ఏపీ, తెలంగాణ విభజన సమస్యలపై ముగ్గురు సభ్యుల కమిటీ.. 17వ తేదీన మీటింగ్ పెట్టిన కేంద్ర హోం శాఖ

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు అంశంపై త్రీమెన్ కమిటీ ఏర్పాటయ్యింది.
కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ కమిటీ సమావేశం జరగబోతోంది.
పరిష్కారం కాని విభజన సమస్యలను చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఈ సమావేశం నిర్వహిస్తోంది.
ఈనెల 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
కమిటీలో సభ్యులుగా ఏపీ నుంచి ఎస్.ఎస్.రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు.
ఈనెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతుంది.

ఫొటో సోర్స్, ugc
రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు.
ఏ అంశాలు చర్చించాలన్న దానిపై అధికారులకు కేంద్ర హోంశాఖ సమాచారం అందించింది.
షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాలపై చర్చ ఉంటుంది.
ఏపీ పునర్విభజన చట్టంతో పాటు పలు అంశాలపై చర్చకు రావాలని లేఖలో పేర్కొన్నారు.
ప్రధానంగా తొమ్మిది అంశాలపై సమావేశంలో చర్చలు జరపాలని తెలిపారు.
- ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
- విద్యుత్ వినియోగ అంశాలు
- పన్ను అంశాల్లో సవరణలు
- ఏపీఎస్‌సీఎస్‌సీఎల్, టీఎస్‌సీఎస్‌సీఎల్ సంస్థల్లో నగదు అంశం
- వనరుల సర్దుబాటు
- 7 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి నిధుల అంశం
- ప్రత్యేక హోదా
- పన్ను రాయితీలపై చర్చించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:
- పురిటి బిడ్డకి మొదటి స్నానం ఎప్పుడు చేయించాలి.. ఎలా చేయించాలి.. తీసుకోవలసిన జాగ్రత్తలేంటి
- PM CARES: ఈ ఫండ్ మీద కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, అనుమానాలు ఎందుకు వస్తున్నాయి?
- హిజాబ్‌పై ప్రపంచమంతటా ఉన్న వివాదాలేంటి... ఏయే దేశాలు నిషేధించాయి?
- ఉన్నావ్: రెండు నెలల కిందట అదృశ్యమైన యువతి మృతదేహం మాజీ మంత్రి కుమారుడి స్థలంలో దొరికింది
- గోంగూరకు రుచి ఇచ్చే పచ్చిమిర్చి తెలుగు నేలది కాదా... సమోసాలో బంగాళాదుంప ఏ దేశం నుంచి వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












