Karnataka Hijab Row: అల్లాహు అక్బర్ అన్న విద్యార్థిని ముస్కాన్ వీడియోపై పాకిస్తాన్ ఏమంటోంది?

కర్ణాటకలో హిజాబ్ ధరించడంపై రేగిన చర్చ మంగళవారం వైరల్ అయిన ఒక వీడియోతో మరింత వేడెక్కింది. దీనిపై స్పందనలు వస్తూనే ఉన్నాయి.
ఈ వీడియోలో మాండ్యా జిల్లాలో ఒక ప్రీ-యూనివర్సిటీ కాలేజీలో హిజాబ్ ధరించిన ఒక విద్యార్థిని తన బైక్ పార్క్ చేసి క్లాస్ వైపు వెళ్తుంటారు. ఒక గుంపు ఆమె వెంటపడడం కనిపిస్తోంది.
కాషాయ కండువాలు మెడలో వేసుకుని ఆవేశంగా జై శ్రీరాం నినాదాలు చేస్తున్న వారంతా విద్యార్థిని వైపు దూసుకొస్తారు. ఆ తర్వాత ఆ విద్యార్థిని కూడా వారి వైపు తిరిగి రెండు చేతులూ పైకెత్తి అల్లాహూ అక్బర్ నినాదాలు చేస్తారు.
ఈ విద్యార్థిని ఎవరు
మీడియాలో వచ్చిన రిపోర్టుల ప్రకారం ఆవేశంగా నినాదాలు చేస్తూ వచ్చిన ఆ గుంపును ఎదిరించిన ఈ విద్యార్థిని పేరు ముస్కాన్. ఆమె మైసూర్-బెంగళూరు హైవేపై ఉన్న పీఈఎస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్నారు.
ముస్కాన్ తర్వాత కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ మొత్తం ఘటన గురించి తన వాదన వినిపించారు.
తనలాగే మరో ఐదుగురు విద్యార్థినులకు కూడా జరిగిందని ముస్కాన్ చెప్పారు. ఈ ఘటన గురించి ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రికతో మాట్లాడారు.
"నేను అసైన్‌మెంట్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నా. కాలేజీలోకి వెళ్లడానికి ముందే హిజాబ్ ధరించినందుకు కొంతమంది విద్యార్థునులను గుంపు ఇబ్బంది పెట్టింది. వాళ్లు ఏడుస్తున్నారు. నేను ఇక్కడకు చదువుకోడానికి వస్తాను. నేను ఆ బట్టలు ధరించడానికి నా కాలేజీ అనుమతిస్తుంది. గుంపులో కేవలం 10 శాతం మాత్రమే మా కాలేజీవాళ్లు. మిగతా అందరూ బయటివాళ్లే. వాళ్ల ప్రవర్తన నన్ను బాధపెట్టింది. నేను దానికి సమాధానం ఇచ్చాను" అన్నారు.
కానీ, తమ కాలేజీ ప్రిన్సిపల్, మిగతా సిబ్బందితోపాటూ హిందూ క్లాస్‌మేట్స్ కూడా తనకు అండగా నిలిచారని ఆమె చెప్పారు.
"మా కాలేజీ మేనేజ్‌మెంట్, ప్రిన్సిపల్ బుర్ఖా వేసుకోకుండా మమ్మల్ని ఎప్పుడూ అడ్డుకోలేదు. కొంతమంది బయటివాళ్లు వచ్చి మాపై ఒత్తిడి పెడుతున్నారు. మమ్మల్ని అడ్డుకోడానికి వీళ్లెవరు. మేం వాళ్ల మాటెందుకు వినాలి?" అన్నారు.
"నేను కాలేజీకి వెళ్లినపుడు, బుర్ఖా వేసుకున్నానని నన్ను లోపలికి వెళ్లనివ్వడం లేదు. నేను ఎలాగోలా లోపలకు చేరుకున్నాను. తర్వాత వాళ్లు జై శ్రీరాం నివాదాలు చేయడం మొదలెట్టారు. దాంతో నేను కూడా అల్లాహు అక్బర్ అని అరవడం మొదలెట్టా" అని ముస్కాన్ ఎన్టీడీవీ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

స్పందనలు
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి స్పందనలు వస్తూనే ఉన్నాయి.
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ హిజాబ్ వివాదం గురించి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"బికినీ, గూంఘట్ అయినా, జీన్స్ లేదా హిజాబ్ అయినా తాము ఏ బట్టలు వేసుకోవాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు. భారత రాజ్యాంగం మహిళలకు ఈ హక్కును అందించింది. మహిళలను వేధించడం ఆపండి" అన్నారు.
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ముస్కాన్, ఆమె తండ్రితో మాట్లాడారు. దీనిపై ఒక ట్వీట్ కూడా చేశారు.
"మాండ్యా పీఈఎస్ కాలేజీలో హిజాబ్ ధరించిన బీబీ ముస్కాన్ ధైర్యంగా హిందుత్వవాదులను ఎదిరించి నిలబడ్డారు. నేను ముస్కాన్, ఆమె తండ్రితో కూడా మాట్లాడాను. ముస్కాన్ ధైర్యాన్ని ప్రశంసించాను, వారిని ప్రోత్సహించాను, ముస్కాన్ తెగువ చూసి మాకు కూడా ధైర్యం వచ్చిందని చెప్పాను" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఒవైసీ మంగళవారం వైరల్ వీడియోను షేర్ చేస్తూ "నేను ఈమె సాహసానికి సలాం చేస్తున్నాను. ఈ యువతిని ఇంత ధైర్యంగా పెంచిన ఆమె తల్లిదండ్రులకు సలాం చేస్తున్నా" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"కర్ణాటకలో బీబీ ముస్కాన్ అనే సోదరికి జరిగిన ఇది బీజేపీ సుపరిపాలనను బట్టబయలు చేసింది. బీజేపీ ప్రభుత్వం గూండాలను పెంచి పోషిస్తోంది. ఆ గుండాలను హింసకు ఉపయోగిస్తోంది. ప్రజాసమస్యల విషయంలో ప్రతిదానిలో విఫలమవుతున్న బీజేపీ ఇలాంటి సమస్యలకు ఆజ్యం పోస్తోంది" అని భీమ్ ఆర్మీ చీఫ్, దళిత నేత చంద్రశేఖర్ ఆజాద్ ట్వీట్ చేశారు.
విమర్శలు
అల్లాహు అక్బర్ నినాదాలు చేసిన విద్యార్థినిని తప్పుదారి పట్టించిన ఒక ఛాందసవాద యువతిగా బీజేపీ జాతీయ ప్రతినిధి సంజూ వర్మ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"అల్లాహు అక్బర్ నినాదాలు చేసి తప్పుదారి పట్టించిన, ఆ చాందసవాద యువతి ఎలాంటి ధైర్యసాహసాలూ ప్రదర్శించలేదు. ఎన్నో ఇస్లామిక్ దేశాలు కూడా హిజాబ్‌ను నిషేధించాయి. #HijabisOurRightను ట్రెండ్ చేస్తున్నవారు, తమకు 18వ శతాబ్దం నాటి మనస్తత్వంలోనే జీవించాలని అనుకుంటూ ఉంటే మదరసాలకు వెళ్లిపొండి" అన్నారు.
కర్ణాటకలో హిజాబ్ విషయంలో చెలరేగిన వివాదంపై హెచ్చరిస్తూ విశ్వహిందూ పరిషత్ ఒక ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
"జిహాదీలు, వారి తరఫున వాదించేవారు హిజాబ్ ముసుగులో అరాచకాలు సృష్టించకుండా దూరంగా ఉండాలి" అన్నారు.
"కర్ణాటక ఉడిపి నుంచి మొదలైన ఈ వివాదం నిజానికి హిజాబ్ ముసుగులో అరాచకం వ్యాపించేలా చేయడానికి జిహాదీలు చేస్తున్న కుట్ర" అని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సల్ తరఫున జారీ చేసిన ఒక ప్రకటనలో చెప్పారు.
పాకిస్తాన్‌లో కూడా స్పందనలు
వీడియోలో అల్లాహు అక్బర్ అంటున్న విద్యార్థినిని పాకిస్తాన్‌లో కూడా ప్రశంసిస్తున్నారు.
పాకిస్తాన్ అధికార పీటీఐ పార్టీ ఆ వీడియోను ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
"ధైర్యానికి ఉదాహరణ. అల్లాహు అక్బర్. మోదీ పాలనలో భారత్‌లో విధ్వంసం మాత్రమే జరుగుతోంది. జిన్నా చెప్పింది నిజమే" అని కామెంట్ చేసింది.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ కూడా భారత్‌లో కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ ధరించడం గురించి రేగిన వివాదంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
"ముస్లిం యువతులకు విద్యను దూరం చేయడం ప్రాథమిక హక్కులు హరించడమే. ఈ ప్రాథమిక హక్కు నుంచి ఒకరిని దూరం చేయడం, హిజాబ్ ధరిచండంపై భయభ్రాంతులకు గురిచేయడం పూర్తిగా అణచివేత చర్య. ముస్లింలను బలవంతంగా ఒకే ప్రాంతానికే పరిమితమయ్యేలా చేయడానికి భారత ప్రభుత్వ వేసిన పథకంలో ఇది భాగం" అన్నారు.
మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రి చౌధరి ఫవాద్ హుసేన్ కూడా ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
"మోదీ భారత్‌లో జరుగుతున్నవి భయానకంగా ఉన్నాయి. అస్థిర నాయకత్వంలో భారత సమాజం వేగంగా పతనం అవుతోంది. మిగతా బట్టలు వేసుకున్నట్లే హిజాబ్ ధరించడం కూడా వ్యక్తిగత ఇష్టం. పౌరులకు ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి" అన్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ రాజకీయ సలహాదారు, మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో ప్రతినిధిగా పనిచేసిన హుసేన్ హక్కానీ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ఆయన అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా కూడా ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
"9/11 ఘటన తర్వాత అమెరికాలో హిజాబ్ ధరించే ముస్లిం యువతులను ఇబ్బంది పెట్టినపుడు, అధ్యక్షుడు బుష్ ఇది అమెరికా విధానం కాదు అన్నారు. భారత్ అంతటా జరుగుతున్న ఇలాంటి ఘటనలు అడ్డుకోడానికి బహుశా నరేంద్ర మోదీ కూడా బహిరంగంగా ఏదైనా మాట్లాడాలి. ఇది సరికాదు." అన్నారు.
పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ హామిద్ మీర్ ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
"విద్వేషాలతో ద్వేషాలను అంతం చేయలేం. కేవలం ప్రేమతోనే అది సాధ్యం అవుతుందని ఒకసారి మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు. ఈ ఘటనను చూస్తుంటే, ఒక ఒంటరి ముస్లిం యువతిని అతివాద హిందువుల ఒక గుంపు ఇబ్బంది పెడుతోంది. ఒంటరి యువతిని చుట్టుముట్టి విద్వేషాలు పెంచకండి" అన్నారు.
పాకిస్తాన్ జర్నలిస్ట్ యాసీఫ్ కూడా వైరల్ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
"ఆమె సివంగిలా కనిపించింది. భారత్‌లో భారత ముస్లింలు, ముస్లిం యువతులతో ఇలా ప్రవర్తించడం చూస్తుంటే, జిన్నా చెప్పిందే నిజమే అని నిరూపితం అవుతోంది." అని కామెంట్ చేశారు.
భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కర్ణాటక కాలేజీలో హిజాబ్ ధరించిన విద్యార్థిని వైరల్ వీడియోను తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ వీడియోతో పోల్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
"అల్లాహు అక్బర్ అనే ఈ అరుపు, నాకు ఐఎస్ఐస్ తల నరికే వీడియోను గుర్తుకుతెస్తోంది" అన్నారు.

ఇవి కూడా చదవండి:
- షేక్ రషీద్: టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన 17 ఏళ్ల తెలుగు కుర్రాడి కథ
- ఆ గిరిజన గ్రామానికి వెళ్లిన వారంతా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు?
- చరిత్రలోనే ‘అత్యంత సుదీర్ఘ యుద్ధం’: మొదలై 70 ఏళ్లు దాటినా ఇంకా ఎందుకు సమాప్తం కాలేదు?
- ‘గంటకు 417 కిలోమీటర్ల స్పీడుతో కారు నడిపాడు..’ ఆ తర్వాత ఏమైందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)