IPL Auction: ఎవరీ క్రికెట్‌ షారుఖ్‌ ఖాన్‌... చెన్నై సూపర్‌ కింగ్స్‌ను కాదని పంజాబ్‌ కింగ్స్‌ జట్టులోకి ఎలా వెళ్లాడు?

షారుఖ్ ఖాన్ తాను రజినీకాంత్ కు వీరాభిమానినని చెప్పారు.

ఫొటో సోర్స్, premrpk124/twitter

ఫొటో క్యాప్షన్, షారుఖ్ ఖాన్ తాను రజినీకాంత్ కు వీరాభిమానినని చెప్పారు.
    • రచయిత, హరికృష్ణ పులుగు
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

తమిళనాడులో పుట్టి పెరిగిన క్రికెటర్ షారుఖ్‌ ఖాన్‌ గురువారం జరిగిన ఐపీఎల్‌ వేలంలో రూ.5.25 కోట్లకు అమ్ముడవడంతో వార్తల్లో నిలిచాడు.

పాతికేళ్ల ఈ ఆల్‌రౌండర్‌ నటి ప్రీతిజింతా సహ యజమానిగా ఉన్న పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో ఆడబోతున్నాడు.

వేలం సందర్భంగా పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఆఫర్‌ చేసిన ప్రైస్‌కు ఎవరూ పోటీ రాకపోవడంతో “షారూఖ్‌ మా వైపు వచ్చేశారు” అంటూ ప్రీతీ జింతా హీరో షారుఖ్‌ కుమారుడిని చూస్తూ సరదాగా కామెంట్‌ చేస్తున్న దృశ్యాలను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది.

అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా వేలంలోకి వచ్చిన షారుఖ్‌కు రూ.20 లక్షలను బేస్‌ప్రైస్‌గా నిర్ణయించారు. వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు షారుఖ్‌ కోసం పోటీ పడ్డాయి.

చివరకు పంజాబ్‌ జట్టు రూ.5.25 కోట్లకు షారుఖ్‌ను తన జట్టులోకి తీసుకుంది.

ఐపీఎల్‌ వేలంలో షారుఖ్‌ సక్సెస్‌ను చూసి తమిళనాడు టీమ్‌ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలను దినేశ్‌ కార్తీక్‌ ట్వీట్‌ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అరంగేట్రం ఎలా జరిగింది?

14 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున జూనియర్‌ టోర్నమెంట్‌లో ఆడిన షారుఖ్‌ ఖాన్‌ బెస్ట్‌ ఆల్‌ రౌండర్‌ అవార్డు గెలుచుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌ జట్టు సభ్యుడిగా మారాడు.

బ్యాటింగ్‌లో హార్డ్‌ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న షారుఖ్‌ బౌలింగ్‌ కూడా చేయగలడు. ఇప్పటి వరకు ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేసిన ఇతడు, ఫాస్ట్‌ బౌలింగ్‌పై దృష్టి పెట్టి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

“బ్యాట్‌ను బలంగా ఉపయోగించగలిగే శక్తి నాలో సహజంగానే ఉంది. నా శరీర సౌష్టవమే దీనికి కారణం. బౌలింగ్‌ కూడా బాగా చేయగలను. అందుకే ఇప్పుడు దాని‌ మీద దృష్టి పెట్టాను” అని షారుఖ్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో అన్నాడు.

పేరు అగ్రనటుడు షారుఖ్‌ఖాన్‌ది అయినా ఈ క్రికెట్‌ షారుఖ్‌, రజినీకాంత్‌కు వీరాభిమానినని, ఆయన నటించిన బాషా సినిమాను చాలాసార్లు చూశానని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పాడు.

“హీరో షారుఖ్‌ఖాన్‌కు మా పిన్ని వీరాభిమాని. అందుకే నాకు ఆ పేరు పెట్టారు” అని షారుఖ్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో అన్నాడు. షారుఖ్‌ రజినీకాంత్‌తో దిగిన ఓ ఫొటోను ఓ యూజర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

2014లో తమిళనాడు జట్టు తరఫున క్రికెట్‌లోకి ప్రవేశించిన షారుఖ్‌ఖాన్‌ 2013-14లో విజయ్‌ హజారే ట్రోఫీలో పాల్గొన్నాడు.

తమిళనాడు తరఫున సయ్యద్‌ ముస్తాఖ్‌ అలీ ట్రోఫీలో పాల్గొనడం ద్వారా టీ-20 క్రికెట్‌లో ప్రవేశించాడు. అప్పుడు ఇతని వయసు 18 సంవత్సరాలు.

తొలి టోర్నీలో గోవాతో ఆడిన మ్యాచ్‌లో 8 బంతుల్లో 21 పరుగులు పరుగులు సాధించాడు. ఐపీఎల్‌ గత సీజన్‌ వేలంలో షారుఖ్‌ అన్‌సోల్డ్‌ ఆటగాడిగా మిగిలిపోయిన ఆయన, ఈసారి మంచి ధరకు అమ్ముడయ్యాడు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)