Amir Liaquat Hussain: ఆయనకు 49, ఆమెకు 18.. పాకిస్తాన్ ఎంపీ మూడో పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ

ఫొటో సోర్స్, TWITTER/AMIR LIYAQUAT
అమిర్ లియాఖత్ హుస్సేన్ వయసు 49 సంవత్సరాలు. ఆయనొక రాజకీయ నాయకుడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పార్టీకి చెందిన ఎంపీ.
ఆయన తీరుపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
తాను సైదా దానియాను మూడో పెళ్లి చేసుకున్నట్లు ట్విటర్‌లో లియాఖత్ హుస్సేన్ వెల్లడించారు. సైదా దానియా వయసు 18 సంవత్సరాలు అని ఆయన చెప్పారు. అంటే ఇద్దరి మధ్య వయసులో 31 సంవత్సరాల వ్యత్యాసం ఉంది.
లియాఖత్ హుస్సేన్ ట్వీట్ చేయడానికి ఒకరోజు ముందు ఆయన రెండో భార్య సైదా తుబ అన్వర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు.
మరో దారి లేక లియాఖత్ హుస్సేన్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
'నా జీవితంలో చోటు చేసుకున్న మార్పును భారమైన హృదయంతో మీకు చెబుతున్నాను. గత 14 నెలలుగా మేమిద్దరం వేర్వేరుగా ఉంటున్న విషయం మా స్నేహితులు, బంధువులకు తెలుసు. మేమిద్దరం మళ్లీ కలుస్తామన్న ఆశ చచ్చిపోయింది. మరో దారి లేక నేను విడాకులు తీసుకోవాల్సి వచ్చింది' అని సైదా తుబ అన్వర్ తన పోస్టులో రాశారు.
'ఇదెంత బాధగా ఉందో మాటల్లో చెప్పలేను. కానీ నేను అల్లాను ప్రార్థిస్తాను. ఇలాంటి కష్ట సమయంలో నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను' అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
వృత్తిరిత్యా టీవీ వ్యాఖ్యాత అయిన 28 ఏళ్ల తుబ అన్వర్‌ను 2018లో లియాఖత్ హుస్సేన్ పెళ్లి చేసుకున్నారు.
ఆ సమయంలో ఆయన మొదటి భార్య ఆయనకు ఫోన్‌లో విడాకులు ఇచ్చారని చెబుతారు.
తుబ అన్వర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మరుసటి రోజే మూడో పెళ్లి చేసుకున్నట్లు లియాఖత్ హుస్సేన్ వెల్లడించారు.
దక్షిణ పంజాబ్‌కు చెందిన సాదత్ కుటుంబానికి చెందిన సైదా దానియాను వివాహం చేసుకున్నట్లు లియాఖత్ హుస్సేన్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భార్య, భర్తల వయసులో 31 సంవత్సరాల తేడా ఉండటం అరుదు. పాకిస్తాన్ చట్టాల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. కానీ హుస్సేన్ చేసుకున్న పెళ్లి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
పాకిస్తాన్‌లో వయసు తక్కువగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారా.. ఈ పద్ధతి దేశంలో సర్వసాధారణం అయిందా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది.
లియాఖత్ హుస్సేన్ పెళ్లిపై చాలా మంది ట్విటర్ యూజర్లు స్పందించారు.
'చట్టబద్ధమైన ప్రతి ఒక్కటి కరెక్ట్ కాదు. 50 ఏళ్ల వ్యక్తి 18 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చట్టబద్ధమే. కానీ ఆయన వయసుతో పోలిస్తే ఆ అమ్మాయి చిన్నపిల్లతో సమానం. ఆమె పుట్టినప్పుడు ఆయన వయసు 32 సంవత్సరాలు' అని పాకిస్తాన్ ట్విటర్ యూజర్ సోనీ కామెంట్ చేశారు.
'మీరు మీ కన్నా చాలా తక్కువ వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి ఇంకా టీనేజ్‌లోనే ఉండి ఉంటే.. ఇద్దరి మధ్య అధికార సమతుల్యత సరిగా ఉండదు. మీ వ్యక్తిత్వం, జీవితంపై మీకు అవగాహన ఏర్పడుతుంది. కానీ 18 సంవత్సరాల అమ్మాయికి అలా ఉండదు. వాళ్లను మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అందుకే అమిర్ లాంటి వాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటారు' అని మరో ట్వీట్‌లో సోనీ అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సోనీ ఒక్కరే ఈ వివాహాన్ని విమర్శించలేదు. ఫలక్ అని మరో యూజర్ కూడా స్పందించారు.
'భార్యలను తమకు నచ్చినట్టుగా మార్చుకునేందుకు చాలామంది తమకంటే తక్కువ వయసున్న వారిని చేసుకుంటున్నారు. వాళ్లు మైనర్లు కాదంటూ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. నాకు 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె వయసు పదేళ్లు ఉందని వాళ్లు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు' అని ఫలక్ అసహనం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
'దురదృష్టం ఏమిటంటే.. పాకిస్తాన్‌లోని చాలా మంది పురుషులు అమిర్ లియాఖత్‌లాగే ఉన్నారు. భార్య, పిల్లల్ని వదిలేయాలి. సమాజంలో హోదా పెంచుకునేందుకు మరో చిన్న పిల్లలాంటి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోవాలి. ఈ విష వలయం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. సమాజం కూడా దీన్ని పూర్తిగా ఆమోదిస్తోంది' అని మహీన్ ఘనీ అనే యూజర్ కామెంట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడాను ప్రతిబింబించేలా కొందరు కొన్ని మీమ్స్ కూడా పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

పోస్ట్ of X ముగిసింది, 6
ఈ వివాహంపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. అయితే, పాకిస్తాన్‌లోని పురుషులందరూ అమిర్ లియాఖత్‌లాగే ఉంటారని చెప్పడం సరికాదని మరికొందరు అంటున్నారు.
అమ్మాయిల అందమే వారికి శాపమా
తమకంటే చాలా తక్కువ వయసు ఉన్న యువతులను పురుషులు పెళ్లి చేసుకోవడానికి గత కారణాలు తెలుసుకునేందుకు బీబీసీ ఉర్దూ పలువురితో మాట్లాడింది.
వాళ్లు చెప్పిన వాటిలో మొట్టమొదటిది, అతి ముఖ్యమైన కారణం అమ్మాయిల అందం.
'అమ్మాయిని చూడటానికి వెళ్లినప్పుడు మేము ఆమె అందాన్ని చూస్తాం. కానీ అమ్మాయికి భర్తను చూసేటప్పుడు మాత్రం మేము అతని వయసును చూడం. కానీ అతనికి ఉన్న డబ్బు, చదువు గురించి చూస్తాం' అని కరాచీలో ఉండే సమీర్ ఖాన్ చెప్పారు.
సమీర్ ఖాన్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
'నేను మా అబ్బాయికి తక్కువ వయసు ఉన్న అమ్మాయితో పెళ్లి చేస్తాను. అప్పుడు తాను ఎక్కువ కాలం అందంగా కనిపిస్తుంది. తమకు కాబోయే కోడలు అందంగా ఉండాలని 80శాతం మంది కోరుకుంటారు' అని అన్నారు.
కానీ అందం ఒక్కటే దీనికి కారణమా?
'వయసు ఎంత తక్కువగా ఉంటే పిల్లలు కనేందుకు అంత ఎక్కువ సమయం దొరుకుతుంది. పెళ్లైన కొత్తలో పిల్లలు వద్దనుకుంటే.. ఆ తర్వాత కూడా పిల్లల్ని కనేందుకు వాళ్లకు సమయం ఉంటుంది. చిన్న వయసు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇది మరో కారణం' అని అన్నారు సమీర్ ఖాన్.
'వారిని నియంత్రించడం సులువు'
పురుషుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లల్ని కని, పెంచి పెద్ద చేయొచ్చన్నది కూడా దీనికి ఒక కారణమని కరాచీకి చెందిన ఆయేషా (పేరు మార్చాం) చెప్పారు. తనకు ఎదురైన అనుభవం ద్వారా ఆమె ఈ విషయం ఒప్పుకున్నారు.
ఆమె మరో కారణం కూడా చెప్పారు.
'ప్రతి ఒక్కరు తమ మాటే నెగ్గాలనుకుంటారు. ముఖ్యంగా తమ చెప్పు చేతల్లో ఉండే కోడలు కావాలని అత్తలు అనుకుంటారు. అలాంటి వారికి తక్కువ వయసున్న యువతులే కావాలి. వయసు ఎక్కువగా ఉంటే వారికి సొంత ఆలోచనలు వస్తాయి. వాళ్లు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. వారిని నియంత్రించడం కష్టం' అని అన్నారు.
'పరిస్థితులు మారుతున్నాయి'
ఇప్పుడు పరిస్థితిలో, ప్రాధాన్యతల్లో మార్పు వస్తోందని రావల్పిండిలో మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న అఫ్జల్ బీబీసీతో చెప్పారు.
'అబ్బాయిల తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చినప్పుడు.. తమకు కోడలిగా వయసు తక్కువగా ఉన్న అమ్మాయి కావాలని అడగడం లేదు. చాలా పెళ్లిళ్లలో అమ్మాయి వయసును అస్సలు పట్టించుకోవడం లేదు' అని ఆయన చెప్పారు.
దీనికి మరో కోణం కూడా ఉందని అఫ్జల్ చెప్పారు.
'యువతులను పెళ్లి చేసుకున్న పురుషులు కూడా ఇప్పుడు కంగారుపడుతున్నారు. ఆ యువతుల భిన్నమైన ఆలోచనలు, ప్రవర్తనను వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు' అని అన్నారు.
పరిశోధన ఏం చెబుతోంది
దక్షిణాసియాలో భార్య, భర్తల మధ్య వయసు వ్యత్యాసం బంగ్లాదేశ్‌లో అత్యంత ఎక్కువగా ఉందని సింగపూర్‌లోని నాన్యంగ్ టెక్నోలాజికల్ యూనివర్శిటీలో సోషల్ సైన్సెస్ విభాగంలో పని చేస్తున్న ప్రేమ్ చంద్ దొమర్జో చెప్పారు.
ఆ తర్వాత స్థానం పాకిస్తాన్‌దేనని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్‌లో భర్త సగటు వయసు భార్యకంటే ఎనిమిదిన్నరేళ్లు ఎక్కువ ఉందని, పాకిస్తాన్‌లో ఈ తేడా ఐదు సంవత్సరాలు ఉందని ప్రేమ్ చంద్ వివరించారు.
గత 35 సంవత్సరాలుగా పాకిస్తాన్‌లోని పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని ఆయన చేసిన పరిశోధన చెబుతోంది. ఈ వయసు తేడా వెనక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయని, ఇవి దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయని ఆయన చెప్పారు.
కానీ 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిల వివాహాలు ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్దంలో 20 శాతం తగ్గాయని 2018లో యునిసెఫ్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:
- పురిటి బిడ్డకి మొదటి స్నానం ఎప్పుడు చేయించాలి.. ఎలా చేయించాలి.. తీసుకోవలసిన జాగ్రత్తలేంటి
- PM CARES: ఈ ఫండ్ మీద కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, అనుమానాలు ఎందుకు వస్తున్నాయి?
- హిజాబ్‌పై ప్రపంచమంతటా ఉన్న వివాదాలేంటి... ఏయే దేశాలు నిషేధించాయి?
- ఉన్నావ్: రెండు నెలల కిందట అదృశ్యమైన యువతి మృతదేహం మాజీ మంత్రి కుమారుడి స్థలంలో దొరికింది
- గోంగూరకు రుచి ఇచ్చే పచ్చిమిర్చి తెలుగు నేలది కాదా... సమోసాలో బంగాళాదుంప ఏ దేశం నుంచి వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)