ఐపీఎల్ 2021 విన్నర్ సీఎస్‌కే: కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి నాలుగోసారి టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్

ధోనీ సారథ్యంలో సీఎస్‌కే జట్టు నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది

ఫొటో సోర్స్, facebook/IPL

ఫొటో క్యాప్షన్, ధోనీ సారథ్యంలో సీఎస్‌కే జట్టు నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది
    • రచయిత, ఆదేశ్ కూమార్ గుప్తా
    • హోదా, బీబీసీ కోసం

దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్-2021 టైటిల్‌ను మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.

ఫైనల్లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచిన చెన్నై రెండు సార్లు ఈ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగులు తేడాతో ఓడించింది.

దానితోపాటూ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై ఐపీఎల్‌ అత్యంత సమర్థవంతమైన టీమ్‌గా మారింది. అది నాలుగుసార్లు విజేతగా నిలవగా, ముంబయి ఇండియన్స్ ఐదు సార్లు ఈ టైటిల్ గెలిచింది.

శుక్రవారం దుబాయ్‌లో జరిగిన ఫైనల్ పోరులో కోల్‌కతా టీమ్ ఎదుట విజయానికి 193 పరుగుల లక్ష్యం నిలిచింది. కానీ అది మొత్తం 20 ఓవర్లూ ఆడి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ఓపెనర్ ఫాఫ్ డుప్లెసి 86 పరుగుల సాయంతో మూడు వికెట్లే కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది.

కోల్‌కతా నైట్ రైడర్స్

ఫొటో సోర్స్, BCCI/IPL

ఆరంభం అదిరినా... తడబడిన కోల్‌కతా

గెలుపు కోసం 193 పరుగులు చేయడానికి బ్యాటింక్ ప్రారంభించిన కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్ మొదటి వికెట్‌కు 10.4 ఓవర్లలో 91 పరుగులు జోడించి చెన్నై బౌలర్లకు చెమటలు పట్టించారు.

వెంకటేష్ అయ్యర్‌ 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్‌కు అవుట్ అయ్యాడు.

చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, BCCI/IPL

మ్యాచ్ నాటకీయ మలుపు

ఆ తర్వాత చెన్నై బౌలర్ల హవా మొదలైంది. 119 పరుగులకు చేరుకునేసరికే కోల్‌కతా సగం టీమ్ పెవిలియన్ చేరింది. నితీష్ రాణా ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు.

తర్వాత వచ్చిన సునీల్ నారాయణ్ రెండు పరుగులకే వెనుదిరిగాడు. ఆ వికెట్ పడిన సంబరాలు ఇంకా ముగియక ముందే శుభ్‌మన్ గిల్‌ను ఎల్‌బీడబ్ల్యు చేసి చాహర్ చెన్నై జట్టుకు మరింత జోష్ ఇచ్చాడు.

శుభ్‌మన్ 43 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. అప్పటికి స్కోర్ 4 వికెట్లకు 108.

119 పరుగుల దగ్గర కోల్‌కతా ఐదో వికెట్ కోల్పోయింది. దినేష్ కార్తీక్ 9 పరుగులే చేసి రవీంద్ర జడేజాకు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికే జడేజా షాకిబ్ అల్ హసన్‌ వికెట్ కూడా తీశాడు. అతడు ఖాతా తెరవకుండానే ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు.

తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠీ కూడా రెండు పరుగులకే అవుట్ అయ్యాడు. మొత్తం సీజన్‌లో సరిగా రాణించని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫైనల్లో కూడా అదే ఫామ్ కొనసాగించాడు. కేవలం నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు.

మొత్తం జట్టులో నలుగురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. చివరికి 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేయగలిగిన కోల్‌కతా ఓటమి మూటగట్టుకుంది.

కోల్‌కతా స్కోర్ 8 వికెట్లకు 125 పరుగుల దగ్గర ఉన్నప్పుడే మ్యాచ్ పూర్తిగా చెన్నై చేతుల్లోకి వచ్చేసింది. స్టేడియంలో చెన్నై చెన్నై అంటూ అరుపులు మొదలయ్యాయి..

శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, జోష్ హేజల్‌వుడ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో చెరో వికెట్ పడగొట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

చెన్నై ఇన్నింగ్స్

అంతకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించాడు.

వికెట్ మీద గడ్డి లేకపోవడంతో బౌన్స్ ఒకేలా ఉంది. అంటే వికెట్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంది. దీంతో మోర్గాన్ మొదటి నిర్ణయమే తప్పు అనిపించింది.

దానిని పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకున్న చెన్నై బ్యాట్స్‌మెన్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేయగలిగారు. షార్జాలో ఆడిన మ్యాచ్‌లతో పోలిస్తే దుబాయ్ వికెట్ అద్భుతంగా ఉందని నిరూపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఓపెనర్ల జోరు

చెన్నై ఓపెనర్లు రితురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసీ మొదటి వికెట్‌కు 8.1 ఓవర్లలో 61 పరుగుల భాగస్వామ్యం అందించారు. కోల్‌కతా మిస్టరీ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్‌లను దీటుగా ఎదుర్కున్నారు.

రితురాజ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 32 పరుగులు చేసి సునీల్ నారాయణ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

రితురాజ్, డుప్లెసీ జోడీ ఈ సీజన్‌లో మొత్తం 796 పరుగులు చేశారు. దీనిని బట్టి ఇద్దరూ ప్రత్యర్థులకు ఎంత ప్రమాదకరంగా మారారో నిరూపితం అవుతుంది.

డుప్లెసీ క్యాచ్ వదిలినందుకు మూల్యం చెల్లించారు

ఓపెనర్ డుప్లెసీ 59 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 86 పరుగులు చేశాడు.

అతడికి ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో లైఫ్ వచ్చింది. తన రెండో ఓవర్ వేస్తున్న షాకిబ్ అల్ హసన్ తొలి బంతికే వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అతడిని స్టంప్ చేసే అవకాశం చేజార్చుకున్నాడు.

షాట్ కొట్టేందుకు డుప్లెసీ క్రీజు వదిలి ముందుకెళ్లాడు. కానీ దినేష్ కార్తీక్ ఆ బంతిని సరిగా ఒడిసిపట్టుకోలేకపోయాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఉతప్ప, మొయిన్ అలీ సిక్సర్ల వర్షం

రితురాజ్ అవుటైన తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప 15 బంతుల్లోనే 3 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. అతడు అవుటైన తర్వాత వచ్చిన మొయిన్ అలీ కూడా 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి రన్ రేట్ మరింత పెంచడంతోపాటూ చెన్నై 192 పరుగులు చేయడానికి సాయంగా నిలిచాడు.

చెన్నై ఓపెనర్లు

ఫొటో సోర్స్, BCCI/IPL

చేతులెత్తేసిన బౌలర్లు

కోల్‌కతా ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ 4 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చి వికెట్ పడగొట్టలేకపోయాడు. బహుశా ఈ సీజన్‌లో ఇది అతడి అత్యంత చెత్త ప్రదర్శన.

సునీల్ నారాయణ్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి 26 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టగలిగాడు. మరోవైపు శివమ్ మావీకి ఒక వికెట్ దక్కింది.

టైటిల్ గెలిచిన తర్వాత మాట్లాడిన చెన్నై ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ జట్టుకు మొదటి వికెట్ చాలా అవసరం అయ్యిందని, అది పడగానే తాము మ్యాచ్‌లోకి బాక్ అయ్యామని చెప్పాడు.

ఇక్కడ అద్భుతం ఏంటంటే చెన్నై టీమ్‌ను వెటరన్స్ టీమ్ అంటారు. ధోనీ 40 దాటగా, బ్రావో 38, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప 36 ఏళ్లకు చేరారు, మొయిన్ అలీ, జడేజా కూడా 30 దాటారు.

చెన్నై ఇంతకు ముందు 2010, 2011, 2018లో ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. గత ఏడాది ఈ జట్టు ఏడో స్థానంలో నిలిచింది.

రితురాజ్ గైక్వాడ్‌కు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ లభించింది. అతడు మొత్తం 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులు చేశాడు. డుప్లెసీ కూడా 16 మ్యాచుల్లో 633 చేశాడు. ఈసారీ చెన్నైకు ఈ ఇద్దరే టైటిల్ తెచ్చిపెట్టినట్టు అనిపిస్తోంది.

తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌కు రూ.20 కోట్ల చెక్ అందించాడు.

తన జట్టు గురించి మాట్లాడిన ధోనీ తమ గురించి చాలా మంది చాలా చెబుతారని, కానీ ఈ ఫార్మాట్‌లో పది, 20 నిమిషాల ప్రదర్శన మొత్తం ఆటనే మార్చేస్తుందని అన్నాడు.

తర్వాత మిస్టర్ కూల్ ధోనీ ట్రోఫీ తన చేతికి ఇవ్వగానే దానిని తన జట్టులోని మిగతా ఆటగాళ్లకు అందించడంతో మైదానంలో మరో అద్భుతమైన క్షణంగా నిలిచింది.

తర్వాత ఐపీఎల్‌లో 12 జట్లు ఆడనున్నాయి. అప్పటికి ధోనీ చెన్నైతో ఉండకపోవచ్చు. ఎందుకంటే "అది జట్టు ఆటగాళ్లను మళ్లీ కొనడంపై ఆధారపడి ఉంటుంది" అని అతడు చెప్పాడు.

ఇక ముందు కూడా ఆడతానని ధోనీ చెప్పాడు. అతడి అభిమానులకు ఇంతకు మించిన శుభవార్త వేరే ఏముంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ, ప్రస్తుతానికి ధోనీ చెన్నైకి మరోసారి సంబరాలు తీసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)