూ. 8.50 కోట్లు, రాజస్తాన్ రాయల్స్
  • శిఖర్ ధావన్: రూ. 8.25 కోట్లు, పంజాబ్ కింగ్స్
  • ట్రెంట్ బౌల్ట్: రూ. 8 కోట్లు, రాజస్తాన్ రాయల్స్
  • నితీశ్ రాణా: రూ. 8 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్
  • ప్యాట్ కమిన్స్: రూ. 7.25 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్
  • ఫాఫ్ డు ప్లెసిస్: రూ. 7 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • క్వింటన్ డికాక్: రూ. 6.75 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్

ఫ్రాంచైజీలు పట్టించుకోని ఆటగాళ్లు

  • సురేశ్ రైనా
  • స్టీవ్ స్మిత్
  • డేవిడ్ మిల్లర్
  • షకీబుల్ హసన్
  • వృద్ధిమాన్ సాహా
  • మొహమ్మద్ నబీ
  • అమిత్ మిశ్రా

వేలంలో 590 మంది ఆటగాళ్లు

ఐపీఎల్ 15వ సీజన్ కోసం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1214 మంది ప్లేయర్లు బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నుంచి 590 మంది ప్లేయర్లు వేలం బరిలో నిలవగా... అందులో 370 మంది భారతీయులు ఉన్నారు. మిగతా 220 మంది విదేశీ క్రికెటర్లు. ఈసారి అఫ్గానిస్తాన్ నుంచి 17 మంది క్రికెటర్లు, ఆస్ట్రేలియా నుంచి 47 మంది, బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు, ఇంగ్లాండ్ నుంచి 24, ఐర్లాండ్ నుంచి ఐదుగురు, న్యూజీలాండ్ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్ నుంచి 34, జింబాబ్వే, నేపాల్, అమెరికా, స్కాట్లాండ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున, నమీబియా నుంచి ముగ్గురు వేలంలో ఉన్నారు.

ఈ సీజన్‌తో లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాయి. దీంతో ఐపీఎల్ జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరిగింది.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)