చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్‌లు సీఎం జగన్‌ను కలిశాక ఏం చెప్పారంటే

ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తెలుగు సినీ ప్రముఖులు

ఫొటో సోర్స్, AP CMO

ఫొటో క్యాప్షన్, ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తెలుగు సినీ ప్రముఖులు

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నటులు, దర్శకులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

ఇంతకుముందు జనవరి 13న ముఖ్యమంత్రిని హీరో చిరంజీవి కలిశారు. దానికి కొనసాగింపుగా ఈరోజు సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో చిరంజీవితో పాటు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు కూడా ఉన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం చిరంజీవి తదితరులు మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరలకు సంబంధించిన సమస్యకు శుభం కార్డు పడిందని తాము భావిస్తున్నట్లు మీడియా సమావేశంలో చిరంజీవి వెల్లడించారు.

సీఎం జగన్‌ నిర్ణయం మా అందరికీ సంతోషం కలిగించిందని చిరంజీవి తెలిపారు. చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామని చెప్పారు.

ఈ నెల మూడో వారంలో సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారాలకు సంబంధించి ప్రభుత్వం జీవో వచ్చే అవకాశం ఉన్నట్లు చిరంజీవి వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం జగన్‌తో సినీ పరిశ్రమ ప్రముఖుల సమావేశం

ఫొటో సోర్స్, AP CMO

ఫొటో క్యాప్షన్, సీఎం జగన్‌తో సినీ పరిశ్రమ ప్రముఖుల సమావేశం

మరోవైపు పరిశ్రమ సమస్యలు పరిష్కారం అయ్యాయని, ఇవాళ్టి చర్చల్లో నిర్ణయమైన అంశాలను ఈ నెలాఖరులోపు ఉత్తర్వులుగా ఇస్తాం ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు.

‘‘ముఖ్యమంత్రి జగన్ రెండు విషయాలు సినిమా పరిశ్రమను కోరారు. ఒకటి: పండుగ రోజులు, పెద్ద సినిమా రిలీజుల సమయంలో కూడా చిన్న సినిమాలకు చోటు ఉండేలా పరిశ్రమే తనకు తాను ఒక ప్రతిపాదనతో ముందుకు రావాలని. దానికి చిరంజీవి, ప్రభాస్, మహేశ్ సానుకూలంగా స్పందించారు. రెండవది.. విశాఖలో కూడా షూటింగులు జరగాలని కోరారు. దాని కోసం విశాఖలో స్టూడియోలకు భూములు సహా ఇండస్ట్రీ పెద్దలు ఏం కోరితే అది ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్గు జగన్ చెప్పారు’’ అని మంత్రి వెల్లడించారు.

సీఎం ప్రతిపాదనలకు పరిశ్రమ నుంచి సానుకూల స్పందన వచ్చిందని మంత్రి తెలిపారు.

‘‘షూటింగులు ఆంధ్రప్రదేశ్‌లో జరపమన్నారు. తెలుగు సినిమా రెండు రాష్ట్రాల్లో ఉండాలి. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు మంచి పేరు వచ్చింది. దానికి ప్రధాన కారణం తెలుగు వాళ్లు హైబడ్జెట్ సినిమాలు తీయడమే. అలాంటి వాటికి వెసులుబాటు ఇవ్వాలని కోరాం. దానిపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అది సంతృప్తికరం’’ అని చిరంజీవి వెల్లడించారు.

‘‘ప్రజలకీ, సినిమా పరిశ్రమల వారికీ మేలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తెలంగాణ తరహాలో ఆంధ్రలో కూడా సినిమా అభివృద్ధి చెందాలనీ, దానికి కావల్సిన అన్ని అవకాశాలు నేను ఇస్తానని జగన్ చెప్పారు. అందమైన వైజాగ్‌ను షూటింగులకు అనకూలంగా తీర్చిదిద్దాలనుకుంటున్నానని జగన్ చెప్పారు. రెండు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ సమంగా ఎదగాలని కోరుకుంటున్నాం అని సీఎం అన్నారు. ఇకపై ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకుంటామని జగన్ చెప్పారు’’ అని చిరంజీవి మీడియా సమావేశంలో వెల్లడించారు.

Prabhas

ఫొటో సోర్స్, I and PR

‘‘చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. సినిమా పరిశ్రమలో 70 శాతం చిన్న సినిమాలే ఉన్నాయి. వాటిని బతకనివ్వాలి. అందుకు తగిన చర్యలు తీసుకోవాలి’’ దర్శకుడు, నటుడు ఆర్. నారాయణ మూర్తి అన్నారు.

సినీ పరిశ్రమకు వచ్చిన ఈ సమస్య చిరంజీవి చొరవతోనే పరిష్కారమైందని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. అయితే ఇటువంటి సమావేశాలకు పరిశ్రమ తరపున, ఎన్నికైన ప్రతినిధులుగా ఉన్న నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్ వంటి వారిని కూడా పిలవాలని ఆయన సూచించారు.

ఇక నంది అవార్డులను రెండు రాష్ట్రాలూ పునరుద్ధరించేలా చూడాలని నారాయణ మూర్తి చిరంజీవిని కోరారు. అయితే కరోనా కారణంగా ఎక్కువమంది రాలేకపోయారని చిరంజీవి అన్నారు.

చిరంజీవి తనను తాను పరిశ్రమ పెద్ద అనిపించించుకోవడానికి ఇష్టపడకపోయినా, ఇవాళ ఆయన చర్యల ద్వారా సినిమా పరిశ్రమ పెద్దగా నిరూపించుకున్నారని దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యానించారు.

అంతకు ముందు హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వచ్చిన సినీ ప్రముఖులు ఫొటోలు దిగారు. ఈరోజు మహేశ్ బాబు పెళ్లిరోజు కావడంతో బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

జనవరిలో చిరంజీవి, జగన్‌ల మధ్య గంటకు పైగా సమావేశం జరిగింది. ప్రధానంగా టికెట్ ధరల పెంపుపైనే తెలుగు సినిమా పరిశ్రమ ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. అయితే టికెట్ల ధరలతో పాటూ పలు అంశాలపై ఇవాళ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.

ఈ సమావేశానికి నాగార్జున, యన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, దిల్ రాజులు కూడా వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ వారెవరూ రాలేదు.

అటు సినిమా నటుల సంఘం 'మా'కి అధ్యక్షులుగా ఉన్న మంచు విష్ణు ఈ అంశంపై ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆచితూచి మాట్లాడుతున్నారు.

వై.ఎస్. జగన్‌తో ఆయనకు ప్రత్యక్షంగా చుట్టరికం ఉండడం దీనికి కారణంగా చెబుతున్నారు. అయితే ప్రస్తుత సమావేశానికి విష్ణు హాజరు కాలేదు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)