టైరులో చిక్కుకున్న మొసలి మెడ.. ఆరేళ్ల తరువాత తొలగిన కష్టం
ఇండోనేసియాలో ఒక మొసలి మెడ టైరులో ఇరుక్కుపోయింది.
ఆరేళ్లుగా ఆ మొసలి అలాగే తిరుగుతోంది.
గ్రామస్తులందరూ దాన్ని చూస్తున్నారు తప్ప, ఒక్కరు కూడా సాయం చేయలేదు.
కానీ, ఆ టైరు అలా మెడలో ఉండిపోతే.. మొసలి పెరిగే కొద్దీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఒకతను ధైర్యం చేసి, వల తయారు చేశాడు.
కానీ, ఆ వలను కూడా మొసలి ధ్వంసం చేసేసింది.
పట్టువదలకుండా ప్రయత్నించిన ఆ వ్యక్తి.. ఎట్టకేలకు మొసలిని బంధించాడు.
మొసలి మెడలో చిక్కుకుపోయిన టైరును రంపంతో కోసేశాడు. తర్వాత మొసలిని మళ్లీ నీళ్లల్లోకి వదిలేశాడు.

ఇవి కూడా చదవండి:
- బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై కాజల్ అగర్వాల్ రియాక్షన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్
- మగ పిల్లాడు పుట్టేలా చేస్తానని తలలో మేకు కొట్టిన భూత వైద్యుడు
- అమరావతి: 407 ఎకరాల రాజధాని భూములను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందుకు తనఖా పెట్టింది?
- సౌర తుపానులో చిక్కుకున్న స్పేస్ ఎక్స్ రాకెట్.. గాలిలోనే మండిపోయిన 40 ఉపగ్రహాలు
- కర్ణాటక హిజాబ్ వివాదం: అల్లాహు అక్బర్ అన్న విద్యార్థిని ముస్కాన్ వీడియోపై పాకిస్తాన్ ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
